»   »  'బాహుబలి' గ్రాఫిక్స్ బడ్జెట్ ఎంతంటే : రాజమౌళి

'బాహుబలి' గ్రాఫిక్స్ బడ్జెట్ ఎంతంటే : రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' గ్రాఫిక్స్ పరంగా చాలా ఉన్నతమైన నాణ్యతతో రూపొంది ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్రాఫిక్స్ కు ఎంత ఖర్చు పెట్టారు అనేది అందరిలో ఆసక్తికరమైన అంశమే.

ఈ విషయమై ఒక్కొక్కరూ ఒక్కోరకంగా ఊహించారు. అయితే ఈ విషయమై రాజమౌళి ఓ క్లారిటీని రీసెంట్ గా చెన్నైలోని ఐఐటీ స్టూడెంట్స్ ఇచ్చారు. అక్కడ వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ బడ్టెట్ ఎంతో చెప్పారు.


Budget for Bahubali graphics

22 కోట్లు రూపాయలు ఈ చిత్రం గ్రాఫిక్స్ పై ఖర్చు పెట్టినట్లు ఆయన రివీల్ చేసారు. అలాగే తన బాహుబలి చిత్రం గ్రాఫిక్స్ అవతారం, లైఫ్ ఆఫ్ పై చిత్రాలకు పోలిక లేదని తేల్చి చెప్పారు. అయితే అంత తక్కువ ఖర్చుతో హాలీవుడ్ సినిమాల స్టాండడ్స్ లో గ్రాఫిక్స్ చేయించుకున్నామన్నామంటూ గర్వంగా చెప్పారు. ఆ వీడియో ఇక్కడ చూడండి.ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి: ది కన్‌క్లూజన్‌ షూటింగ్‌ గురువారం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైంది. ప్రభాస్, రమ్యకృష్ణ మీద వచ్చే సన్నివేశాలతో ఈ షూటింగ్ ప్రారంభమైంది. రెగ్యులర్ గా ఈ షూటింగ్ ఎటువంటి బ్రేక్ లేకుండా జరగనుంది. గత కొద్ది రోజులుగా ఈ చిత్రం సెట్స్ వేస్తూండటం, స్క్రిప్టుపై కసరత్తులతో టీమ్ గడపింది.

ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. జులై 10న విడుదలైన బాహుబలి: ది బిగినింగ్‌ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే


English summary
Rajamouli said that that only 22 crores were spent on the visual effects of Bahubali.
Please Wait while comments are loading...