»   » విరాళం చెక్ అందచేస్తూ అల్లు అర్జున్(ఫోటో ఫీచర్)

విరాళం చెక్ అందచేస్తూ అల్లు అర్జున్(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  న్యూఢిల్లీ : గురువారం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆలిండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉత్తరాఖండ్ వరద బాధితులకు రూ.15 లక్షల విరాళం ప్రకటించగా.. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తేజ, అల్లు అర్జున్ చెరో పదిలక్షలు విరాళంగా ప్రకటించారు. వీటిని త్వరలోనే ఉత్తరాఖండ్ సీఎం విజయ్‌బహుగుణకు అందించనున్నారు. ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్ వరదల్లో 580 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడించింది.

  బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సమాజ సేవకురాలు జోడీ అండర్‌హిల్‌కు కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి గురువారం రూ.ఐదు లక్షల రివార్డు ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లో వరద లు సంభవించినప్పుడు జోడీ అందించిన సేవలు గుర్తిస్తూ వ్యక్తిగతంగా ఈ అవార్డు ఇస్తున్నట్లు తెలిపారు.

  పర్వతాల శుద్ధికారులు (మౌంటెన్ క్లీనర్స్) పేరిట ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసిన జోడి హిమాలయ పర్వతాల వెంబడి ఉన్న వ్యర్థాలను తొలగిస్తున్నారు. దీంతోపాటు అమె లవ్ ఫర్ టిబెట్, కార్నహోమ్ కమ్యూనిటీ ప్రాజెక్టును కూడా స్థాపించారు. ఉత్తరాఖండ్ వరదల తర్వాత చార్‌ధామ్‌యావూతకు, నైనిటాల్, ముస్సోరి పర్యటనలకు వచ్చేందుకు యాత్రికులు సంకోచిస్తున్నారని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు.


  అల్లు అర్జున్ చెక్ అంద చేస్తున్న ఫోటోలు...

  విరాళం...

  విరాళం...

  విరాళాల చెక్ ని... ఉత్తారాఖండ్ (డెహ్రాడూన్)...డిజాస్టర్ మేనేజ్ మెంట్ ,రెవిన్యూ కోపరేటివ్ మినిస్టర్ యష్ పాల్ ఆర్య కు నాగబాబు, అల్లు అర్జున్ కలిసి అందించారు. ఈ సమయంలో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు.

  వరద భీభత్సం

  వరద భీభత్సం

  ఉత్తరాఖండ్‌లో వరదలు ఇటీవల భారీ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. యమను, భాగీరథి, మందాకిని, అలకనంద తదితర నదుల ఉధృతికి రోడ్లు తెగిపోయాయి. భవంతులు కూలిపోయాయి. వేలాది మంది చనిపోయారు. దాదాపు లక్ష మంది వరదల్లో చిక్కుకుపోవడంతో వారిని సైన్యం కాపాడింది. ఉత్తరాఖండ్ వరదలు సునామిని తలపించాయి. కేదార్, రాంవాడ, గౌరీకుండ్, సోన్ ప్రయాగ, ఉకిమఠ్ తదితర ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోయాయి. వేలాది మంది యాత్రికులే కాకుండా, చాలా జంతువులు చనిపోయాయి. వరదల నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ రాష్ట్ర భక్తులను తీసుకు వచ్చే ప్రయత్నాలు చేశాయి.

  హెచ్చరించారు కానీ..

  హెచ్చరించారు కానీ..

  కేదార్‌నాథ్ ఆలయం కొలువై ఉన్న ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ముప్పు చాలా ఎక్కువగా ఉందని 1882లోనే సైంటిస్టులు హెచ్చరించారు. 1882లో జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు కేదార్‌నాథ్ ఫొటో ఒకటి తీశారు. దాంట్లో కేదార్‌నాథ్ ఆలయానికి సమీపంలో రెండు హిమనీ నదాలు ఉన్నాయి. అవి గనక కరిగి ప్రవహిస్తే ఆ ధాటికి కొట్టుకొచ్చే గండ శిలలు, విరిగిపడే కొండచరియలతో పెను ప్రమాదమని పేర్కొన్నారు.

  కేదార్‌నాథ్ ఆలయం

  కేదార్‌నాథ్ ఆలయం

  మరోవైపు కేదార్‌నాథ్ ఆలయం మందాకినీ నది ప్రవాహమార్గానికి సరిగ్గా మధ్యలో ఉంటుంది. కొండల నుంచి ఆ క్షేత్రానికి ఉండే మార్గం వాలు చాలా ఎక్కువ. దీనివల్ల వరద నీరు అనూహ్య వేగంతో వచ్చి ఆలయం వద్దకు చేరుకుంటుందని అప్పట్లోనే ఆందోళన వ్యక్తమైంది. కాగా సాధారణంగా ఆలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి. పడమటి ముఖంగా ఉండటమూ కద్దు. కానీ కేదార్‌నాథ్‌లోని జ్యోతిర్లింగ స్వరూపుడి ఆలయం దక్షిణాభిముఖంగా ఉండటం విశేషం.

  English summary
  On the eve of Megastar Chiranjeevi's birthday, All India Chiranjeevi fans association has donated Rs.15 lakhs to Uttarakhand flood relief
 fund. Tollywood actor Sri.Allu Arjun has donated Rs.10 lakhs, and also Actor Sri. Ram Charan has donated Rs. 10.lakhs & film nagar
 cultural club has also donated Rs.6 lakhs. Recently Uttarkhand state has been badly affected by the flood which
 has devastated the entire tourist destinations. Sri. Nagababu & Allu Arjun has handed over the cheque’s to
 Sri.Yasphal Arya, Minister for Disaster Management, Revenue and Cooperatives of Uttarakhand, in Dehradun
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more