»   » బన్నీ కెరీర్లోనే డిఫరెంట్? నాపేరు సూర్య

బన్నీ కెరీర్లోనే డిఫరెంట్? నాపేరు సూర్య

Posted By:
Subscribe to Filmibeat Telugu
Allu Arjun's Next Movie Naa Peru Surya Naa Illu India Launched

అల్లు అర్జున్ హీరోగా, అను ఇమ్యున‌ల్ హీరోయిన్ గా వక్కంతం వంశి ద‌ర్శ‌క‌త్వం లో ఇటీవ‌లే పూజాకార్య‌క్రమాలు జ‌రుపుకున్న "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ మధ్యనే హైద‌రాబాద్ లో ప్రారంభ‌మైంది.

యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రలో శరత్ కుమార్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మెగా బ్రదర్ కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మించనున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2018, ఏప్రిల్ 27 న విడుద‌ల చేయ‌టానికి సన్నాహ‌లు చేస్తున్నారు.

అర్జున్ ఓ కీలక పాత్రలో

అర్జున్ ఓ కీలక పాత్రలో

ప్రస్తుతం నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా సినిమాలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరో కాగా అర్జున్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. బన్నీ, అర్జున్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీలో బన్నీ సూర్యగా అలరించనున్నాడు.


హీరో లేకుండానే ఫస్ట్‌ షెడ్యూల్‌

హీరో లేకుండానే ఫస్ట్‌ షెడ్యూల్‌

ఇప్పుడు జరుగుతున్నది సెకండ్‌ షెడ్యూల్‌. హీరో లేకుండానే ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేశారు. త్వరలో హీరోయిన్‌ అనూ ఇమ్మాన్యుయేల్‌ కూడా షూటింగ్‌లో పాల్గొంటుందట. హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతుంటే... వీకెండ్స్‌లో ముంబైలో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి.


రామజోగయ్య శాస్త్రి

రామజోగయ్య శాస్త్రి

విశాల్‌-శేఖర్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో పాటలు రాయడానికి రామజోగయ్య శాస్త్రి, ఆయనతో దర్శకుడు ముంబై వెళ్లారు. ఇంతకు ముందు బన్నీ సినిమాలకు.. ఈ సినిమాకు చాలా వేరియేషన్ ఉందని తెలుస్తోంది. సూర్య క్యారెక్టర్ ఫిట్ నెస్ కోసం బన్నీ స్పెషల్ ఎక్సర్‌సైజులు చేశారని సమాచారం.


బన్నీ చాలా స్టైలిష్ లుక్‌తో

బన్నీ చాలా స్టైలిష్ లుక్‌తో

అంతే కాదు.. లుక్, గెటప్.. డైలాగ్ డెలవరీ అన్నీ కొత్తగానే ఉంటాయని.. బన్నీ చాలా స్టైలిష్ లుక్‌తో కనిపిస్తారని టాక్. బన్నీ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. శిరీష శ్రీధర్ నిర్మాణ సారధ్యంలో వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికి వచ్చిన సమాచారంతో అభిమానులు ఒక అంచనాకు వచ్చేసారు.English summary
Reports are doing the rounds on the internet that Tollywood superstar Allu Arjun will be playing a soldier in his forthcoming film Naa Peru Surya Naa Illu India.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X