»   » అల్లువారి స్విమ్మింగ్: భార్యా కొడుకు తో బన్నీ ఫొటోలు

అల్లువారి స్విమ్మింగ్: భార్యా కొడుకు తో బన్నీ ఫొటోలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ తన కొడుకు...ఆర్యన్ ..ముద్దుచ్చే ఓ చిన్నారి సెలబ్రెటీ. ఈ చిన్నారి బాబు ఏం చేస్తున్నాడు అనేది ఎప్పుడూ అల్లు అభిమానులకు అవసరమే...వినటానికి ఆనందమే. అందుకే సోషల్ మీడియాలో వీరు అప్ డేట్స్ ని ఉంచుతూంటారు అల్లు అర్జున్ దంపతులు. తెలుగు స్టార్లలో సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ కలిగిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు.

ఎఫ్‌బిలో కోటి 20 లక్షల మందికి పైగా ఫ్యాన్స్ ఆయన్ను ఫాలో అవుతుంటారు. తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు బన్నీ తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. తాజాగా బన్నీ తన భార్య స్నేహా రెడ్డితో కలిసి దిగిన ఓ సెల్పీ పిక్ పోస్టు చేసాడు. ఈ ఫొటో పోస్ట్ చేసిన గంటల్లోనే అభిమానుల నుండి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు ఈ ఫోటోకు హాఫ్ మిలియన్‌కు పైగా హిట్స్ వచ్చాయి.

Bunny's Swimming Classes for Son Ayan

తన భార్య స్నేహారెడ్డితో తీయించుకున్న సెల్ఫీని ఆదివారం పోస్ట్‌ చేసిన బన్నీ.. ముద్దుల తనయుడు అయాన్‌తో కలిసి ఈత కొడుతూ తీయించుకున్న ఫోటోను సోమవారం పంచుకున్నాడు. అయాన్‌ పుట్టినరోజు సందర్భంగా బన్నీ తన కుటుంబసభ్యులతో కలిసి గోవాకు విహారయాత్రకు వెళ్లాడు.

Bunny's Swimming Classes for Son Ayan

ఈ ట్రిప్‌లో భాగంగా కొడుకుతో కలిసి స్విమ్మింగ్‌ చేస్తున్న ఫోటోను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు బన్నీ. అంతేకాకుండా 'మా బర్త్‌డే బాయ్‌తో గోవాలో విహారయాత్ర' అంటూ కామెంట్‌ కూడా రాశాడు. ఈ ట్రిప్‌ కోసం బన్నీ 'దువ్వాడ జగన్నాథమ్‌' షూటింగ్‌కు స్వల్ప విరామం ఇచ్చాడు.

English summary
Allu Arjun Family is now in Goa for a Holiday trip. The birthday of Allu Ayaan is being celebrated in this tourist destination. Photograph of Bunny & Ayaan enjoying the swimming session is too adorable.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu