»   » అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా, డైరక్టర్ ఎవరంటే...

అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా, డైరక్టర్ ఎవరంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: అల్లు అర్జున్, రామ్ చరణ్ ఒకే సినిమాలో కనిపించబోతున్నారా, అవుననే వినపడుతోంది. ఎప్పటినుంచో ఈ కాంబినేషన్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ క్షణాలు వచ్చేసిట్లున్నాయి.

ఓకే బంగారం చిత్రం ప్రారంభానికి ముందు ప్రముఖ దర్శకుడు మణిరత్నం...హైదరాబాద్ వచ్చి మెగా ఫ్యామిలీని కలిసారు. చిరంజీవి, రామ్ చరణ్ లు ఇద్దరినీ కూర్చోబెట్టి ఓ స్క్రిప్టు వినిపించారు. ముఖ్యంగా రామ్ చరణ్ తో ఓ యాక్షన్ సబ్జెక్ట్ చేయాలనుకున్నారు ఆయన. అయితే అది తన ఇమేజ్ కు సూట్ కాదని రామ్ చరణ్ భావించటంతో సినిమా మెటీరియలైజ్ కాలేదు.

అయితే నిన్నటి నుంచి ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అది మరేదో కాదు..మణిరత్నం, రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా ప్రారంభం అయ్యే అవకాసం ఉందని, అదీ తమిళ,తెలుగు భాషల్లో అని. ఈ వార్త విన్న మెగాభిమానులు పండుగ చేసుకున్నారు. మణిరత్నం వంటి దర్శకుడుతో సినిమా చేస్తే వచ్చే క్రేజే వేరు. మరి అదే సబ్జెక్టా లేక వేరే సబ్జెక్టు తో మణిరత్నం ముందుకు వచ్చాడా అనేది తెలియాల్సి ఉంది.

Buzz on Mani Ratnam-Ram Charan film


అంతేకాకుండా ఈ సినిమా పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండనుందని తెలుస్తోంది. అలాగే ఇందులో అల్లు అర్జున్ నటిస్తాడని, ఈ ప్రాజెక్ట్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టేనని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై మణిరత్నం నుండిగాని, మెగా క్యాంపు నుండిగాని ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న 'ధృవ' చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. డిసెంబర్ నెలలో ధృవ చిత్రం విడుదల కానుంది.

మణిరత్నం కెరీర్లో కొన్ని ప్లాపులు ఉన్నప్పటికీ....ఆయన సినిమాలను అభిమానించే అభిమానుల సంఖ్య మాత్రం తగ్గలేదు. మణి చివరి సినిమా 'ఓకె కన్మణి'(తెలుగులో ఓకే బంగారం) చిత్రం భారీ విజయం సాధించిందిన సంగతి తెలిసిందే. త్వరలో మణిరత్నం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

కార్తి హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి 'కాట్రు వెలియిదై' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ చిత్రంలో కార్తి సరసన బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి నటిస్తోంది. మణిరత్నం సినిమా అంటే సంగీతం ఏఆర్ రెహమానే ఉంటారు. ఈ సినిమాకు కూడా ఆయనే సంగీతం అందిస్తున్నారు.

English summary
Mani Ratnam is planning to revive his project with Ram Charan after he wraps up Kaatru Veliyidai.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu