twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘C/O కంచరపాలెం’కు ఆ అర్హత లేదట... ఆ నిబంధన చూసి షాక్!

    |

    2018లో వచ్చిన సినిమాల్లో హాట్ టాపిక్ అయిన మూవీ 'C/O కంచరపాలెం'. వైజాగ్ సమీపంలోని కంచర‌పాలెం అనే ఊరు నేప‌థ్యంతో భిన్నమైన కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించారు. న్యూయార్క్‌కు చెందిన ఎన్ఆర్ఐ కార్డియాల‌జిస్ట్ విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మించారు.

    రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్లు, మరికొందరు ప్రముఖులు సైతం ఈ చిత్రంపై ప్రశంసలు గుప్పించిన సంగతి తెలిసిందే. 2018లో న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ తెలుగు నుంచి ఎంపికైన తొలి సినిమా కూడా ఇదే. రానాకు ఈ సినిమా నచ్చేయడంతో సురేష్ ప్రొడక్షన్స్ బేనర్లో విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

    ‘C/O కంచరపాలెం'కు ఆ అర్హత లేదట...

    ‘C/O కంచరపాలెం'కు ఆ అర్హత లేదట...

    ‘C/O కంచరపాలెం' చిత్రాన్ని జాతీయ అవార్డు నామినేషన్ కోసం పంపగా.... కమిటీ తిరస్కరించింది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు పొందే అర్హత లేదని తేల్చి చెప్పింది. అందుకు కారణం ఈ చిత్ర నిర్మాత విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి. ఆమె ఈ సినిమా నిర్మించడమే జాతీయ అవార్డుకు అడ్డంకిగా మారింది.

    కారణం ఆమె ఎన్ఆర్ఐ కావడమే...

    కారణం ఆమె ఎన్ఆర్ఐ కావడమే...

    విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి భారత సంతతి వ్యక్తి అయినప్పటికీ... యూఎస్ఏ పౌరురాలు కావడంతో కమిటీ ఈ చిత్రాన్ని తిరస్కరించింది. భారత పౌరసత్వం ఉన్న వ్యక్తులు నిర్మించిన సినిమాలకు మాత్రమే భారత ప్రభుత్వం అందింజే జాతీయ అవార్డులు అందుకునే అర్హత ఉంటుందట.

    సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న సింపతీ

    సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న సింపతీ

    జాతీయ అవార్డు పొందే సత్తా ఉన్న ‘C/O కంచరపాలెం' చిత్రం విషయంలో ఇలా ఒక నిబంధన అడ్డు రావడంతో పలువురు సినీ అభిమానులు ట్విట్టర్ ద్వారా సింపతీ వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిబంధన మార్చాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

    దర్శకుడు ఏమంటున్నారంటే

    దర్శకుడు ఏమంటున్నారంటే

    ట్విట్టర్లో సింపతీ వ్యక్తం అవుతుండటంపై దర్శకుడు వెంకటేష్ మహా స్పందించారు. మీ లాంటి ప్రేక్షకులు దొరకడం నా అదృష్టం. అవార్డులు నాకు లెక్క కాదు. ఇలాంటి నిబంధన అడ్డుగా ఉన్నందుకు బాధ లేదు. కానీ మేము అప్లికేషన్ పెట్టే సమయంలో ఈ నిబంధన ఎక్కడా కనిపించక పోవడం... తర్వాత తిరస్కరణకు గురికావడం బాధించిందని తెలిపారు.

    English summary
    "Very unfair decision by Indian national awards selection committee to omit c/o Kancharapalem because the producer is an NRI. Such rules should be amended!" Opinions are expressed in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X