»   » ట్రైలర్లో నగ్న సన్నివేశాలు: కోత పెట్టి సెన్సార్ బోర్డు

ట్రైలర్లో నగ్న సన్నివేశాలు: కోత పెట్టి సెన్సార్ బోర్డు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: నిజ జీవిత కథల ఆధారంగా సినిమాలు తీయడం బాలీవుడ్ దర్శకుడు మాధుర్ బండార్కర్ స్టైల్. బార్ గర్ల్స్ జీవితంపై 'చాందినీ బార్', మోడలింగ్ రంగంలోని మోడల్స్‌పై 'ఫ్యాషన్', కథానాయికల జీవితంపై 'హీరోయిన్' లాంటి చిత్రాలను ఆయన తెరకెక్కించారు. తాజాగా ఆయన కన్ను క్యాలెండర్ గర్ల్స్‌పై పడింది.

ఈ మధ్య న్యూఇయర్ క్యాలెండర్ల పేరుతో అందమైన భామలకు బికినీ వేయించి ఫోటో షూట్ జరుపడం ఫ్యాషన్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాలెండర్ గర్ల్స్ జీవితంపై ఆయన సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. ట్రైలర్ కూడా రెడీ చేసారు. అయితే ట్రైలర్లో నగ్న సన్నివేశాలు ఉండటంతో సెన్సార్ బోర్డు కోత పెట్టినట్లు తెలుస్తోంది. ఆ సీన్లకు కోత పెట్టి U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది.

 'Calendar Girls' trailer censor certificate

ఈ సినిమాలోని ఐదుగురు ముఖ్యమైన పాత్రల కోసం ఆరుగు యంగ్ గర్ల్స్‌ను ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవలే ఇందుకు సంబంధించిన ఆడిషన్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది. బికినీలకు పర్ పెక్టుగా సూటయ్యే, ఫ్యాషనబుల్ బాడీ ఉన్న అమ్మాయిలను ఎంపిక చేసారు. ఆగస్టులో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటి వరకు సినిమాలకు పరిచయం లేని కొత్త ముఖాలను, మెడలింగ్ రంగంలో ఆరితేరిన సూపర్ మోడల్స్‌ను ఈ సినిమాలో చూపించబోతున్నారు. మధుర్ బాండర్క్ సినిమా అనగానే సినిమా రంగంలోకి రావాలని ఆశ పడుతున్న మోడల్స్ ఉత్సాహంగా ఆడిషన్స్‌కు హాజరయ్యారు. వారి నుండి మంచి నటనా చాతుర్యం, సెక్సీ బాడీ ఉన్న వారిని ఎంపిక చేసారు.

English summary
Close sources to Censor Board of Film Certification (CBFC) revealed the theatrical trailer of 'Calendar Girls' submitted for certification prior to release has a nude clip. Censor Members have raised objection to the shot of a nude woman in the promo and the makers had to chop it off to obtain an 'U/A' Certificate.
Please Wait while comments are loading...