»   » బాలకృష్ణ చిత్రం షూటింగులో ప్రమాదం: కెమెరామెన్‌కు గాయాలు

బాలకృష్ణ చిత్రం షూటింగులో ప్రమాదం: కెమెరామెన్‌కు గాయాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

విశాఖపట్టణం: టాప్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఓ చిత్రం చిత్రీకరణలో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో బాలకృష్ణకు ప్రమాదమేమీ జరగనప్పటికీ ఓ కెమెరామెన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. విశాఖ జిల్లాలోని యారాడ కొండల్లో బాలకృష్ణ కొత్త చిత్రం చిత్రీకరణ జరుగుతోంది. బుధవారం క్రేన్ విరిగి ప్రమాదం చోటు చేసుకుంది.

మొదట బాలకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయనని వార్తలు రావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. చివరకు బాలకృష్ణకు గాయాలేమీ కాలేదని, కెమెరామెన్‌కే గాయాల్యాయని తెలియడంతో వారు కుదుట పడ్డారు. కాగా బాలకృష్ణ ఈ చిత్రానికి మొదటి నుండి ఏదో అవాంతరం వచ్చి పడుతుంది. వారం రోజుల క్రితం సరస్సును తవ్వి చిత్రం కోసం సెట్టింగ్ వేశారని కథనాలు వచ్చాయి. అది మరిచిపోక ముందే క్రేన్ ముందు భాగం విరిగి కెమెరామెన్‌కు గాయాలయ్యాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu