»   » సునీల్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నెక్ట్స్ కన్ఫర్మ్

సునీల్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నెక్ట్స్ కన్ఫర్మ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కళ్యాణ్ రామ్ తన తదుపరి చిత్రాన్ని సునీల్‌ అనే ఛాయాగ్రహకుడు దర్శకత్వంలో చేయనున్నారు. ఇక సునీల్ రెడ్డి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రసూల్ ఎల్లోర్ శిష్యుడు.ఆయన వద్ద భగీరధ,ఒకరికి ఒకరు చిత్రాలకు పనిచేసారు. మంచు మనోజ్ తో చేసిన నేను మీకు తెలుసా చిత్రం బాగా పేరు తెచ్చుకుంది. నందమూరి అభిమానులు ఆశించే అన్ని అంశాలతో పాటు, సాంకేతిక విభాగానికీ ప్రాధాన్యం ఇస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని చెప్తున్నారు.

ఈ సినిమా కోసం కల్యాణ్‌రామ్‌ ప్రత్యేకమైన వ్యాయామాలు చేస్తున్నారు. చిజిల్డ్‌ బాడీతో ఈ చిత్రంలో కనిపిస్తారని సమాచారం. అందు కోసం నిపుణులైన శిక్షకుల దగ్గర తర్ఫీదు తీసుకొంటున్నారు. స్టోరీ డిస్కషన్స్ ఇప్పటికే పూర్తికావచ్చాయి. త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో తెలుస్తాయి. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ రోజు కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజు ని జరుపుకుంటున్నారు. కత్తి తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తున్న చిత్రం ఇదే.

English summary
Kalyan Ram’s next film is in talks with cinematographer Sunil Reddy who wants to direct a film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu