»   » శేఖర్ కమ్ముల లీడర్ బిజినెస్ పరిస్ధితి ఏమిటి?

శేఖర్ కమ్ముల లీడర్ బిజినెస్ పరిస్ధితి ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామానాయుడు మనవడు రాణాను హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల రూపొందించిన లీడర్ చిత్రం బడ్జెట్ కి తగ్గ రీతిలో బిజెనెస్ జరగటం కష్టమేనని పరిశ్రమలో వినపడుతోంది. వారు చెప్పుకునేదాన్ని బట్టి ఏ కొత్త హీరోకి ఖర్చు పెట్టని రీతిలో శేఖర్ కమ్ముల 17 కోట్ల రూపాయలను ఈ చిత్రం కోసం వ్యయం చేసారని అంటున్నారు. అలాగే దాదాపు 200 రోజులు షూటింగ్ కే సరిపోయిందని అంటున్నారు. అయితే రీషూట్ లకు ఎక్కవ రోజులు అయ్యాయని చెప్తున్నారు. ఓపెనింగ్ రోజునుంచి హౌస్ ఫుల్స్ కంటెన్యూ అయితే ఆ బడ్జెట్ పెద్ద ఎక్కువేమీ కాదని అయితే కొత్త హీరోకి ఏ రేంజిలో ఓపినింగ్స్ ఉంటాయనేది అంచనా వేయటం కష్టమని అంటున్నారు. ఇక ఈ చిత్రం పిబ్రవరి 11న ధియోటర్స్ లోకి దిగుతోంది. అయితే ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుమారుడు అవటం,ఎవియం వారు నిర్మించటం, ఇప్పటివరకూ ప్లాప్ ఎరగని శేఖర్ కమ్ముల దర్శకత్వం ఈ చిత్రంపై అంచనాలు పెంచుతున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu