»   »  పవన్ కళ్యాణ్‌...నా మూవీకి సూట్ కాడంటున్న డైరెక్టర్

పవన్ కళ్యాణ్‌...నా మూవీకి సూట్ కాడంటున్న డైరెక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని ఏ దర్శకుడికి ఉండదు? చెప్పండి. కానీ ఒకాయన మాత్రం పవన్ కళ్యాణ్‌తో తనకు సెట్ కాదని, అతనితో సినిమా చేయనుగాక చేయను అంటున్నాడు. అతనెవరోకాదు కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ.

తన సినిమా మేకింగ్ డిఫరెంటుగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ లాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోకు తను చేసే సినిమాలు సూట్ కావని వర్మ ఓ దినపత్రిక ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. వర్మ ఇటీవల పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ట్విట్టర్లో తెగ ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిని మరోసారి తిరగేద్దాం..

'సాధారణంగా నేను దేవుడిని పూజించను. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ప్రార్థించక తప్పడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాలి. అప్పుడే అన్ని సమస్యలు తీరుతాయి. నా కోరికను తీర్చు గణేషా' అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు.

కొన్ని రోజుల క్రితం కూడా పవన్ కళ్యాన్ పార్టీ పెట్టాలంటూ వర్మ ట్వీట్ చేసాడు వర్మ. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా....'పవన్ కళ్యాణ్ ఎప్పుడు పుడితే నాకేంటి... అతను పార్టీ పెట్టిన రోజే అతనికి నిజమైన జన్మదినం..ఆ రోజే నేను శుభాకాంక్షలు తెలియచేస్తాను' అని వర్మ అన్నారు.

గతంలో ఓ సారి 'ఇప్పటి వరకు తాను నా జీవితంలో ఎప్పుడు ఓటు వెయ్యలేదని.. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని ప్రారంభిస్తే ఓటు వేస్తాను అనే మాటకు కట్టుబడి ఉంటాను. పవన్ కళ్యాణ్ కు తన ఓటు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పవర్ స్టార్ కు ఓటు వేసేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ లో ఆలోచనల్లో నిజాయితీ, కళ్లలో పట్టుదల. చరిష్మా, ఇంటెన్సిటిలను బాల్ థాకరేలో కూడా చూడలేదు. ప్రజారాజ్యం పార్టీకి పవన్ కళ్యాణ్ సారథ్యం వహించి ఉంటే అఖండ మెజారిటీని సాధించి ఉండేదని తన ప్రగాఢ విశ్వాసం' అని రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు చేశారు.

English summary

 'I can never ever do a film with Pawan Kalyan. My method of film making is different which can’t be suited to his on screen image' Ram Gopal Varma told.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu