»   » సమంత, ఉపాసన, అమలతో నాగార్జున ఆట..(ఫోటోలు)

సమంత, ఉపాసన, అమలతో నాగార్జున ఆట..(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు విరాళాల సేకరణ కోసం క్యూర్ ఫౌండేషన్ చెందిన క్యాన్సర్ ఉద్యమ కారుల ఆధ్వర్యంలో ఈనెల 15, 16 తేదీల్లో 'క్యాన్సర్ క్యూసేడర్స్ ఇన్విటేషన్ కప్-2014' పేరుతో నిర్వహించిన గోల్ఫ్ టెర్నమెంట్ ఆదివారం ముగిసింది. ముగింపు సందర్భంగా సెలబ్రిటీ ప్లే ఆఫ్ నిర్వహించారు.

  సెలబ్రిటీ ప్లేఆఫ్‌లో పౌర సంబంధాల శాఖ మంత్రి డి.కె. అరుణ, సినిమా తారలు అమల, సమంత, మధుశాలిని, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని, మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సభర్వాల్, ఫ్యాషన్ డిజైనర్ అస్మితా మార్వా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా, భారత మహిళా క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్, ఫిట్ నెస్ ట్రైనర్ దినాజ్ విర్వత్ వాలా తదితరులు పాల్గొన్నారు.

  సెలబ్రిటీ ప్లే ఆఫ్‌లో పాల్గొన్న వారికి ప్రముఖ నటుడు నాగార్జున గోల్ఫ్ ఎలా ఆడాలనే దానిపై ట్రైనింగ్ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

  క్యాన్సర్ క్యూసేడర్స్ ఇన్విటేషన్ కప్-2014

  క్యాన్సర్ క్యూసేడర్స్ ఇన్విటేషన్ కప్-2014


  190 మంది గోల్ఫర్లు పాల్గొన్న క్యాన్సర్ క్యూసేడర్స్ ఇన్విటేషన్ కప్-2014 ఆదివారం జరిగిన సెలబ్రిటీ ప్లే ఆఫ్‌తో ముగిసింది. గోల్ఫ్ ఆటగాడైన నాగార్జున సెలబ్రిటీ ప్లే ఆఫ్‌లో పాల్గొన్న మహిళా సెలబ్రిటీలకు ఆట నియమాలను తెలియజేసారు.

  సమంతకు ట్రైనింగ్ ఇస్తూ...

  సమంతకు ట్రైనింగ్ ఇస్తూ...


  హీరోయిన్ సమంతకు గోల్ఫ్ ఆటలో ట్రైనింగ్ ఇస్తున్న నాగార్జున. సెలబ్రిటీల రాకతో టోర్నమెంటు ముగింపు కార్యక్రమం ఎంతో కలర్ ఫుల్‌గా మారింది.

  రామ్ చరణ్ సతీమణి ఉపాసన

  రామ్ చరణ్ సతీమణి ఉపాసన


  క్యాన్సర్ క్యూసేడర్స్ ఇన్విటేషన్ కప్-2014 గోల్ఫ్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో సెలబ్రిటీ ప్లే ఆఫ్‌లో పాల్గొన్న ప్రముఖ నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన.

  సమంతను ఎంకేజ్ చేస్తూ అమల

  సమంతను ఎంకేజ్ చేస్తూ అమల


  గోల్ఫ్ సెలబ్రిటీ ప్లే ఆఫ్‌లో పాల్గొన్న సమంతను ఎంకరేజ్ చేస్తున్న అమల. సెలబ్రిటీలంతా ఈ కార్యక్రమంలో ఎంతో సందడిగా పాల్గొన్నారు.

  క్యూర్ ఫౌండేషన్ గురించి...

  క్యూర్ ఫౌండేషన్ గురించి...


  క్యాన్సర్ నిర్మూలన, తొందరగా గుర్తించడం, చికిత్స మొదలగు అంశాల గురించి సమాచారాన్ని అందించే విషయాలపై క్యూర్ ఫౌండేషన్ పని చేస్తోంది. క్యాన్స్ రోగులకు వైద్య సేవలతో పాటు పరిశోధన కార్యక్రమాలు చేపడుతోంది.

  English summary
  
 'Cancer Crusaders Invitation Cup - 2014' - an overwhelming success with over 190 golfers participating, concluded today with a colourful 'Celebrity Playoff/ The tournament was organized as a fund raiser and cancer awareness initiative by Cancer Crusaders of CURE Foundation at Hyderabad Golf Club on February 15th & 16th, 2014. Chief Guest, Cine Actor & Golfer Sri Akkineni Nagarjuna demonstrated & guided the ladies to do the Putting. Master Aleem, a Child Cancer Survivor, supported by CURE Foundation welcomed the gathering with a wonderful dance performance.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more