»   » భయపడాల్సిన పనిలేదు : మనీషా కొయిరాలా భరోసా

భయపడాల్సిన పనిలేదు : మనీషా కొయిరాలా భరోసా

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోల్‌కాతా : కేన్సర్ రాగానే భయపడిపోవాల్సిన పనిలేదని, కేన్సర్‌కి ఆన్సర్ ఉందని మనీషా కొయరాలా చెప్పుకొచ్చింది. తాము కేన్సర్‌ను జయించినప్పుడు మిగతావారు మాత్రం ఎందుకు జయించలేరు? అంటూ కేన్సర్ బాధితుల్లో అవగాహన పెంచేందుకు ఆమె నడుంబిగించారు. ఆమెతో పాటు మరో కేన్సర్ బాధితుడు క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా ఈ సదస్సు లో పాల్గొన్నారు. "ప్రతిజ్ఞ: కేన్సర్ అపోహలు, నిజాలు'' పేరిట ఈ కార్యక్రమం జరిగింది.

ఈ మహమ్మారి బారి నుంచి బయటపడినవారిని 'కేన్సర్ సర్వైవర్'గా వ్యవహరించడం తనకు నచ్చదని మనీషా పేర్కొంది. ఆమె తనను తాను 'కేన్సర్‌పై పోరాడిన యోధురాలు'గా అభివర్ణించుకుంది. "కేన్సర్ అంటేనే మరణం అనే అపవాదు ఉం ది. కానీ, అది సరికాదు. కేన్సర్‌తో బాధపడి చికిత్స చే యించుకుని సరైనవారు నాకు చాలా మంది తెలుసు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని పోరాడదాం'' అని ఆ మె పిలుపునిచ్చారు.

Cancer has an answer, say Manisha Koirala, Yuvraj Singh

ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కేన్సర్ పేషెంట్లతో పాటు, నగరంలో ని వైద్యులు, బెంగాలీ సినీ ప్రముఖులు, గాయకులు, ఫ్యాషన్ డిజైనర్లు, క్రీడాకారులందరూ హాజరై కేన్సర్‌పై అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. అయితే.. యు వీ, మనీషా మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఆహూతు లు మరింత శ్రద్ధగా విన్నారు. యువరాజ్ తామిద్దరినీ ఆశకు, ధైర్యానికి చిహ్నాలుగా అభివర్ణించుకున్నాడు.

కేన్సర్ ఏ దశలో బయటపడిందన్న దానితో సంబంధం లేకుండా.. ధైర్యాన్ని కూడగట్టుకుని దానితో పోరాడాలని యువీ సూచించాడు. మనలో ఆ ధైర్యం ఉండటంతోపాటు, కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సహకారం కూడా ఉంటే మరింత ఉపయోగమని వివరించాడు. మేం జయించగలిగినప్పుడు.. మీరూ జయించగలరు'' అని వీరు నినదించారు.

English summary
In a joint effort to raise awareness about cancer, Bollywood actress Manisha Koirala and Indian cricketer Yuvraj Singh Tuesday evening pepped up millions of people affected with the ailment, asserting "If we can, you can". Manisha Koirala, who has successfully fought ovarian cancer, was spotted at an event spreading awareness about cancer in Kolkata recently. She is greeted by another cancer survivor Yuvraj Singh hug during the interactive session "Cancer has an answer," in Kolkata.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more