Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ భయ్యా! ఈ క్యాన్సర్ పేషెంట్ కోరిక తీర్చండి
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్-2' సినిమా కోసం అభిమానులంతా చాలా కాలంగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కారణాలేమైనా సినిమా మాత్రం ఇప్పటికీ మొదలు కాలేదు. అయితే క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డ ఓ బాలుడు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూడటం పలువురి మనసులను కలిచి వేసింది. క్యాన్సర్ వ్యాధి ఫైనల్ స్టేజీలో ఉన్న ఆ బుడ్డోడు గబ్బర్ సింగ్-2 సినిమా చూడాలని ఆశ పడుతున్నాడు. తనకు హెల్ప్ చేయాలని కోరుతున్నాడు. అతని కోరిక తీరాలంటే వీలైనంత త్వరగా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్-2 సినిమా పూర్తి చేయాలి. తనకు హెల్ప్ చేయాలని ఓ పోస్టర్ పట్టుకున్న ఆ బాలుడి ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
గబ్బర్ సింగ్-2 అయోమయం...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్-2' మూవీ ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. గత రెండేళ్లుగా ఈ చిత్రం ప్రారంభానికి నోచుకోకుండా ఊగిసలాడుతూనే ఉంది. సంపత్ నంది దర్శకుడిగా ఈ చిత్రాన్ని మొదలు పెట్టారు. పలు కారణాలతో సినిమా ప్రారంభం కాకముందే సంపత్ నంది ఆ ప్రాజెక్టు నుండి బయటకు వచ్చారు. సంపత్ నంది స్టోరీ, స్క్రిప్టు వర్కు నచ్చకనే ఆయన్ను తీసేసినట్లు టాక్. దీంతో అదే స్టోరీతో సంపత్ నంది రవితేజతో ‘బెంగాల్ టైగార్' ప్లాన్ చేసుకున్నాడు.

తర్వాత ‘పవర్' ఫేం బాబీ గబ్బర్ సింగ్ 2 చిత్రానికి దర్శకుడిగా ఎంపికయ్యారు. పవన్ కళ్యాణే స్వయంగా స్టోరీ సమకూర్చారు. స్క్రిప్టు వర్కు మాత్రం బాబీకి అప్పగించాడు. అయితే బాబీ కూడా పవన్ కళ్యాణ్‌ని మెప్పించలేక పోయాడని టాక్. దీంతో బాబీ కూడా ఈ ప్రాజెక్టు నుండి ఔట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొంతకాలం పాటు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఖాళీ గ్యాపులో దాసరి నారాయణరావు నిర్మాణ సంస్థలో సినిమా చేయాలని పవర్ స్టార్ ఆలోచన చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.
ఇదీ కాక...పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ స్థాపించిన న్యూ టాలెంటును ఎంకరేజ్ చేయాలనే ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ ఆచరణలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ కింద వరుసగా యువ హీరోలు, దర్శకులతో ఆయన సినిమాలు నిర్మించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నారట. ఏమిటో ఈ పరిణామాలన్నీ అభిమానులను అయోమయానికి గురి చేస్తున్నాయి.