»   » ప్రాణాలు అరచేతిలో...ఈదు కుంటూ ఒడ్డునపడ్డ మంచు లక్ష్మీ!

ప్రాణాలు అరచేతిలో...ఈదు కుంటూ ఒడ్డునపడ్డ మంచు లక్ష్మీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : తెలుగు నటి, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీప్రసన్న ఈ రోజు భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఆమె ప్రయాణిస్తున్న చిన్న బోటు బొల్తా పడటంతో ప్రాణాలు అర చేతిలో దాదాపు కిలో మీటరు పాటు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఈదుకూంటూ ఒడ్డుకు చేరుకుందట. కేరళలో జరిగిన ఈ సంఘటన గురించి ఆమె తన ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించింది.

'కేరళలోని ఫేమస్ అలప్పుఝా లేక్‌లో మరో యాక్టర్‌తో కలిసి చిన్న బోటులో వెలుతున్నాను. అనుకోకుండా బోటు బోల్తా పడింది. మేము నీళ్లలో పడిపోయాం. దాదాపు కిలో మీటర్ నీటిలో ఈదాను. నీటిలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇందులో పాములు కూడా ఉంటాయి. ఓ ఫిషింగ్ బోటు వచ్చి మమ్మల్ని కాపాడింది. మొత్తానికి ఎలాగో అలా బయట పడ్డాం' అంటూ ట్వీట్ చేసింది.

ఇటీవల 'గుండెల్లో గోదారి' చిత్రంతో నటిగా మంచి మార్కులు కొట్టేసిన మంచు లక్ష్మి ప్రస్తుతం ఏ సినిమా చేయడం లేదు. అయితే ఆమె 'బాస్మతి రైస్' అనే ఇంగ్లీష్ ప్రొడక్షన్ సంస్థతో పని చేయడానికి సైన్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

English summary
‘‘Was on a canoe ride at the Alappuzha lake and our canoe flipped over and we were thrown off. We couldn’t get on the boat. Had to swim more than a kilometre. Was quite scary not knowing what was in the water. Snakes r a common sight there.” , Actress Lakshmi Manchu tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu