»   » తప్పతాగి నానా యాగీ: నటుడు ఫిష్ వెంకట్‌పై కేసు నమోదు

తప్పతాగి నానా యాగీ: నటుడు ఫిష్ వెంకట్‌పై కేసు నమోదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొత్తగూడెం క్రైం: తెలుగు సినీ నటుడు ఫిష్‌వెంకట్‌‌పై కేసు నమోదైంది. మద్యం తాగి నానా యాగీ చేస్తూ ఓ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ వస్తున్న ఆయనపై పోలీసులు చివరకు కేసు పెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఏ పవర్‌హౌజ్‌ బస్తీలో హంగామా చేశాడు.

ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి మద్యంతాగి గొడవ చేశాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దాంతో ఆయనను పిలిపించి సున్నితంగా మందలించి వదిలేశారు. అయినా అతని తీరు మారలేదు.

కూతురి ఇంటికి వెళ్లి...

కూతురి ఇంటికి వెళ్లి...

సినిమాల్లో విలన్‌ పక్కన చిన్నచిన్న వేషాలు వేసే నటుడు వెంకట్‌కు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. తన కూతురు కొత్తగూడెంలోని ఏ పవర్‌హౌజ్‌ బస్తీకి చెందిన మెడికల్‌షాపు లో పనిచేసే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు.

గొడవ తీవ్రరూపం...

గొడవ తీవ్రరూపం...

వెంకట్‌ కూతురు నాలుగేళ్లుగా ఏ పవర్‌హౌజ్‌ బస్తీలో నివాసం ఉంటోంది. వారి ఇంటికి పక్కనే ఉన్న వేముల రాజేశం, వేముల ఉపేంద్ర, వేముల ప్రసాద్‌‌లతో వివాదం ఏర్పడింది. ఆ గొడవ తీవ్ర రూపం దాల్చింది. అది పోలీసుల దాకా వెళ్లింది.

Pelli Choopulu fame Tharun Bhaskar Speech About Telangana Slang
కొత్తగూడెం వచ్చి....

కొత్తగూడెం వచ్చి....

గత నెల 30వ తేదీన వెంకట్‌తో పాటు ఎనిమిది మంది కొత్తగూడెం వచ్చారు. వేముల ప్రసాద్‌ ఇంటి ఎదుట అర్థరాత్రి వరకు హంగామా సృష్టించారు ఈ విషయాన్ని ప్రసాద్‌ వన్‌టౌన్‌ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా అక్కడకు చేరుకున్న ఎస్‌ఐ తిరుపతి సర్ది చెప్పి పంపించారు. మళ్లీ ఈనెల నాలుగున అతిగా మద్యం తాగి ఫిష్‌ వెంకట్‌ప్రసాద్‌ తల్లి ఉ పేంద్రతో దురుసుగా ప్రవర్తించి, తిట్లపురాణం అందుకున్నారు.

మరోసారి మందలించి...

మరోసారి మందలించి...

బాధితులు ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో వారు మందలించి వదిలేశారు. తొమ్మిదిన తేదీన ఫిష్‌వెంకట్‌, అతడి ఇద్దరు కుమారులతో పాటు మరో కొంతమందితో వచ్చి మళ్లీ వేముల ప్ర సాద్‌, ఉపేంద్ర, రాజేశంపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దాంతో వారు వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఫిష్‌ వెంకట్‌పై కేసునమోదు చేశారు.

English summary
Police have registerd a case against Tollywood actor Fish Venkat at Kothagudem in Kothagudem Bhadrdri disrict in Telangana
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu