»   » ‘జయ జానకి నాయక’ వివాదం: చంపేస్తామని బెదిరింపులు!

‘జయ జానకి నాయక’ వివాదం: చంపేస్తామని బెదిరింపులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'జయ జానకి నాయక' సినిమాకు సంబంధించిన వివాదంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను చంపేస్తామని బెదిరించారంటూ అశోక్ రెడ్డి అనే లైటింగ్ కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశారు.

కృష్ణానగర్‌కు చెందిన లైటింగ్ కాంట్రాక్టర్ 'జయ జానకి నాయక' సినిమాలో ఒక పాట చిత్రీకరణ కోసం లైట్లు సరఫరా చేశారు. గతేడాది డిసెంబర్ నుండి జనవరి వరకు ఈ పాట చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.


10 లక్షల బకాయిలు

10 లక్షల బకాయిలు

అశోక్ రెడ్డి సరఫరా చేసిన లైటింగ్ ఖర్చు మొత్తం రూ. 10.75 లక్షలు అయింది. అయితే షూటింగ్ పూర్తయిన తర్వాత డబ్బు ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ వచ్చారు. సినిమా రిలీజైన తర్వాత కూడా తనకు రావాల్సిన డబ్బులు రాక పోవడంతో గట్టిగా అడిగాడు.


Public talk on "Jaya Janaki Nayaka"| Filmibeat Telugu
చంపేస్తామని బెదిరింపులు

చంపేస్తామని బెదిరింపులు

తనకు రావాల్సిన డబ్బు కోసం బెల్లంకొండ సురేష్ ను, నిర్మాత రవీంద్ర రెడ్డిని చాలా సార్లు కలిశానని.... తర్వాత ఇస్తామంటూ దాటవేస్తూ వచ్చారని, తాజాగా మరోసారి డబ్బులు అడగటానికి వెళితే మేనేజర్ కిషోర్ తనను చంపేస్తామని బెదిరించారని అశోక్ రెడ్డి పోలీసులకు తెలిపారు.


న్యాయం చేయండి

న్యాయం చేయండి

తనకు రావాల్సిన డబ్బులు వచ్చేలా చూడాలని, తనకు న్యాయం చేయాలని అశోక్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీ పరిశ్రమ పెద్దలు కల్పించుకోవాలని, మా లాంటి చిన్న వారిని ఇబ్బంది పెట్టవద్దని కోరారు.


జయ జానకి నాయక

జయ జానకి నాయక

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘జయ జానకి నాయక' చిత్రం ఇటీవల విడుదలైన బాక్సాపీసు వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బి, సి సెంటర్లలో సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తోంది.English summary
Case filed against Jaya Janaki Nayaka movie manager Kishore. Lighting contractor Ashok Reddy has filed the case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu