»   » షాక్ :సబ్బు యాడ్ లో నటించినందుకు స్టార్ హీరోపై కేసు

షాక్ :సబ్బు యాడ్ లో నటించినందుకు స్టార్ హీరోపై కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్రివేండ్రమ్ : కమర్షియల్ యాడ్ లో నటించేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని నటించాల్సిన పరిస్ధితి స్టార్ హీరోలకు కనపడేటట్లు కనపడుతోంది. ముఖ్యంగా కేరళ వంటి పూర్తి అక్షరాస్యత ఉన్న రాష్ట్రాలలో చదువుకున్నవారు ఎక్కువ ఉండటంతో మరింతగా అక్కడవారు జాగ్రత్తగా ఉండాలని రీసెంట్ గా అక్కడ స్టార్ హీరో ముమ్మట్టి కు జరిగిన సంఘటన తెలియచేస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ముఖ్యంగా వినియోగదారులలో ఎవేర్ నెస్ పెరిగాక అవకాశాలు వస్తున్నాయి కదా అని వాణిజ్య ప్రకటనల్లో.. అన్నింటికి ఓకే చెపుతూ పోతే... ఆపై కోర్టు మెట్లెక్కక తప్పదని తెలుస్తోంది. తాజాగా మలయాళ సూపర్ స్టార్ కు ఇలాంటి ఇబ్బందే ఎదురైంది.

ఇటీవల మన సినీ నటులు సినిమాల కంటే యాడ్స్ లోనే ఎక్కువగా కన్పిస్తున్నారు. అది ఇది అంటూ తేడా లేకుండా రకరకాల యాడ్స్ కు కమిట్ అవుతున్నారు. అయితే ఒక్కోసారి ఈ యాడ్స్ సినీ స్టార్స్ కు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.

ఇంతకీ ముమ్మట్టిని కోర్టుకు లాగిందెవరు..అసలు ఏం జరరిగిందో స్లైడ్ షోలో చదవండి...

ఈ యాడే ముంచింది

ఈ యాడే ముంచింది

'ఇందులేఖ' అనే సోప్ యాడ్ లో మమ్ముట్టి నటించాడు. అదే ఆయన్ను ఇబ్బందుల్లో పడేసింది.

కాన్సెప్టు...

కాన్సెప్టు...

'ఇందులేఖ సబ్బును వాడండి.. అందం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది' అన్నది ఈ యాడ్ మెయిన్ కాన్సెప్ట్.

ప్రశ్నించాడు

ప్రశ్నించాడు

యాడ్ లో చెప్పినట్లు జరగలేదని ఓ కన్సూమర్ కోర్టుకు ఎక్కాడు

కోర్టుకు ఎక్కింది ఎవరు

కోర్టుకు ఎక్కింది ఎవరు

కేరళలోని వాయాండ్ జిల్లా లోని కె ఛాతు అనే అతను కోర్టులో కేసు ఫైల్ చేసాడు

ఫేక్ గా..

ఫేక్ గా..

యాడ్ లో ముమ్మట్టి చెప్పిన మాటలు ఫేక్ అని,తను ఆ సబ్బు వాడినా ఏ మార్పు రాలేదని కోర్టుకు వెళ్లాడు.

బ్రాండ్ అంబాసిడర్

బ్రాండ్ అంబాసిడర్

ఈ సోప్స్ కు ముమ్మట్టి బ్రాండ్ అంబాసిడర్ కావటంతో అతని మీదా కేసు ఫైల్ చేసారు

కోర్టు ఏమందంటే

కోర్టు ఏమందంటే

సెప్టెంబర్ 22 న ముమ్మట్టిని, కంపెనీ రిప్రజెంటివ్ లను కలసి హాజరు అవ్వమని చెప్పింది

నష్టపరిహారం

నష్టపరిహారం

తనకు యాభై వేలు రూపాయలు నష్ట పరిహారం కావాలని అడిగాడు.

English summary
“Soundaryam Ningale thedi varum” (Beauty will come in search of you), the tagline of the Indulekha white soap seen quoted by Mammootty in advertisements, has been questioned by a consumer. The petitioner has claimed that he did not find any changes after the regular use of the soap.
Please Wait while comments are loading...