»   » రామ్ చరణ్, 'ఎవడు' యూనిట్‌పై కేసు నమోదు

రామ్ చరణ్, 'ఎవడు' యూనిట్‌పై కేసు నమోదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కర్నూలు: 'ఎవడు' చిత్ర యూనిట్‌పై ఎమ్మిగనూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ చిత్రం పోస్టర్లు అశ్లీలంగా ఉన్నాయంటూ మాజీ కౌన్సిలర్ నాగేందర్ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 292 సెక్షన్ కింద రామ్ చరణ్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులపై కేసు నమోదు చేసారు.

దిల్ రాజు నిర్మించిన చిత్రం 'ఎవడు'. రామ్‌చరణ్‌ కథానాయకుడు. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'ఎవడు' చిత్రం సక్సెస్ మీట్ రీసెంట్ గా జరిగింది. దిల్ రాజు మాట్లాడుతూ... ''మీరు వాణిజ్య చిత్రాలు తీయలేరా?' అని నాకు బాగా పరిచయం ఉన్న హీరోలు నన్ను ఆట పట్టించేవారు. నిజంగానే.. మా సంస్థలో పదహారు సినిమాలొచ్చాయి. అందులో కమర్షియల్‌ అంశాలతో సినిమా తీయలేదు. ఆ లోటు 'ఎవడు' తీర్చింది'' అంటున్నారు దిల్‌రాజు.

Case on Ram Charan's Yevadu film Unit

అలాగే... ''సినిమా పూర్తయి ఆరు నెలలయ్యింది. కానీ విడుదల చేయలేకపోయాం. ఏ నిమిషం ఏం జరుగుతుందో అని ప్రతీ నిమిషం ఆందోళనే. కానీ 'ఎవడు' ఫలితం మాత్రం ఆ కష్టాన్ని మరిపించింది. ఇది దర్శకుడి సినిమా అని ముందు నుంచీ చెబుతున్నా. ఆమాటే నిజమైంది''అన్నారు.

దర్శకుడు వంశీపైడిపల్లి మాట్లాడుతూ ''ఇది నా మూడో సినిమా. పూర్తి సంతృప్తిని ఇచ్చిన సినిమా కూడా ఇదే. రామ్‌చరణ్‌ని దృష్టిలో పెట్టుకొని రాసుకొన్న కథ ఇది. అల్లు అర్జున్‌ లేకపోతే ఈ సినిమా ముందుకు వెళ్లేది కాదు. అబ్బూరి రవి అందించిన మాటలు, దేవిశ్రీ సంగీతం.. ఇలా ఒక్కటి కాదు, ప్రతీ విభాగం నాకు తోడ్పడింది. కష్టకాలంలో నాకు తోడుగా నిలిచినవాళ్లందరికీ నా కృతజ్ఞతలు'' అన్నారు.

''క్లిష్టతరమైన కథ ఇది. కానీ దర్శకుడు అందరికీ అర్థమయ్యేలా తీర్చిదిద్దిన విధానం బాగుంది. నా పాత్రకు వస్తున్న స్పందన మరింత ఆనందాన్నిస్తుంది'' అని ఎల్బీ శ్రీరామ్‌ చెప్పారు.

English summary
Yevadu, the much awaited movie of Ram Charan is released today with hit talk. Shruti Hassan is paired with Ram Charan. The movie is said to be an action thriller. Vamshi Paidipalli is the director and Dil Raju is the producer. Though the release of the movie is delayed, fans are eagerly waiting for the film. Dialogues of the movie are created high expectations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu