»   » ప్రముఖ నటుడి మెడకు బిగిస్తున్న ఉచ్చు.. లైంగిక దాడి కేసులో..

ప్రముఖ నటుడి మెడకు బిగిస్తున్న ఉచ్చు.. లైంగిక దాడి కేసులో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

లైంగిక దాడి వ్యవహారంలో ప్రముఖ నటుడు జితేంద్ర‌పై షిమ్లా పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. నాపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిబ్రవరి మొదటివారంలో ఆయన మేనకోడలు దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందించినట్టు ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని వెల్లడించింది.

నాపై ప్రముఖ హీరో అత్యాచారం.. ఆ బాధతోనే తల్లిదండ్రుల మరణం..

జితేంద్ర మేనకోడలు ఫిర్యాదు

జితేంద్ర మేనకోడలు ఫిర్యాదు

జితేంద్ర మేనకోడలు చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశాం. ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం ఎఫ్ఐఆర్ దాఖలు చేశాం. ఛోట్టా షిమ్లా పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్ చేశాం అని సిమ్లా ఎస్పీ ఉపాపతి జమ్వాల్ ధృవీకరించారు.

47 ఏళ్ల క్రితం నాపై లైంగిక దాడి

47 ఏళ్ల క్రితం నాపై లైంగిక దాడి

జితేంద్ర మేనకోడలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. నాకు అప్పుడు 18 ఏళ్లు. జితేంద్రకు 28 సంవత్సరాలు. దాదాపు 47 సంవత్సరాల క్రితం నాపై లైంగిక దాడికి పాల్పడ్డారు అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 షిమ్లాలోని ఓ హోటల్‌లో

షిమ్లాలోని ఓ హోటల్‌లో

జితేంద్ర సినిమా షూటింగ్‌కు తన తండ్రితో కలిసి వెళ్లినపుడు ఈ ఘటన చోటుచేసుకొన్నది. షిమ్లాలోని ఓ హోటల్‌లో నాపై లైంగిక దాడి జరిగింది అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే.

బాధితురాలి వాగ్మూలం రికార్డు

బాధితురాలి వాగ్మూలం రికార్డు

బాధితురాలు ఫిర్యాదు అనుసరించి జితేంద్ర మేనకోడలు నుంచి మేజిస్ట్రేట్ ముందట వాగ్మూలం తీసుకోవడం జరిగింది. హోటల్‌లో బస చేసినట్టు ఏదైనా సాక్ష్యాన్ని ఆమె అందజేయాల్సి ఉంటుంది అని షిమ్లా జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

సెక్షన్ 354 ప్రకారం

సెక్షన్ 354 ప్రకారం

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం ఐపీసీ సెక్షన్ 354 నిబంధనలకు అనుగుణంగా దర్యాప్తు చేస్తున్నాం. కేసు జరిగిన సమయంలో ఉన్న చట్ట నిబంధనలకు అనుగుణంగా విచారిస్తున్నాం అని ఎస్పీ చెప్పారు.

 నా తల్లిదండ్రుల మృతి తర్వాత

నా తల్లిదండ్రుల మృతి తర్వాత

లైంగిక దాడి జరిగిన 40 ఏళ్ల తర్వాత జితేంద్రపై ఫిర్యాదు చేయడంపై బాధితురాలు స్పందిస్తూ.. నా తల్లిదండ్రులు మరణించిన తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకొన్నాను. జితేంద్ర నాపై దారుణంగా ప్రవర్తించారని తల్లిదండ్రులకు తెలియదు అని బాధితురాలు పేర్కొన్నారు.

 ఆరోపణల్లో వాస్తవం లేదు

ఆరోపణల్లో వాస్తవం లేదు

ఇదిలా ఉండగా, లైంగిక దాడి ఆరోపణలను నటుడు జితేంద్ర న్యాయవాది రిజ్వాన్ సిద్దిఖీ ఖండించారు. బాధితురాలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. అవన్నీ కట్టుకథలు అని అన్నారు. నా క్లయింట్ ప్రతిష్ఠకు భంగం చేయడానికి చేసిన కుట్రలో భాగం అని రిజ్వాన్ సిద్దిఖీ అన్నారు.

English summary
The Shimla Police has filed an FIR against veteran Bollywood actor Jeetendra, based on a sexual abuse complaint that was filed by his cousin. Shimla's Superintendent of Police (SP) Umapati Jamwal confirmed the development to the publication and said, "An FIR under Section 354 IPC has been registered at Chotta Shimla police station. Jeetendra's lawyer Rizwan Siddiquee had categorically denied the allegations, calling them "baseless, ridiculous and fabricated.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu