»   » శ్రీరెడ్డి ఎఫెక్ట్.... టాలీవుడ్లో లైంగిక వేధింపుల‌పై క్యాష్ క‌మిటీ

శ్రీరెడ్డి ఎఫెక్ట్.... టాలీవుడ్లో లైంగిక వేధింపుల‌పై క్యాష్ క‌మిటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాస్టింగ్ కౌచ్ మీద శ్రీరెడ్డి పోరాటం చేస్తున్నా చలనం లేకుండా చోద్యం చూస్తున్న తెలుగు సినిమా పరిశ్రమలోని వివిధ వర్గాల్లో తాజా పరిణామాలతో చలనం వచ్చింది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సెక్సువ‌ల్ హేరెస్ మెంట్ మీద జ‌రుగుతోన్న విమ‌ర్శ‌ల ప‌రిణామాన్ని సీరియ‌స్ గా తీసుకున్న తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ‌ర్ కామ‌ర్స్ వారు గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ ఇండియా ఈ విష‌యంలో విశాఖ గైడ్ లైన్స్ పేరుతో ఇచ్చిన గైడ్ లైన్స్ ఆధారంగా క్యాష్(కమిటీ ఎగైనిస్ట్ సెక్సువల్ హెరాస్మెంట్) కమిటీ ని ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించారు.

క్యాష్ కమిటీలో సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, న‌టీన‌టులు, ఫెడ‌రేష‌న్ మెంబ‌ర్స్ తో పాటు తో పాటు స‌మాజంలో ఉండే లాయ‌ర్లు, డాక్ట‌ర్లు, ప్ర‌భుత్వాధికారులు లాంటి ప్రముఖులను ఇందులో మెంబ‌ర్స్‌గా ఉంటార‌ని ఫిలిం ఛాంబ‌ర్ అధ్య‌క్షుడు పి. కిర‌ణ్ తెలిపారు.

 Sri Reddy

గ‌వ‌ర్న‌మెంట్ వారి గైడ్ లైన్స్ ప్ర‌కారం ప్ర‌తీ ప్రొడ‌క్ష‌న్ కంపెనీలో లైంగిక వేధింపుల నియంత్రణ కోసం క్యాష్‌ ఉండి తీరాల‌ని, క్యాష్ క‌మిటీని ఏర్పాటు చేసేలా ఫిల్మ్ ఛాంబ‌ర్ బాధ్య‌త తీసుకుంటుంద‌ని ఛాంబ‌ర్ అధ్య‌క్షుడు పి. కిర‌ణ్ తెలిపారు.

క్యాష్ కమిటీ ఏర్పాటుకు అందరూ ముందుకు రావడంతో శ్రీరెడ్డి తన పోరాటంలో మొదటి విజయం సాధించింనట్లయింది. అర్దనగ్న ప్రదర్శన ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయికి టాలీవుడ్లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని తీసుకెళ్లేలా చేసిన ఆమె జాతీయ మానవ హక్కుల సంఘం కూడా కదిలేలా చేసిన సంగతి తెలిసిందే. కాగా... క్యాష్ కమిటీ ఏర్పాటుపై శ్రీరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

English summary
A CASH committee (Committee Against Sexual Harassment) has been constituted by Telugu Film Chamber of Commerce. The Committee will look after the various grievances of the artists in the film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X