»   » నాగార్జునతో నటించాలనుకుంటున్నారా..? మీ వివరాలు పంపాల్సిన ఈ-మెయిల్ ఐడీ ఇదే

నాగార్జునతో నటించాలనుకుంటున్నారా..? మీ వివరాలు పంపాల్సిన ఈ-మెయిల్ ఐడీ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'నిర్మలా కాన్వెంట్‌' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు . మరోవైపు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమో వెంకటేశాయ అనే చిత్రంలో హథీరాం బాబా పాత్రని పోషిస్తున్నాడు నాగ్.

నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలను కూడా చూస్తున్న నాగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ద్వారా కాస్టింగ్ కాల్ ఇచ్చాడు. టాలెంట్ కలిగి, సినిమాపై ఇంట్రెస్ట్ ఉన్న వారెవరైన సరే ఇచ్చిన మెయిల్ ఐడికి తమ డిటైల్స్ పంపాలని కోరారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌ కాంబినేషన్ లో నిర్మలా కాన్వెంట్ రూపొందిస్తుండగా, ఈ చిత్రానికి సంబంధించి కాస్టింగ్ కాల్ ఇచ్చారా లేదంటే మరేదైన మూవీ కోసం ఇచ్చి ఉంటారా అనే దానిపై క్లారిటీ రావలసి ఉంది.

నాగార్జునతో నటించాలనుకుంటున్నారా..?

నాగార్జునతో నటించాలనుకుంటున్నారా..?

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘నిర్మల కాన్వెంట్'. అందులో అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నది కూడా నాగార్జునే కావటం విశేషం. మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘నిర్మల కాన్వెంట్‌'.

నాగార్జునతో నటించాలనుకుంటున్నారా..?

నాగార్జునతో నటించాలనుకుంటున్నారా..?

ఈ చిత్రం ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. జై చిరంజీవ, దూకుడు, రోబో వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

నాగార్జునతో నటించాలనుకుంటున్నారా..?

నాగార్జునతో నటించాలనుకుంటున్నారా..?

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున గారి కాంబినేషన్ లో తెరకెక్కనున్న 18 వ శతాబ్దపు హాథిరామ్ బాబా జీవిత చరిత్ర "ఓం నమో వేంకటేశాయ"కూడా చిత్రీ కరణ లో ఉంది.

నాగార్జునతో నటించాలనుకుంటున్నారా..?

నాగార్జునతో నటించాలనుకుంటున్నారా..?

ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో దేనికోసం ఈ కాస్టింగ్ కాల్ అన్నది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఈ సినింకోసమేనా లేక వేరే ఏదైనా కొత్త చిత్రం మొదలు పెట్టబోతున్నారా అనేది కూడా తెలియటం లేదు.

నాగార్జునతో నటించాలనుకుంటున్నారా..?

నాగార్జునతో నటించాలనుకుంటున్నారా..?

నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలను కూడా చూస్తున్న నాగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ద్వారా కాస్టింగ్ కాల్ ఇచ్చాడు. టాలెంట్ కలిగి, సినిమాపై ఇంట్రెస్ట్ ఉన్న వారెవరైన సరే, ఏ వయసు వారైనా సరే talent@annapurnastudios.com అన్న మెయిల్ ఐడికి తమ డిటైల్స్ పంపాలని కోరారు.

English summary
Tollywood King actor Nagarjuna gave a casting Call from Annapurna Studios for all ages
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu