»   » శేఖర్ కమ్ముల కాస్టింగ్ కాల్, వరుణ్ తేజ చిత్రం కోసం

శేఖర్ కమ్ముల కాస్టింగ్ కాల్, వరుణ్ తేజ చిత్రం కోసం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వరుణ్ తేజ, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ చిత్రం ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో ఓ చిన్న పిల్లాడి పాత్ర కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చారు శేఖర్ కమ్ముల. క్రింద ఫోటోలో మీరు కాస్టింగ్ కాల్ కు సంభందించిన పూర్తి డిటేల్స్ చూడవచ్చు.

ఈ స్క్రిప్టులో ఎనిమిది నుంచి పన్నెండు సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సున్న చిన్న‌పిల్లవాడు క్యారెక్ట‌ర్ ఉంద‌ట‌. ఈ క్యారెక్ట‌ర్ ని కొత్త వాళ్ల‌తో చేయించాల‌నుకుంటున్నారు.ఆస‌క్తి ఉన్న వాళ్లు సంప్ర‌దించ‌మ‌ని ప్ర‌క‌ట‌నలో కోరారు.

అయితే కండీషన్ ఏమిటీ అంటే..ఆ పిల్లవాడు..తెలుగు మాట్లాడాలి.అది కూడా అమెరిక‌న్ స్లాంగ్ లో మాట్లాడేవారికి ప్రాధాన్య‌త ఇస్తామంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ను త్వ‌ర‌లో ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Casting call for Sekhar Kammula Varun Tej film

ఇక శేఖర్ కమ్ముల చిత్రాలంటే రొటీన్ కు భిన్నంగా సాగుతాయి. ఆయన డైరక్ట్ చేసిన ఆనంద్, హ్యాపీ డేస్, గోదావరి, లీడర్ చిత్రాలు మంచి హిట్టైతే తర్వాత వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక' సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. మరి ఈసారి ఎలాంటి కథను ఆయన ఎంచుకున్నారో చూడాలి.

శేఖర్ కమ్ములు ఆ మధ్యన...వరుణ్ తేజ ముకుంద సినిమాలో బ‌స్సులో బాబాయ్ పాత్ర‌లో క‌నిపించాడు. దాంతో శేఖ‌ర్ వ‌రుణ్ తేజ తో సినిమా తీస్తాడేమో అనుకున్నారు. ఇప్పుడు అదే నిజ‌మ‌వుతోంది. ఈ మధ్యన కమ్ముల చెప్పిన ఒక కథ విన్న దిల్ రాజు ఆ కథను స్ర్టయిట్ గా వరుణ్ దగ్గరకు తీసుకెళ్ళాడు. మనోడికి కూడా అది నచ్చేయడంతో వ‌రుణ్ ఈ సినిమాకి ఓకె చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

Casting call for Sekhar Kammula Varun Tej film

దాంతో ఈ ద‌ర్శ‌కుడు తిరిగి త‌న‌కు హ్యాపీడేస్ రాబోతున్నాయ‌నే కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా క‌థ‌ను బాగా చెక్కుతున్నాడ‌ట‌. అన్నీ కుదిరితే శ్రీను వైట్ల సినిమాకు ముందో వెనకో శేఖ‌ర్ క‌మ్ముల సినిమా ట్రాక్ ఎక్కించే సూచ‌నలున్నాయి. మొత్తానికి శేఖ‌ర్ ఖాతాలో ఒక మెగా సినిమా ప‌డ‌బోతోంద‌న్న‌మాట‌.

English summary
Casting call for Sekhar Kammula Varun Tej film, Sekhar Kammula is joining hands with Dil Raju to produce a film starring Varun Tej in lead role
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu