»   » కోరిక తీర్చమని అడుగుతున్నారంటూ హీరోయిన్ ఆరోపణ

కోరిక తీర్చమని అడుగుతున్నారంటూ హీరోయిన్ ఆరోపణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సంస్కృతి చాలా దారుణంగా ఉన్నట్లు కన్నడ నటి శృతి హరిహరన్ కామెంట్స్ చేసి వార్తలకెక్కింది. తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిన్స్ అసలు గౌరవం ఎవ్వరూ ఇవ్వరని, రక్షణ అనేది ఉండదని పేర్కొంది. తాను తెలుగు సినిమా చేయకపోయినా, తనకు ఇక్కడ విషయాలు తెలసని, చాలా విన్నానని, కోరిక తీర్చమని డైరక్ట్ గా అడుగుతారని, కాంప్రమైజ్ కాకపోతే హీరోయిన్ గా నిలబడలేరని తీవ్రమైన ఆరోపణలు చేసింది.

రీసెంట్ గా కన్నడంలో ల్యూసియా అనే చిత్రంలో పరిచయం అయ్యి పాపులర్ అయి కిరాక్ పార్టీ, యు టర్న్ చిత్రాలు చేసిన శృతి హరిహరన్... టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కోచ్ ఎక్కువని వాళ్లు, వీళ్లు చెప్పుకుంటుంటే తెలిసిందని, అందుకే తెలుగు సినీపరిశ్రమ అంటే తనకి చాలా భయం ఉందనీ తెలిపింది.

'casting couch' culture is much less in Sandalwood as compared to Tollywood: Sruthi Hariharan

అవకాశాల కోసం ఎవ్వరి ముందు తల వంచాల్సిన అవసరం తనకి లేదని వివరించింది శృతి. అలాగే కన్నడ పరిశ్రమ శాండల్‌వుడ్, కోలీవుడ్ కన్నా టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కోచ్ ఎక్కువే అని ఖచ్చితంగా చెప్పడం ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... ఇంతకీ ఈమె ఎవరు..ఏ సినిమాలో నటించింది అని అడుగుతున్నారు. ఇక్కడ టాలీవుడ్ లో పెద్దగా ఎవరికి ఆమె తెలియదు కనుక, ఆమె మాటలు ఫైనల్ గా ఎవరూ సీరియస్ గా తీసుకోరు, అంతా లైట్ అనేస్తున్నారు.

ఇక మన టాలీవుడ్ పై ఇలా మీడియా ముందుకు వచ్చి ఒక హీరోయిన్‌ ఇలాంటి ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో రక్త చరిత్ర, కబాలి, లెజండ్ చిత్రాల హీరోయిన్ రాధికా ఆప్టే కూడా తెలుగు చిత్ర సీమలో హీరోయిన్లని హీనంగా చూస్తారని, ఒక హీరో తనని డైరెక్టుగా కోరిక తీర్చమని అడిగాడని ఆమె ఆరోపించిన విషయం గుర్తుండే ఉండి ఉంటుంది.

English summary
Women can’t just sit around and complain that it’s a male-dominated society if they’re not going to do something about it, says the actor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu