»   » సహజీవనం, కాస్టింగ్ కౌచ్...పర్సనల్ డెసిషన్: నటి గౌతమి సంచలనం

సహజీవనం, కాస్టింగ్ కౌచ్...పర్సనల్ డెసిషన్: నటి గౌతమి సంచలనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలులో తెలుగు కుటుంబంలో పుట్టిన ప్రముఖ నటి గౌతమి.... సినిమా రంగంలోకి వెళ్లిన తర్వాత తమిళనాడులో, తమిళ ఇండస్ట్రీలో సెటిలైన సంగతి తెలిసిందే. తాజాగా ఓ తెలుగు ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

సౌత్ సినిమా పరిశ్రమ మొత్తం చెన్నైలో ఉన్నపుడే తాను సినిమాల్లోకి ఎంటరయ్యానని, తాను నటిగా ఎస్టాబ్లిష్ అయిన నాలుగైదు సంవత్సరాలకు తెలుగు పరిశ్రమ హైదరాబాద్ కు మారిందని, తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. ఆ సమయంలో తమిళ సినిమా పరిశ్రమలో ఎక్కువ అవకాశాలు ఉండటంతో అటు వైపే స్థిరపడాల్సి వచ్చిందని గౌతమి తెలిపారు.

శృతి హాసన్‌తో గొడవపై

శృతి హాసన్‌తో గొడవపై

శృతి హాసన్‌తో తనకు గొడవలేమీ లేవని, అలాంటి వార్తల్లో నిజం లేదని తెలిపారు. నా వయసుకు, శృతి హాసన్ వయసుకు చాలా తేడా ఉంటుంది, మేము పెద్దలం, వారు పిల్లలు వారితో గొడవపడే విషయాలు ఏముంటాయని గౌతమి వ్యాఖ్యానించారు. శబాష్ నాయుడు సినిమా సయంలో కాస్టూమ్స్ విషయంలో వీరి మధ్య విబేధాలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

కమల్ హాసన్‌తో విడిపోవడానికి కారణం

కమల్ హాసన్‌తో విడిపోవడానికి కారణం

నేనూ, కమల్ హాసన్ కలిసి 13 ఏళ్లు కలిసి(సహజీవనం) తర్వాత నా జీవితంలో తీసుకున్న అత్యంత బాధాకరమైన నిర్ణయం ఇది. మార్గాలు తిరిగి కలుసుకోలేనంతగా విడిపోయాయని అర్థమైన తర్వాత రాజీ పడి జీవించడం, అదీ స్వప్నాలను త్యాగం చేసి నిబద్ధతతో కూడిన సంబంధాన్ని కొనసాగించడం అంత సులభం కాదు. లేదంటే ఒంటరితనమనే వాస్తవాన్ని అంగీరించి ముందుకు సాగాలి. గుండె పగిలే ఈ నిజాన్ని అంగీకరించడానికి, ఈ నిర్ణయం తీసుకోవడానికి సుదీర్ఘ కాలం, దాదాపు రెండేళ్ల కాలం పట్టింది. దీని నుంచి సానుభూతి పొందాలనేది గానీ, ఒకర్ని తప్పుపట్టాలనేది గానీ నా ఉద్దేశం కాదు. మార్పు అనేది ఆహ్వానించదగిందనేది, ప్రతి వ్యక్తిలో మార్పును మానవ స్వభావం నిర్ణయిస్తుందనేది నేను నా జీవితం ద్వారా అర్థం చేసుకున్నాను. ఈ మార్పులన్నీ మనం ఊహించేవి, అంచనా వేసేవి కాకపోవచ్చు, ఏమైనా, ఓ సంబంధంలో ఈ విభేదాల ప్రాధాన్యాల వాస్తవ ప్రభావాలను కాదనలేం. జీవితంలోనే ఈ దశలో నా అంతట నేనుగా బహుశా ఈ నిర్ణయాన్ని ముందు పెట్టాల్సిన పరిస్థితి ఏ మహిళకూ రాకూడదు గానీ నాకు అవసరంగా మారింది.... గతంలో గౌతమి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఆమె మళ్లీ తెలిపారు.

మన సాంప్రదాయానికి విరుద్దమైన సహజీవనంపై

మన సాంప్రదాయానికి విరుద్దమైన సహజీవనంపై

సాంప్రదాయానికి వ్యతిరేకం, అనుకూలం అదేమీ లేదు. ఎండ్ ఆఫ్ ది డే హ్యూమన్ రిలేషన్స్ ఇంపార్టెంట్. ఇలాగ ఉండాలనుకునే వారికి అలాగ ఉండే వారు వ్యతిరేకం అంటారు. అలాగ ఉండాలి అనుకునే వారికి ఇలాగ ఉండే వారు వ్యతిరేకం అంటారు. ఏవైనా సరే మ్యారేజ్, ఒక కమిటెడ్ రిలేషన్ షిప్ కాకుండా... టీచర్-స్టూడెంట్, సిస్టర్-బ్రదర్, పేరెంట్-చైల్డ్... ఫ్రెండ్స్, కొలీగ్స్ ఏ రిలేషన్ షిప్ తీసుకున్నా కమిట్మెంట్ ఇంపార్టెంట్. మ్యూచువల్ రెస్పెక్ట్ అంతకన్నా ఇంపార్టెంట్. ఒకరినొకరు గౌరవించి ఒక రిలేషన్ షిప్ లోకి మీరు ఎంటరవ్వండి, అది ఎక్కడికో వెలుతుంది. ఎంతో కాలం నిలుస్తుంది. దానికి మీరు ఏ పేరు పెట్టినా నాకు అభ్యంతరం లేదు అని సహజీవనం గురించి తన అభిప్రాయం వ్యక్తం చేశారు గౌతమి.

కాస్టింగ్ కౌచ్ మీద

కాస్టింగ్ కౌచ్ మీద

కాస్టింగ్ కౌచ్ అంటే అర్థం అందరికీ తెలుసు. ఇలాంటి ఒక ఇన్సెంటివ్‌తో ఒక పని జరుగడం, జరిపించడం అనేది సినిమా ఇండస్ట్రీ ఒక్కటే కాదు. ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంది. ఉందా లేదా అన్న దాని కన్నా ఎంత వరకు అది మన లైఫ్‌ను టచ్ చేయడానికి మనం ఒప్పుకుంటాం... పర్మిషన్ ఇస్తామన్నది ఇంపార్టెంట్. ఇట్స్ యువర్ డెసిషన్. కాంప్రమైజ్ అనేది కేవలం కాంస్టింగ్ కౌచ్ విషయంలోనే కాదు. కొన్ని పనులు జరుగాలని మనం ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ కాంప్రమైజ్ అవుతాం. కొన్ని రిలేషన్ షిప్స్ వర్కౌట్ అవ్వాలని పర్సనల్ స్టాండర్డ్స్ కంప్రమైజ్ అవతాం. కొన్ని పనులు జరుగాలని క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ అడ్జెస్ట్ అవుతాం. ఇలాంటి అడ్జెస్ట్మెంట్ అనేది మన పర్సనల్ డెసిషన్. చేస్తామా లేదా? అనేది మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. చేస్తే ఎలా చేస్తాం? చేయకపోతే ఎందుకు చేయం. దాని వల్ల వచ్చే రిజల్ట్ తీసుకోవడానికి మనం రెడీగా ఉన్నామా? ఇవన్నీ చాలా పర్సనల్ డెసిషన్స్... అంటూ కాస్టింగ్ కౌచ్ మీద గౌతమి తనదైన భాష్యం చెప్పారు.

కామన్ సెన్స్‌తో క్యాన్సర్ ఎదుర్కొన్నా

కామన్ సెన్స్‌తో క్యాన్సర్ ఎదుర్కొన్నా

కాన్సర్ ఎదుర్కోవడానికి ఇన్స్‌స్పిరేషన్ ఎవరూ లేరు....కేవలం నా కామన్ సెన్స్. ఏదైనా సమస్య వచ్చినపుడు కొంపలు మునిగిపోతున్నాయని గుండెలు బాదుకుంటే ఏమీ జరుగదు. దాంతో కథ అయిపోతుంది. నువ్వు ధైర్యంగా ఫైట్ చేసినపుడే ముందుకు సాగుతాం. ఆ ఫైట్ చేయడానికి కారణం ఏమిటనేది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోడానికి కామన్ సెన్స్ కావాలి. కొంత బ్యాలెన్డ్స్ అవుట్ లుక్ కావాలి. నాకు బిగ్గెస్ట్ హెల్ప్ కామన్ సెన్స్. సెల్ప్ ఎగ్జామినేషన్లో నేనే ముందు క్యాన్సర్ లంప్ కనిపెట్టాను. 30 సంవత్సరాల దాటిన తర్వాత రెగ్యులర్ గా సెల్ఫ్ చెక్ చేసుకున్నాను. ధైర్యంగా ట్రీట్మెంట్ చేయించుకున్నాను అని గౌతమి తెలిపారు.

English summary
"Casting Couch Is A Personal Decision" Actress Gautami said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu