For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  'ఇద్దరు అమ్మాయిలతో..' లో తాప్సీ ని తీసేసి మలయాళి భామని....

  By Srikanya
  |

  హైదరాబాద్ : అల్లు అర్జున్,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం 'ఇద్దరు అమ్మాయిలతో..' . లో సెకండ్ హీరోయిన్ గా తాప్సీ అనే ప్రచారం జరిగింది. అయితే అదేమీ కాదని,మళయాళి ముద్దుగుమ్మ మళయాళి ముద్దుగుమ్మ కేధరిన్ ధెరిసా ని ఖరారు చేసారని సమాచారం. కేధరిన్ ఆల్రెడీ నానితో కృష్ణవంశీ చిత్రం పైసాలో చేస్తోంది. అలాగే నీలకంఠ దర్సకత్వంలో రూపొందుతున్న చమ్మక్ చల్లో లో కూడా చేస్తోంది. ఈ రెండు చిత్రాలు త్వరలో విడుదలకు సిద్దమవుతున్నాయి.

  అలాగే ఈ చిత్రం దీపావళి(నవంబర్ 13)నుంచి షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దాన్ని డిసెంబర్ మొదటి వారానికి మార్చారు. లొకేషన్ ఛేంజ్ చేయటంతో ఈ మార్పు జరిగిందని చెప్తున్నారు. అరవై రోజుల పాటు కంటిన్యూ షెడ్యూల్ తో న్యూజిలాండ్ లో ప్రారంభం అవుతుంది. న్యూజిల్యాండ్ లో కొంత షూట్ జరిగాక ఆస్ట్రేలియాకు మారుతుంది.


  కేధరిన్ ధెరిసా ,అమలాపాల్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం ఓ ట్రయాంగ్యులర్ లవ్ స్టోరీ. డిఫెరెంట్ ట్విస్ట్ తో నడిచే ఈ కథలో ఫారిన్ లొకేషన్స్ హైలెట్ కానున్నాయి. ఇక ఈ చిత్రం ఇద్దరు అమ్మాయిలతో ఫారిన్ లో ప్రేమలో పడి వారితో ఇబ్బందులు పడ్డాడు అనే పాయింట్ చుట్టూ తిరగనుంది. దేశముదురు కాంబినేషన్ అల్లు అర్జున్,పూరీ జగన్నాధ్ ని రిపీట్ చేస్తూ బండ్ల గణేష్ రూపొందించే ఈ చిత్రం బారీగా రూపొందనుంది. హీరోయిన్స్ సెంట్రల్ గా నడిచే కధ కాబట్టి ఆ టైటిల్ పెట్టనున్నారని తెలుస్తోంది. 2013 సమ్మర్ కి విడుదల అయ్యే ఈ చిత్రం కథ కేవలం ట్రీట్ మెంట్ బేసెడ్ గా నడుస్తుందిని సమాచారం.

  అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ''కథ గురించి ఇప్పుడే ఏమీ చెప్పను. నాకెంతో నచ్చింది. ఎప్పట్నుంచో సినిమా చేద్దాం అని గణేష్ అడుగుతున్నారు. ఈ చిత్రంతో కుదిరింది. ఒక మంచి నిర్మాతకు కావల్సిన అన్ని లక్షణాలు గణేష్‌లో ఉన్నాయి. 'దేశముదురు' సమయంలో నేను సిక్స్‌ప్యాక్ చేయగలిగానంటే దానికి కారణం జగన్‌గారే. చెప్పిన సమయానికి షూటింగ్‌కి ప్యాకప్ చెప్పి, నాకు వర్కవుట్లు చేసుకునే అవకాశం కల్పించేవారు'' అన్నారు.


  పూరి చిత్రం గురించి చెబుతూ ''ఇదో ప్రేమ కథా చిత్రం. బన్నీ అంటేనే ఎనర్జీ. తనే కాదు సెట్‌లో అందర్నీ ఉత్సాహంగా ఉరకలేయిస్తారు. ఈ కథను అల్లు అరవింద్‌కు చెప్పినపుడు మావాడికి బాగుంటుందని చెప్పారు. తెలుగులో తొలి సిక్స్ ప్యాక్ హీరో. ఈ సినిమా కథను బన్నీకి చెప్పినప్పుడు.. మనమే చేద్దాం అన్నాడు. ఆ తర్వాత అరవింద్‌గార్ని కలిసినప్పుడు 'బన్నీకి ఒక కథ చెప్పావట.. అది తనతోనే చెయ్యి. తనకు బాగా నచ్చింది' అన్నారు. ఇది లవ్‌స్టోరి. నవంబర్ రెండవ వారంలో షూటింగ్ ఆరంభిస్తాం. న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాలో ఎక్కువ శాతం షూటింగ్ చేస్తాం''అన్నారు.

  అల్లు అర్జున్‌ని మాస్‌లోకి చొచ్చుకువెళ్లేలా చేసిన సినిమా 'దేశముదురు'. పూరి జగన్నాథ్ మార్క్ పాత్ర చిత్రణతో అందులో అల్లు అర్జున్ పూర్తి మాసివ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించారు. మళ్లీ వీరిద్దరి కలయికలో ఓ సినిమా రూపొందనుంది. వైవిధ్యభరితంగా టైటిల్స్ పెట్టే పూరి ఈ చిత్రం కోసం 'ఇద్దరమ్మాయిలతో' అనే టైటిల్ ఫిక్స్ చేయటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు . పూరి తరహా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందనుంది. అమలాపాల్‌, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ . ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌వర్మ.

  English summary
  Tapsee has been sacked from Allu Arjun's Iddarammayilatho to be directed by Puri Jagannadh. Although the film’s regular shoot is yet to be commenced, Tapsee was selected recently as the second female lead in the movie. Catherina Tresa now replaces her. Catherine Tresa is currently working in two films - Krishnavamsi's Nani starrer Paisa and Neelakantha's Chammak Challo. Both these films are yet to be released, but this Kerala Kutty has already bagged her third film in Telugu.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more