»   » ఏంటీ ప్రయాణం ?: అల్లు అర్జున్ టు ఎర్రబస్సు

ఏంటీ ప్రయాణం ?: అల్లు అర్జున్ టు ఎర్రబస్సు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : టాలెంట్, అందం హీరోయిన్ కి అవసరమే. అయితే అన్నిటికన్నా అత్యవసరమైంది అదృష్టం. అది లేకపోతే మొదటి రెండూ పెద్దగా గుర్తింపుకు నోచుకోవు. ఇప్పుడు కేథరిన్ కి అదే పరిస్దితి. 'చమ్మక్ చల్లో' చిత్రంతో హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయమైంది మలయాళి భామ కేథరిన్ ని అంతా తెలుగు తెరకు ఓ అద్బుతమైన అమ్మాయి దొరికిందన్నారు. ఈ సినిమా ఫ్లాఫ్ అయినా తన గ్లామర్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఆమె అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

  ఆ తరువాత కృష్ణవంశీ పైసాలో తళుక్కున మెరిసిన ఈ భామ తాజాగా తెలుగులో మరో క్రేజీ అవకాశాన్ని దక్కించుకుంది. అయితే అంత త్వరగా అల్లు అర్జున్ సరసన చేసిన ఆమె ఇప్పుడు ఎర్రబస్సు అనే చిత్రం చేస్తోంది. దాసరి గారి లాంటి సీనియర్ దర్శకుడు చిత్రంలో చేస్తున్నా అల్లు అర్జున్ రేంజిలో ఊహించుకున్న ఆమెకు ఊహించని విధంగా కాస్త క్రిందకు వచ్చి మంచు విష్ణు సరసన ఆఫర్ వచ్చింది. అల్లు అర్జున్ తర్వాత ఆమె రామ్ చరణ్, మహేష్ ఇలాంటి పెద్ద స్టార్స్ పై ఆశలు పెట్టుకుంది. అయితే వైకుంఠపాళిలోలాగ ఇక్కడ ఇలా క్రిందకు వచ్చింది. అయితే అక్కడికీ అదృష్టమనే చెప్పాలి. దాసరి వంటి మెగా దర్శకుడు సినిమాలో నటించటం.

  Catherine Tresa in Erra Bus

  దర్శకరత్న దాసరి నారాయణరావు నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రంఎర్రబస్సు. తమిళ చిత్రం మంజాఫై ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మంచు విష్ణు హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా కేథరిన్‌ను ఎంపిక చేశారు.

  ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ నేను దర్శకత్వం వహిస్తున్న 151వ చిత్రమిది. కథానుగుణంగానే దీనికి ఎర్రబస్సు అనే టైటిల్‌ను పెట్టాం. ఓ అమాయక పల్లెటూరి రైతుకు, అతని మనవడికి మధ్య నెలకొన్న సున్నితమైన భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ నెల 28 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం అని తెలిపారు. బ్రహ్మానందం, యమ్.ఎస్.నారాయణ, కృష్ణుడు, అలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:చక్రి, సినిమాటోగ్రఫీ: అంజి.

  ఈ చిత్రం షూటింగ్‌ ఈ నెల 28న ప్రారంభం కానుంది. ఇందులో పల్లెటూరు నుంచి వచ్చే అమాయక తాత పాత్రను దాసరి పోషిస్తుండగా, ఆయన మనవడి పాత్రలో మంచు విష్ణు నటించనున్నారు.

  English summary
  Manchu Vishnu will be seen in a Dasari Narayana Rao film. Reports indicate that Manchu Vishnu has signed the veteran director’s next venture titled, Erra Bus. Apparently, model and actress Catherine Tresa would be wooing the actor in the family entertainer.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more