»   » దక్కన్ క్రానికల్ పేపరు పై కేధరిన్ ఫైర్, అసలేం రాసారు

దక్కన్ క్రానికల్ పేపరు పై కేధరిన్ ఫైర్, అసలేం రాసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ ఆంగ్ల దినపత్రిక దక్కన్ క్రానికల్ పై సరైనోడు చిత్రం హీరోయిన్ కేథరిన్ మండిపడింది. అల్లు అర్జున్ సక్సెస్ మీట్ లో ఆమె సరైన తెలుగు మాట్లాడలేదంటూ రాసుకొచ్చారు. ఆ సక్సెస్ మీట్ లో ఓ యాంకర్..చిత్రంలో మీకు నచ్చిన డైలాగు చెప్పమంటే ఆమె తెలుగు సరిగ్గా మాట్లాడలేక తడముకుంటూ మాట్లాడిందనే అర్దం వచ్చేలా అందులో ఉంది.

తను సక్సెస్ మీట్ లో మాట్లాడిన మాటలను ఈ విధంగా ఎత్తి చూపుతూ రాసారనే విషయం తెలుసుకున్న కేథరిన్ మండిపడింది. ఫేస్ బుక్ లో ఈ పేపరుని, ఆ పేపరు లింక్ ను ఇస్తూ ఈ క్రింద విధంగా ఆమె పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.అలాగే 'అల్లు అర్జున్‌తో వరుసగా మూడు సినిమాల్లో నటించడం యాధృచ్చికంగా జరిగింది. దీనికి ప్రత్యేకమైన ప్లాన్‌ అంటూ ఏం జరగలేద'ని అంటోంది హీరోయిన్‌ కేథరిన్‌ థ్రెస్సా. 'చమ్మక్‌ చల్లో' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కేథరిన్‌.. బన్నీతో కలిసి నటించిన 'ఇద్దరమ్మాయిలతో' పాపులర్‌ అయ్యింది. ఆ తర్వాత 'పైసా', 'రుద్రమదేవి', 'ఎర్రబస్సు' చిత్రాలతో మెప్పించి తాజాగా బన్నీతో కలిసి ముచ్చటగా మూడోసారి 'సరైనోడు' చిత్రంలో నటించింది.


తెలుగులో నటించిన ఆరు చిత్రాల్లో మూడు బన్నీతోనే జోడీ కట్టడంలో ప్రత్యేకత అంటూ ఏం లేదు. అలా నటించడం యాధృచ్చికంగా జరిగింది. దానికి ప్లానింగ్‌ అనేది కూడా లేదు. దర్శకుడు కథ నెరేట్‌ చేసినప్పుడు అందులోని నా పాత్ర బాగా నచ్చింది. ఓకే చేసేశాను.


అంతేగాని, ఇది అల్లు అర్జున్‌ సినిమానా, మరోటా అనేది నేను ఆలోచించలేదు. అల్లు అర్జున్‌ మంచి ఎనర్జిటిక్‌ స్టార్‌. ఆయన డాన్సులంటే నాకు చాలా ఇష్టం. ఇందులో బన్నీతో కలిసి రెండు పాటల్లో స్టెప్పులేశాను. ఆయన ఎప్పుడూ పాజిటివ్‌ యాటిట్యూడ్‌తో ఉంటారు.


Catherine Tresa hits out at Deccan Chronicle for false article

ఇందులో యంగ్‌ ఎమ్మెల్యేగా నటించాను. మా నాన్న కూడా ఎమ్మెల్యే. ఇందులో మా పార్టీ ఏంటీ?. లేడీ ఎమ్మెల్యేకు, హీరోకు లింకేంటీ? వంటి అసక్తికరమైన అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర నాది. రాజకీయ నాయకురాలిగా అందరినీ అలరిస్తానని నమ్ముతున్నాను.


దర్శకుడు బోయపాటి మాస్‌ డైరెక్టర్‌. ఆయన స్క్రిప్టు చెప్పినప్పుడు నా పాత్ర బాగా నచ్చింది. ముఖ్యంగా యంగ్‌ ఎమ్మెల్యే అనేసరికి బాగా ఎగ్జైట్‌ అయ్యాను. దీంతోపాటు మధ్య మధ్యలో వచ్చే అంశాలు కూడా చాలా బాగుంటాయి. అవన్నీ ప్రేక్షకులను అలరిస్తాయి. దర్శకుడు బోయపాటి నా పాత్ర విషయంలో ప్రత్యేక శ్రద్ధా తీసుకున్నారు. ఆయనతో వర్క్‌ చేయడం అమేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌.


తెలుగులో తక్కువ సినిమాలు చేయడానికి నన్ను ఎగ్జైట్‌ చేసే పాత్రలు, సినిమాలు రాకపోవడమే కారణం. చాలా రోజుల తర్వాత నన్ను ఎగ్జైట్‌ చేసే పాత్ర 'సరైనోడు' ద్వారా వచ్చింది. మంచి కథలు వస్తే అందరూ హీరోలతో నటిస్తా. ప్రస్తుతం తమిళంలో ఆర్యతో ఓ సినిమా, విశాల్‌తో మరో సినిమాలో నటిస్తున్నాను.
ఏ సినిమా చేసినా కథ, పాత్రలే ముఖ్యం' అని చెప్పింది కేథరిన్‌.

English summary
A popular English daily Deccan Chronicle rubbed pretty actress Catherine Tresa the wrong way by publishing an article which ridiculed the actress’s poor Telugu during her speech at the Allu Arjun starrer ‘Sarrainadu’ success press meet. Not taking it lying down the ‘Madras’ girl has issued a strong statement condemning the paper.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu