»   » పూరీ జగన్నాథ్ ట్రై చేశారు.. ఆ విషయంలో వర్కవుట్ కాలేదు.. డ్రగ్స్ అనేది.. క్యాథరిన్

పూరీ జగన్నాథ్ ట్రై చేశారు.. ఆ విషయంలో వర్కవుట్ కాలేదు.. డ్రగ్స్ అనేది.. క్యాథరిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సరైనోడు చిత్రంలో ఎమ్మెల్యే పాత్రలో ఆకట్టుకొన్న క్యాథరిన్ త్రెసా మలయాళ అమ్మాయి. చమ్మక్‌చలో చిత్రం ద్వారా టాలీవుడ్ పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిలతో, పైసా, రుద్రమదేవి, సరైనోడు లాంటి విభిన్నమైన చిత్రాల్లో నటించారు. హీరో గోపిచంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న గౌతమ్ నంద చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం ఆమె నటించిన చిత్రాలు నేనే రాజు నేనే మంత్రి చిత్రం ఆగస్టులో విడుదలకు సిద్దమవుతున్నది. ఈ నేపథ్యంలో క్యాథరిన్ గౌతమ్ నంద చిత్రానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. గౌతమ్‌నంద గురించి, వ్యక్తిగత జీవితం గురించి క్యాథరిన్ ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏమి చెప్పారో ఆమె మాటల్లోనే చూద్దాం..

ముగ్ధ అనే డబ్బు ఉన్న అమ్మాయి పాత్ర

ముగ్ధ అనే డబ్బు ఉన్న అమ్మాయి పాత్ర

గౌతమ్‌నంద చిత్రంలో నా పాత్ర పేరు ముగ్ధ. ఈ సినిమాలో నేను బాగా డబ్బు ఉన్న అమ్మాయిగా నటించాను. ఈ చిత్రంలో నా పాత్రను నేనే డబ్బింగ్ చెప్పాను. గత కొద్దిరోజుల నుంచి నా పాత్రకు డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. నేను తెలుగు మాట్లాడే తీరు సంపత్ నందికి నచ్చి ఈ చిత్రంలో నా చేత డబ్బింగ్ చెప్పించారు. నేను ఎలా డబ్బింగ్ చెప్పానో తెరమీద చూసి మీరే చెప్పాలి.

Goutham Nanda Movie Audio Launch : Udaya Bhanu Got Shocked
పూరీ, కృష్ణవంశీ ప్రయత్నించారు.

పూరీ, కృష్ణవంశీ ప్రయత్నించారు.

నా చేత డబ్బింగ్ చెప్పించండి అని గతంలో కూడా నా డైరెక్టర్లను కూడా అడిగాను. ఇద్దరు అమ్మాయిలతో చిత్రంలో పూరీ జగన్నాథ్, పైసా సినిమాలో కృష్ణవంశీ ప్రయత్నించారు. నా తెలుగు అంత బాగా లేకపోవడంతో కానీ వర్కవుట్ కాలేదు. గౌతమ్‌నందకు వచ్చేసరికి నా తెలుగు బాగా ఇంప్రూవ్ అయింది. దాంతో నాకు డబ్బింగ్ చెప్పాలనే కాన్ఫిడెన్స్ వచ్చింది.

డబ్బింగ్ చెబితే పరిపూర్ణత

డబ్బింగ్ చెబితే పరిపూర్ణత

ఎప్పుడైతే నేను నటించిన పాత్రకు డబ్బింగ్ చెప్పినప్పుడు ఆ పాత్రకు సార్థకత ఏర్పడుతుంది. నాకు ఓ సంతృప్తి కలుగుతుంది. పాత్రల విషయానికి వస్తే నేను ఎంచుకొనే పాత్రల్లో ఏదో వైవిధ్యం ఉండేలా చూసుకొంటాను. అప్పుడే నటిగా సంతృప్తి కలుగుతుంది. తెలుగు నేర్చుకోవడానికి తెలుగు మాస్టారును ఏర్పాటు చేసుకొన్నాను. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన వ్యక్తి నాకు తెలుగు నేర్పిస్తున్నారు. యూనిట్ వాళ్లతో తెలుగులోనే మాట్లాడుతాను.

గ్లామర్ రోల్‌లో కనిపిస్తాను.

గ్లామర్ రోల్‌లో కనిపిస్తాను.

గతంలో నటించిన సినిమాలో కంటే చిత్రంలో నేను గ్లామర్‌గా కనిపిస్తాను. ఈ చిత్రంలో నా పాత్ర మంచి అమ్మాయి పాత్ర. ప్రవర్తన డీసెంట్‌గా ఉంటుంది. ఈ సినిమా కోసం బరువు తగ్గాను. డ్యాన్సుల్లో ఇంకా మెరుగ్గా కనిపిస్తాను. నేనే రాజు.. నేనే మంత్రి చిత్రంలో పొగరుబోతుగా కనిపిస్తాను. సిగరెట్ కూడా తాగుతాను. అట్లా అని సిగరెట్ తాగడం ఆరోగ్యం హానికరం.

హన్సికతో కొన్ని సీన్లే ఉన్నాయి..

హన్సికతో కొన్ని సీన్లే ఉన్నాయి..

హన్సికతో కొన్ని కాంబినేషన్ సీన్లు ఉంటాయి. అవి కూడా క్లైమాక్స్‌లోనే ఉంటాయి. హన్సికది డీ గ్లామరైజ్డ్ రోల్. ఆమెతో నటించడం గొప్పగా ఉంది. ఎనర్జీ ఉంటుంది. ఇప్పటివరకు నేను నటించిన అన్ని చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఈ చిత్రంలో కూడా ఇద్దరు హీరోయిన్లు. ఎవరి పాత్రలు వారికి బలంగా అనిపిస్తాయి.

గోపిచంద్‌ను చూసి వావ్ అనుకొన్నాను..

గోపిచంద్‌ను చూసి వావ్ అనుకొన్నాను..

గోపిచంద్ మంచి మనిషి. గొప్ప మనసు ఉన్న వ్యక్తి. ఆయనను ఫస్ట్ టైమ్ గౌతమ్‌నంద షూటింగ్‌లోనే చూశాను. అతనికి కుటుంబపరమైన వ్యక్తి అనే ఇమేజ్ ఇండస్ట్రీలో ఉంది. తొలిసారి సెట్‌లో చూడగానే చాలా స్టైలిష్‌గా కనిపించాడు. అప్పడే అనుకున్నాను మనసులో వావ్ అనుకొన్నాను. గోపిచంద్ కొత్త లుక్‌లో బాగా ఉన్నాడు. ఆ లుక్ కోసం దర్శకుడు సంపత్ నంది చాల కష్టపడ్డాడు.

హైదరాబాద్‌ వాళ్లు మంచి మనసున్నవాళ్లు

హైదరాబాద్‌ వాళ్లు మంచి మనసున్నవాళ్లు

హైదరాబాద్‌లో మంచి ఇల్లు కొనుకొన్నాను. ప్రాంతం కంటే ఇక్కడి మనుషులు చాలా మంచి వారు. మంచి మనసు కలవారు. మంచి ఇల్లు దొరికింది. ఇంట్లో కుక్కలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు సొంత ఇంట్లో నాకు ఇష్టమైన డ్యాన్స్ చేయడానికి అవకాశం లభిస్తుంది.

అభిరుచి ఉన్న దర్శకుడు సంపత్ నంది

అభిరుచి ఉన్న దర్శకుడు సంపత్ నంది

ఫిలిం మేకింగ్‌లో సంపత్ నందికి మంచి అభిరుచి ఉంది. సినిమాను అందంగా ఎలా చూపించాలో ఆయనకు బాగా తెలుసు. గౌతమ్‌నంద కథ బలమైన కథ. ఎమోషన్స్ ఉంటాయి. గత సినిమాలు రచ్చ, బెంగాల్ టైగర్ కంటే గౌతమ్‌నంద స్క్రిప్ట్ మంచిగా ఉంది. వాన పాటలను బాగా తెరకెక్కిస్తాడు. ఈ సినిమాలో కూడా నాకు వానపాట ఉంది. అలాంటి పాటలో నటించడం మొదటిసారి.

 50 ఏళ్లు వచ్చేసరికి తెలుస్తుందేమో..

50 ఏళ్లు వచ్చేసరికి తెలుస్తుందేమో..

నేను ఎవరు అనే పాయింట్ ద్వారా గౌతమ్‌నంద తీశారు. ఈ సినిమా ద్వారా నేను ఎవరు అనే విషయాన్ని గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. నా గురించి నేను తెలుసుకోవడం అనేది ఒక్క రోజు ప్రక్రియ కాదు. కానీ 45, 50 ఏళ్లు వచ్చేసరికి తెలుస్తుందేమో. అప్పుడు నేనేంటో ఏందో చెబుతాను.

నెక్ట్స్ లెవెల్ చిత్రం గురించి

నెక్ట్స్ లెవెల్ చిత్రం గురించి

సరైనోడు చిత్రం సమయంలో బోయపాటిని కలిసినప్పడు ఎమ్మెల్యే. హీరో లవ్‌లో పడుతాడు అని కథ చెప్పాడు. చాలా కొత్తగా ఉందనిపించింది. ఆ చిత్రం తర్వాత నా కెరీర్ మరో లెవెల్‌కు తీసుకెళ్లే సినిమా గురించి ఆలోచించలేదు. మంచి బ్యానర్, టీమ్ గురించి చూశాను.

డ్రగ్స్ వాడటం అనేది..

డ్రగ్స్ వాడటం అనేది..

టాలీవుడ్‌లో డ్రగ్స్ వివాదం గురించి ఎక్కువగా ఫాలో కాలేదు. డగ్ర్స్ వాడటం అనేది వ్యక్తుల అభిరుచికి తగిన అంశం. డ్రగ్స్ వాడటం అనేది నా దృష్టిలో తప్పు. ఆరోగ్యానికి మంచిది కాదు. ఎవరు వాడినా నేను ఒప్పుకోను.

English summary
Actress Catherine Tresa's latest movie is Gautam Nanda. Gopichand, Hansikaare in lead roles. This movie releasing on 28th July. In this occassion, Catherine Tresa talks about his forthcoming film Gautam Nanda movie and his Character, Director Sampath Nandi taking.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu