twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్సానందకు సెన్సార్ బోర్డు ఊరట

    By Bojja Kumar
    |

    సెక్స్ స్కాముల్లో ఇరుక్కుని సెక్సానందగా పాపులర్ అయిన తమిళనాడు స్వామీజీ నిత్యానందకు CBFC(సెంట్రల్ బోర్డ్ ఆప్ ఫిల్మ్ సర్టిఫికేషన్)నిర్ణయం కాస్త ఊరటనిచ్చింది. నిత్యానంద సెక్స్ స్కామ్స్ ఆధారంగా తెలుగులో 'అయ్యారే" అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ నిత్యానంద పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా విడుదలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిత్యానంద ధ్యానపీఠం గతంలో హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు నిత్యానందను కేంద్ర సెన్సార్ బోర్డును ఆశ్రయించాల్సిందిగా సూచించింది.

    ఈ మేరకు నిత్యానంద అనుచరులు CBFC ఆశ్రయించగా....అయ్యారే సినిమాను, నిత్యానంద అభ్యర్థనను పరిశీలించిన CBFC ఆ సినిమాలో నిత్యానంద ప్రస్తావనకు సంబంధించిన సీన్లను, డైలాగులను తొలగించాల్సిందిగా ఆదేశించింది. అయితే సినిమా విడుదలను అడ్డుకోవడం కుదరదని తేల్చి చెప్పింది.

    రంజిత తో దొరికిపోయిన నిత్యానంద స్వామి సినిమా వాళ్లకి హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పటికే పలు సినిమాల్లో కామెడీ బాబా లను మనం చూస్తుండగా, తెలుగులో నిత్యానంద రాసలీలను నటకిరీటి ప్రధాన పాత్రలో తెరకెక్కించారు. అయితే సెన్సార్ కట్టింగుల కారణంగా సినిమా స్వరూపం పూర్తిగా మారిపోయిందనే వాదన వినిపిస్తోంది. మరి రంజిత పాత్ర ఉంటుందో? ఉండదో? సినిమా విడుదలైతే కానీ తెలియదు. ఈ సినిమాకు సాగర చంద్ర దర్శకత్వం వహించారు. బి. సుధాకర్, రంగన, అచ్చప్ప నిర్మాతలు. ఈ సినిమాలో పోలీసాఫీసరు పాత్రను సాయికుమార్ పోషించారు.

    English summary
    Deleting controversial guru Swami Nityananda's references from a Telugu movie, decks have been cleared for its release starring Rajendra Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X