»   »  సిసిఎల్-4 ఫైనల్స్: సుదీప్ ముద్దు, హీరోయిన్ల హుషారు (ఫోటోలు)

సిసిఎల్-4 ఫైనల్స్: సుదీప్ ముద్దు, హీరోయిన్ల హుషారు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts


  గత కొన్ని రోజులుగా సందడిగా సాగుతున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్)-4 టోర్నీ అట్టహాసంగా ముగిసింది. సిసిఎల్-4 టైటిల్ దక్కించుకోవడంలో భాగంగా కర్నాటక బుల్డోజర్స్, కేరళ స్ట్రైకర్స్ మధ్య జరిగిన ఫైనల్ పోరులో సుధీప్ నేతృత్వంలోని కర్నాటక బుల్డోజర్స్ పై చేయి సాధించింది. కర్నాటక టీం 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. గత సంవత్సరం కూడా సీసీఎల్-3 టైటిల్ ఇదే టీం దక్కించుకోవడం గమనార్హం.

  తొలుత బ్యాటింగ్ చేపట్టిన కర్ణాటక బుల్డోజర్స్ 212 పరుగుల టార్గెట్ కేరళ స్ట్రైకర్స్ ముందుంచింది. అయితే కేరళ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి కేవలం 175 పరుగులు మాత్రమే చేసింది. కేరళ టీం బ్యాట్స్ మెన్స్ కొడియేరి, రాజీవ్ పిళ్లై, మని కుట్టన్, రాకెండ్ కుమార్, విజయచంద్రం అరుణ్ వరుస ఔట్ కావడంతో ఓటమి తప్పలేదు.

  అంతకుముందు టాస్ గెలిచిన కేరళ స్ట్రైకర్స్ తొలతు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన కర్ణాటక బుల్డోజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 211 పరుగులు చేసింది. మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

  మ్యాన్ ఆఫ్ ధి మ్యాచ్

  మ్యాన్ ఆఫ్ ధి మ్యాచ్


  కర్ణాటక బుల్డోజర్స్ జట్టు సభ్యుడు ధృవ్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇతను 41 బంతుల్లో 6 సిక్సర్లు బాది 56 పరుగులు చేసాడు. మరో వైపు బౌలింగులో 4 ఓవర్లకు 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

  కార్బన్ కమాల్ క్యాచ్

  కార్బన్ కమాల్ క్యాచ్


  కార్బన్ కమాల్ క్యాచ్ అవార్డును కర్నాటక బుల్డోజర్స్ డాషింగ్ ఓపెనర్ ప్రదీప్ అందుకున్నారు. ధృవ్ శర్మ ఓవర్లో.....ప్రదీప్ కేరళ జట్టు కెప్టెన్ రాజీవ్ పిళ్లై క్యాచ్ అందుకున్నారు. అదే విధంగా భాస్కర్ వేసిన ఓవర్లో షఫిఖ్ రెహ్మాన్ క్యాచ్ అందుకున్నాడు.

  పవర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్

  పవర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్


  మరో వైపు పవర్ ప్లేయర్ ఆఫ్ ధి మ్యాచ్ అవార్డును కూడా కర్నాటక బుల్డోజర్స్ జట్టు సభ్యుడు ధృవ్ వర్మ అందుకున్నాడు.

  కూలెస్ట్ ప్లే ఆఫ్ ది మ్యాచ్

  కూలెస్ట్ ప్లే ఆఫ్ ది మ్యాచ్


  కేరళ జట్టుకు చెందిన అర్జున్ నంద కుమార్ కూలెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 47 బంతుల్లో ఇతడు 8 బౌండరీలు, 4 సిక్సులు బాది 78 పరుగులు చేసాడు.

  బెస్ట్ బ్యాట్స్ మెన్ ఆఫ్ ది సిరీస్

  బెస్ట్ బ్యాట్స్ మెన్ ఆఫ్ ది సిరీస్


  కర్నాటక బుల్డోజర్స్ జట్టు డాషింగ్ ఓపెనర్ ప్రదీప్ బెస్ట్ బ్యాట్స్ మెన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.

  బెస్ట్ బౌలర్ ఆఫ్ ది సిరీస్

  బెస్ట్ బౌలర్ ఆఫ్ ది సిరీస్


  ముంబై హీరోస్ జట్టుకు చెందిన బాబీ డియోల్ బెస్ట్ బౌలర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.

  మ్యాన్ ఆఫ్ ది సిరీస్

  మ్యాన్ ఆఫ్ ది సిరీస్


  కేరళ బుల్డోజర్స్‌కు చెందిన దృవ్ శర్మ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు.

  హీరో ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్ రాజీవ్

  హీరో ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్ రాజీవ్


  కర్నాటక బుల్డోజర్స్ జట్టు సభ్యుడు రాజీవ్ ఫైనల్ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. సిసిఎల్ హిస్టరీలో సరికొత్త హిస్టరీ సృష్టించాడు. 42 బంతుల్లో 12 బౌండరీలు, 7 సిక్సులు బాది 112 పరుగులు చేసి ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి బ్యాట్స్ మెన్‌గా రికార్డులకెక్కాడు.

  రాజీవ్ మరియు దృవ్ భాగస్వామ్యం

  రాజీవ్ మరియు దృవ్ భాగస్వామ్యం


  కర్నాటక బుల్డోజర్స్ జట్టు ఓపెనర్స్ ప్రదీప్, రాహుల్ త్వరంగానే ఔట్ కావడంతో అంతా కంగారు పడ్డారు. అయితే దృవ్, రాహుల్ మంచి భాగస్వామ్యం అందించి జట్టును గట్టెక్కించారు. వీరిద్దరి భాగస్వమ్యంలో 83 బంతుల్లో 168 పరుగులు వచ్చాయి.

  కేరళ స్ట్రైకర్స్ జట్టుకు షాక్....

  కేరళ స్ట్రైకర్స్ జట్టుకు షాక్....


  కేరళ జట్టు బ్యాట్స్ మెన్స్ కొడియారి, రాజీవ్ పిళ్లై, మనికుట్టన్, రాకెండు కుమార్, విజయచంద్రం అరుణ్ వరుస వికెట్లు పడటంతో జట్టు ఓటమి పాలైంది.

  కర్నాటక బుల్డోజర్స్ స్కోరు కార్డ్

  కర్నాటక బుల్డోజర్స్ స్కోరు కార్డ్


  కర్నాటక బుల్డోజర్స్ 2 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రదీప్ 14 బంతుల్లో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ రాహుల్ 21 బంతుల్లో 24 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టాడు. రాజీవ్ 42 బంతుల్లో 112 జరుగులు చేసి జట్టును గట్టెక్కించాడు. దృవ్ వర్మ 41 బంతుల్లో 56 పరుగులు చేసాడు.

  కేరళ స్టైకర్స్ స్కోరు కార్డు

  కేరళ స్టైకర్స్ స్కోరు కార్డు


  కేరళ జట్టు సభ్యుల్లో కొడియారి 9 బంతుల్లో 10 పరుగులు, రాజీవ్ పిళ్లై 15 బంతుల్లో 15 పరుగులు, నందకుమార్ 47 బంతుల్లో 78 పరుగులు, మని కుట్టన్ 5 బంతుల్లో 2 పరుగులు(రిటైర్ హర్ట్), విజయచంద్రం అరుణ్ 2 బంతుల్లో 5 పరుగులు, రాకెండు కుమార్ 3 బంతుల్లో 6 పరుగులు, సంతోష్ సలీబా 29 బంతుల్లో 29 పరుగులు, రెహ్మాన్ 5 బంతుల్లో 7 పరుగులు, వివేక్ గోపన్ 2 బంతుల్లో 1 పరుగులు, సురేష్ నాయర్, ప్రజోద్ కళా భవన్ చెరొక జరుగుచేసారు.

  కర్నాటక బుల్డోజర్స్ బౌలింగ్

  కర్నాటక బుల్డోజర్స్ బౌలింగ్


  కర్నాటక బుల్డోజర్స్ జట్టు సభ్యులు బ్యాటింగ్ విషయంలోనే కాకుండా బౌలింగ్ విషయంలోనూ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

  కేరళ స్టైకర్స్ బౌలింగ్

  కేరళ స్టైకర్స్ బౌలింగ్


  కేరళ జట్టులో సురేష్ నాయర్ (ప్రదీప్ వికెట్) , వివేక్ గోపన్(రాహుల్ వికెట్) మాత్రమే వికెట్లు తీసారు.

  కర్నాటక బుల్డోజర్స్ వికెట్స్ పడిపోయిన తీరు

  కర్నాటక బుల్డోజర్స్ వికెట్స్ పడిపోయిన తీరు


  1-21 (పదీప్, 3.5 ఓవర్స్); 2-51 (రాహుల్, 8.3 ఓవర్స్).

  కేరళ స్ట్రైకర్స్ వికెట్ పిపోయిన తీరు

  కేరళ స్ట్రైకర్స్ వికెట్ పిపోయిన తీరు


  1-28 (రాజీవ్ పిళ్లై, 3.4 ఓవర్స్); 2-32 (కొడియారి, 4.1 ఓవర్స్); 3-44 (అరుణ్, 6.2 ఓవర్స్); 4-51 (రాకెండు కుమార్, 6.6 ఓవర్లు); 5-164 (సంతోష్ సలీబా, 17.6 ఓవర్లు); 6-165 (నందకుమార్, 18.1 ఓవర్లు); 7-169 (వివేక్ గోపన్, 18.6 ఓవర్లు); 8-173 (రఫిఖ్ రెహమాన్, 19.2 ఓవర్లు).

  సిసిఎల్-3 ఛాంపియన్స్ కూడా కన్నడిగులే

  సిసిఎల్-3 ఛాంపియన్స్ కూడా కన్నడిగులే


  2013లో జరిగిన సిసిఎల్-3 టెర్నీలో కూడా కర్నాటక బుల్డోజర్స్ టైటిల్ కైవశం చేసుకున్నారు. గత సంవత్సరం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక బుల్డెజర్స్ తెలుగు వారియర్స్‌తో తలపడ్డారు.

  సిసిఎల్-3 ఛాంపియన్స్ కూడా కన్నడిగులే

  సిసిఎల్-3 ఛాంపియన్స్ కూడా కన్నడిగులే


  2013లో జరిగిన సిసిఎల్-3 టెర్నీలో కూడా కర్నాటక బుల్డోజర్స్ టైటిల్ కైవశం చేసుకున్నారు. గత సంవత్సరం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక బుల్డెజర్స్ తెలుగు వారియర్స్‌తో తలపడ్డారు.

  English summary
  In the final match of Celebrity Cricket League (CCL 4), Karnataka Bulldozers representing Kannada film industry has won by 36 runs against Kerala Strikers. The team headed by Abhinaya Chakravarthy Kiccha Sudeep was also the champions of CCL 3. By beating Kerala Strikers in the final match, Karnataka Bulldozers has lifted CCL trophy for the second time.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more