»   » పుంగి భజాయించిన చార్మి, అఖిల్ వీరబాదుడు (ఫోటోలు)

పుంగి భజాయించిన చార్మి, అఖిల్ వీరబాదుడు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

దుబాయ్‌లో ఇటీవల ప్రారంభమైన సినీ తారల క్రికెట్ టోర్నీ 'సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌-4' ఫుల్ జోష్‌తో సందడి సందడిగా సాగుతోంది. తెలుగు వారియర్స్, ముంబై హీరోస్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన తెలుగు వారియర్స్.....ఈ టోర్నీలో బోణి కొట్టి పాయింట్ల ఖాతాను తెరిచింది.

టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో బ్యాటింగుకు దిగిన సునీల్ శెట్టి నేతృత్వంలోని ముంబై హీరోస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. తెలుగు వారియర్స్ బౌలర్ద ధాటికి ఓపెనర్లతో పాటు మొదటి అరడజను మంది బ్యాట్స్‌మెన్స్ పెద్దగా పరుగులేమీ చేయకుండా చేతులెత్తేసారు. అయితే దర్శకుడు అపూర్వ లఖియా 30 బంతుల్లో 69 పరుగులు చేసి జట్టును గట్టెక్కించాడు. తెలుగు బౌలర్లు రఘు 3, నందకిషోర్ 3, సచిన్ జోషి 2 వికెట్లు తీసారు.

128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ 4 వికెట్ల నష్టానికి 18 ఓవర్లలోనే టార్గెట్ చేధించింది. ఓపెనర్లు ప్రిన్స్ 25, సుధీర్ బాబు 16 పరుగులు చేయగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రఘు పరుగులేమీ చేయకుండా రనౌట్ అయ్యాడు. సచిన్ జోషి 22, ఆదర్శ్ 33, అఖిల్ 28 పరుగులతో రాణించారు. స్లైడ్‌షోలో మ్యాచుకు సంబంధించి పోటోలు, వివరాలు....

టాస్...

టాస్...


తెలుగు వారియర్స్, ముంబై హీరోస్ జట్ల మధ్య టాస్ వేస్తున్న దృశ్యం. టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నారు.

బ్యాటింగులో దుమ్ము రేపారు

బ్యాటింగులో దుమ్ము రేపారు


తెలుగు వారియర్స్ జట్టు సభ్యులు అక్కినేని అకిల్, ఆదర్శ్ బ్యాటింగులో దుమ్ము రేపారు. బాల్‌ను వీరబాదుడు బాదుతూ పరుగులు చేసారు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్


ముంబై హీరోస్ జట్టు ఓపెనర్లతో సహా 3 వికెట్లు పడగొట్టి తెలుగు వారియర్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రఘుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

పుంగి భజాయిస్తున్న చార్మి

పుంగి భజాయిస్తున్న చార్మి


తెలుగు వారియర్స్ జట్టుకు పరుగులు చేస్తూ హుషారెత్తిస్తుంటే....ఇలా పుంగి భజాయిస్తూ చార్మి సందడి చేసింది.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్


తెలుగువారియర్స్, ముంబై హీరోస్ మ్యాచ్ వీక్షిస్తున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.

యాంకర్ సుమ

యాంకర్ సుమ


తెలుగు టీవీ యాంకర్ సుమ...సిసిఎల్ టోర్నీలోనూ మైక్ చేతపట్టుకుని తన టాలెంటు చూపింది.

ఆనంద తాండవం

ఆనంద తాండవం


తెలుగు వారియర్స్ జట్టు సభ్యులు విజయ సాధించడంతో ఆనదంతో తాండవిస్తున్న హీరోయిన్ చార్మి.

సన్నీ లియోన్

సన్నీ లియోన్


హీరోయిన్ సన్నీ లియోన్....సచిన్ జోషికి సంబంధించిన XXX ఎనర్జీ డ్రింకును ప్రమోట్ చేస్తూ స్టేడియంలో సందడి చేసింది.

చీర్ లీడర్స్

చీర్ లీడర్స్


మధ్య మధ్యలో చీర్ లీడర్స్ చేసే సందడి సెలబ్రిటీ క్రిరెట్ లీగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

English summary
Telugu Warriors have beaten Mumbai Heroes in their second match in Celebrity Cricket League (CCL) 4 held in Dubai on February 1, 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu