»   » సిసిఎల్: వెంకీ ముందే ఫోజులు కొట్టిన అఖిల్ (ఫోటోలు)

సిసిఎల్: వెంకీ ముందే ఫోజులు కొట్టిన అఖిల్ (ఫోటోలు)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: జనవరి 25వ తేదీ నుంచి సినీతారల సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సీజన్ 4 ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం 'తెలుగు వారియర్స్' జట్టు లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తెలుగు వారియర్స్ జట్టుకు హీరో వెంకటేష్ కెప్టెన్‌ బాధ్యతలు చేపట్టగా....నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

  ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ ఈ సారి శక్తిమేర పోరాడి సిసిఎల్ టైటిల్ గెలుచుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల్ అక్కినేని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ సంవత్సరం హీరోగా వెండితెరకు పరిచయం అవుతుండటం, అదే సమయంలో సిసిఎల్-4 వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు దక్కడంతో అఖిల్ ఎంతో ఉత్సాహంగా కనిపించాడు.

  'తెలుగు వారియర్స్' జట్టు సభ్యుల కోలాహలం, అందమైన మోడల్స్ ర్యాంప్ వాక్, హుషారునిచ్చే మ్యూజిక్ మధ్య ఈ కార్యక్రమం ఎంతో సందడిగా సాగింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో.....

  తెలుగు వారియర్స్

  తెలుగు వారియర్స్


  తెలుగు వారియర్స్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా వెంకటేష్, అఖిల్ చాలా సందడిగా గడిపారు. అందుకు ఈ ఫోటోయే నిదర్శనం.

  వెంకీ సూచనలు

  వెంకీ సూచనలు


  లోగో ఆవిష్కరణ కార్యక్రమం సందర్బంగా జట్టు సభ్యుడైన సచిన్ జోషికి సూచనలిస్తున్న తెలుగు వారియర్స్ కెప్టెన్ విక్టరీ వెంకటేష్.

  అఖిల్ ఫోజులు..

  అఖిల్ ఫోజులు..


  గతంలో పోలిస్తే అఖిల్ అక్కినేని ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది. ఓ వైపు ఈ సంవత్సరం హీరోగా పరిచయం అవుతుండటం, మరో వైపు వైస్ కెప్టెన్ బాధ్యతలు. ఆ మాత్రం ఉంటుంది లెండి. చూడండి మామయ్య వెంకటేష్ పక్కనే ఎలా ఫోజులు కొడుతున్నాడో.

  ఫోటో ఫ్లీజ్..

  ఫోటో ఫ్లీజ్..


  తెలుగు వారియర్స్ జట్టు సభ్యులతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తేన్న కెప్టెన్ వెంకటేష్, వైస్ కెప్టెన్ అఖిల్ అక్కినేని.

  విజయం మాదే..

  విజయం మాదే..


  ఈ సారి సిసిఎల్ టోర్నీలో విజయం మాదే అంటూ ఛాలెంజ్ చేస్తున్న తెలుగు వారియర్స్ జట్టు సభ్యులు.

  చాముండితో అఖిల్ చిట్ చాట్

  చాముండితో అఖిల్ చిట్ చాట్


  సెలబ్రిటీలు ఎక్కడ ఉంటే...చాముండేశ్వరి‌నాథ్ అక్కడ వాలి పోతుంటారు. సచిన్ నుండి అఖిల్ వరకు అందరితోనూ స్నేహం చేయడం ఆయనకు అలవాటు.

  మోడల్స్ ర్యాంప్ వాక్

  మోడల్స్ ర్యాంప్ వాక్


  తెలుగు వారియర్స్ జట్టు లోగో ఆవిష్కరణ సందర్భంగా అందమైన మోడల్స్‌తో ర్యాంప్ వాక్ చేయించారు. పలువురు మోడల్స్ తమ హొయలతో ఆకట్టుకున్నారు.

  పెర్పార్మెన్స్ సూపర్

  పెర్పార్మెన్స్ సూపర్


  విద్యుత్ బల్బులతో కూడిన సీతాకోక చిలుకు వస్త్ర ధారణతో ఓ వ్యక్తి ఇచ్చిన పెర్ఫార్మెన్స్ సూపర్బ్ అనిపించింది.

  సిసిఎల్ 4

  సిసిఎల్ 4


  సినిమా తారలు ఆడే సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌కు మంచి ఆదరణ లభిస్తున్నతరుణంలో ఈ మెగా సెలబ్రిటీ క్రికెట్ టోర్నీ రోజు రోజుకు విస్తరిస్తోంది.

  గ్రాండ్‌గా

  గ్రాండ్‌గా


  ఇప్పటికే జరిగిన సిసిఎల్ టోర్నీలు విజయవంతం అయిన నేపథ్యంలో 2014లో జరిగే టోర్నీని మరింత గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి జరిగే టోర్నీలో తెలుగు వారియర్స్ జట్టుకు వెంకటేష్, అక్కినేని అఖిల్ సంయుక్తంగా నేతృత్వం వహించనున్నారు. వెంకటేష్ కెప్టెన్‌గా, అఖిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

  అఖిల్

  అఖిల్


  ఇప్పటికే జరిగిన సిసిఎల్ టోర్నీలు విజయవంతం అయిన నేపథ్యంలో 2014లో జరిగే టోర్నీని మరింత గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి జరిగే టోర్నీలో తెలుగు వారియర్స్ జట్టుకు వెంకటేష్, అక్కినేని అఖిల్ సంయుక్తంగా నేతృత్వం వహించనున్నారు. వెంకటేష్ కెప్టెన్‌గా, అఖిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

  జనవరి 25న ప్రారంభం

  జనవరి 25న ప్రారంభం


  ఈ నెల 25 నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది. ఇటీవల ముంబైలో జరిగిన కార్యక్రమంలో సిసిఎల్ సరికొత్త సీజన్ ట్రోఫీని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆవిష్కరించాడు.

  మొత్తం 8 జట్లు

  మొత్తం 8 జట్లు


  దేశంలోని వివిధ సినీ రంగాలకు చెందిన ఎనిమిదిజట్లు సిసిఎల్ 4 టోర్నీలో పోటీ పడనున్నాయి.

  నాకౌట్ పోటీలు

  నాకౌట్ పోటీలు


  ఎనిమిది జట్లు.. రెండు గ్రూపులుగా తలపడిన అనంతరం సెమీ ఫైనల్స్ నాకౌట్ పోటీలు నిర్వహిస్తారు.

  టైటిల్ సమరం

  టైటిల్ సమరం


  టైటిల్ సమరం హైదరాబాద్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగుతుంది.

  వారాంతాల్లో మాత్రమే

  వారాంతాల్లో మాత్రమే


  కేవలం వారాంతపు చివరి రెండు రోజుల్లో మాత్రమే జరిగే ఈ లీగ్ లో కేరళ స్ట్రయికర్స్, చెన్నై రైనోస్, తెలుగు వారియర్స్, కర్నాటక బుల్ డోజర్స్, భోజ్ పురి దంబాద్, వీర్ మరాఠీ, ముంబై హీరోస్ జట్లు తలపడుతున్నాయి.

  English summary
  Celebrity Cricket League 2014 (CCL 4) Telugu Warriors Team Logo Launch event held at Hyderabad. Actor Venkatesh, Srikanth, Akhil Akkineni, Nikhil Siddharth, Samrat, Ajay, Adarsh Balakrishna, Nanda Kishore, Sudhir Babu, Naveen Chandra, Rajeev Kanakala graced the event.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more