»   » సిసిఎల్-5 విజేత టాలీవుడ్, హీరోయిన్ల సందడి (ఫోటోస్)

సిసిఎల్-5 విజేత టాలీవుడ్, హీరోయిన్ల సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గత నాలుగు సీజన్లలో సిసిఎల్(సెలబ్రిటీ క్రికెట్ లీగ్) ట్రోపీని గెలుపొందడంలో విఫలమైన తెలుగు వారియర్స్.....ఈ సారి మాత్రం సత్తా చాటారు. హైదరాబాద్ లోని ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో చెన్నై రైనోస్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ సూపర్ పెర్ఫార్మెన్స్‌తో సిసిఎల్-5 టోర్నీ విజేతగా అవతరించారు.

తెలుగు వారియర్స్ జట్టు 7 వికెట్ల తేడాతో చెన్నై రైనోస్ పై విజయం సాదించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తెలుగు వారియర్స్ టీం మొదటి నుంచి చెన్నై రైనోస్ బ్యాట్స్ మెన్స్ ని కట్టడి చేస్తూ, టఫ్ బౌలింగ్ తో వరుసగా వికెట్లు తీస్తూ ఎక్కువ పరుగులు చేయనీకుండా చేసింది. దీంతో రైనోస్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఆ తర్వాత 133 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ 18.1 ఓవర్లలో కేవలం 3 వికెట్ల నష్టంతో లక్ష్యాన్ని చేదించింది. ఇక చివర్లో తెలుగు వారియర్స్ కెప్టెన్ అక్కినేని అఖిల్ మెరపులు మెరిపించడంతో విజయం సునాయాసం అయ్యింది.

ప్రొపెషనల్ క్రికెట్ ప్లేయర్లకు ఏమాత్రం తీసి పోకుండా పలువురు స్టార్స్ ఆట అదరగొట్టారు. మొదటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తూ వరుస విజయాలను అందుకుంటూ వచ్చిన తెలుగు వారియర్స్ టీం అందరూ ఊహించినట్లే ట్రోపీని సొంతం చేసుకుంది. మ్యాచ్ సందర్భంగా పలువురు స్టార్స్ సందడి చేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అఖిల్

అఖిల్

సిసిఎల్-5 ట్రోపీతో తెలుగు వారియర్స్ వైస్ కెప్టెన్ అఖిల్ అక్కినేని. పక్కనే కెప్టెన్ వెంకటేష్.

విజయోత్సాహం

విజయోత్సాహం

మ్యాచ్ విజయం తర్వాత తెలుగు వారియర్స్ జట్టు సభ్యులు ఇలా స్టేడియంలో చక్కర్లు కొట్టారు.

వెంకీ, నాగ్

వెంకీ, నాగ్

వెంకటేష్, నాగార్జున చాలా కాలం తర్వాత ఇలా ఒకరినొకరు హగ్ చేసుకుని కనిపించారు.

కాజల్

కాజల్

హీరోయిన్ కాజల్ మ్యాచ్ సందర్భంగా ఇలా హాట్ లుక్‌లో అందరినీ ఆకట్టుకుంది.

అఖిల్ హ్యాపీ

అఖిల్ హ్యాపీ

మ్యాచ్ గెలిచిన తర్వాత అఖిల్ అక్కినేని చాలా హ్యాపీగా కనపించాడు.

ట్రోపీతో టీం...

ట్రోపీతో టీం...

సిసిఎల్-5 విన్నర్స్ ట్రోపీతో తెలుగు వారియర్స్ జట్టు సభ్యులు.....

అందమైన భామలు

అందమైన భామలు

ఓ వైపు మ్యాచ్ జరుగుతుంటే...మరో వైపు హీరోయిన్లు తమ అందాలతో ఆకట్టుకున్నారు.

వెంకటేష్ ఆనందం...

వెంకటేష్ ఆనందం...

మ్యాచ్ విజయం తర్వాత వెంకటేష్ ఇలా ఆనందంతో ఉరకలెత్తారు.

బ్యూటీస్

బ్యూటీస్

సినీ రంగానికి చెందిన భామలు తమ స్టేడియంలో తమ హాట్ లుక్స్ తో ఆడియన్స్ దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు.

పూనం, నిఖిషా

పూనం, నిఖిషా

ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్లు పూనం బజ్వా, నిఖిషా పటేల్.

సందడే సందడి

సందడే సందడి


ఐపీఎల్ మ్యాచ్ లకు ఏ మాత్రం తీసి పోకుండా సందడి సాగింది సిసిఎల్ టోర్నమెంట్.

నాగ్, అఖిల్, వెంకీ

నాగ్, అఖిల్, వెంకీ


పక్క పక్కనే కూర్చుని మ్యాచ్ తిలకిస్తున్న నాగార్జున, అఖిల్ అక్కినేని, వెంకటేష్.

లక్ష్మీ రాయ్, సునీల్ శెట్టి

లక్ష్మీ రాయ్, సునీల్ శెట్టి

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టితో కలిసి సౌత్ హీరోయిన్ లక్ష్మి రాయ్.

చీర్ గాల్స్ సందడి

చీర్ గాల్స్ సందడి

మ్యాచ్ మధ్య మధ్యలో చీర్ గాల్స్ ఇలా సందడి చేసారు.

నాగార్జున

నాగార్జున

స్టేడియంలో బ్యాటు, బాలు పట్టుకుని నాగార్జున ప్రాక్టీస్....

అఖిల్ మెరుపులు

అఖిల్ మెరుపులు

అఖిల్ అక్కినేని మ్యాచ్ చివర్లో బ్యాటుతో మెరుపు షాట్లతో ఆకట్టుకున్నాడు.

సచిన్ జోషి

సచిన్ జోషి


అవార్డు తీసుకున్న అనంతరం భార్య, పిల్లలతో కలిసి సచిన్ జోషి.

అఖిల్ విజయోత్సాహం

అఖిల్ విజయోత్సాహం

మ్యాచ్ ముగిసిన అనంతరం విజయోత్సాహంతో అఖిల్.

సుధీర్ బాబు మెరుపులు

సుధీర్ బాబు మెరుపులు

ప్రముఖ నటుడు సుధీర్ బాబు తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.

English summary
CCL5 Final Telugu Warriors Vs Chennai Rhinos Match held at Hyderabad. Nagarjuna, Venkatesh, Kajal Agarwal, Sunil Shetty, Bobby Deol, Sohail Khan, Srikanth, Akhil Akkineni, Arya, Jeeva, Radhika, Madhurima, Sanjana, Huma Qureshi, Tarun, Prithvi, Sonia Agarwal, Lakshmi Rai, Lucky Sharma, Samiksha, Ramana, bharath, D Suresh Babu, Poonam Bajwa, Nikesha Patel, Nikitha, Siya Gowtham at the match.
Please Wait while comments are loading...