»   » విజయోత్సాహం: చీర్ గర్ల్స్‌తో వెంకీ చిందులు (సిసిఎల్-6 ఫోటోస్)

విజయోత్సాహం: చీర్ గర్ల్స్‌తో వెంకీ చిందులు (సిసిఎల్-6 ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సెలెబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ (సిసిఎల్) సీజన్ 6లో టాలీవుడ్ వారియర్స్ మరోసారి తమ సత్తా చాటారు. డిపెండింగ్‌ ఛాంపియన్‌ అయిన తెలుగు వారియర్స్‌ ఫైనల్లో రెండోసారి విజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు. కర్నాటక బుల్డోర్స్ జట్టుతో ఉప్పల్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 208 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన అఖిల్‌ అక్కినేని సారథ్యంలోని తెలుగు వారియర్స్‌ జట్టు ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 17.4 ఓవర్లలో 211 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించింది.

ఓపెనర్లు సచిన్‌ జోషి (114: 49 బంతుల్లో), ప్రిన్స్‌ (61 నాటౌట్‌: 43 బంతుల్లో) తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయానికి బాటలు వేశారు. చివర్లో సచిన్‌ జోషి ఔటైనా.. కెప్టెన్‌ అఖిల్‌ అక్కినేని 25 పరుగులతో ధాటిగా ఆడి గెలుపు లాంఛనాన్ని బౌండరీతో పూర్తి చేసాడు.

ఫైనల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియం మొత్తం అభిమానులతో కిటకిటలాడింది. మ్యాచ్ చూసేందుకు టాలీవుడ్ స్టార్స్ వెంకటేశ్‌, నాగార్జున, రానా, రెజీనా, అదా శర్మ, తాప్సీ, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ మంత్రి కెటీఆర్ కూడా హాజరై స్టార్స్ తో కలిసి సందడి చేసారు.

తెలుగు వారియర్స్ జట్టు విజయం సాధించగానే వెంకీ అండ్ టీం మైదానంలో సందడి చేసారు. చీర్స్ గర్ల్స్ తో డాన్స్ చేస్తూ హల్ చల్ చేసారు. అభిమానుల కేరింతల, స్టార్స్ సందడితో ఉప్పల్ స్టేడియంలో పండగ వాతావరణం నెలకొంది. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోస్...

చీర్ గర్ల్స్ తో...

చీర్ గర్ల్స్ తో...

విజయోత్సాహంలో చీర్ గర్ల్స్ తో చిందులేస్తున్న వెంకటేష్ అండ్ వారియర్స్ టీం...

విక్టరీ సెల్ఫీ

విక్టరీ సెల్ఫీ

తెలుగు వారియర్స్ టీం విక్టరీ సెల్పీ...

ట్రోపీతో..

ట్రోపీతో..

సిసిఎల్ 6 ట్రోపీతో తెలుగు వారియర్స్ టీం..

డాన్స్

డాన్స్

మ్యాచ్ విజయం అనంతరం వెంకటేష్ అండ్ టీం డాన్స్..

హీరోయిన్లు

హీరోయిన్లు

సిసిఎల్ 6 మ్యాచ్ సందర్భంగా హీరోయిన్లు సందడి చేసారు.

స్టేడియంలో...

స్టేడియంలో...

విజయం అనంతరం జట్టు మొత్తం స్టేడియంలో రౌండ్ వేస్తూ అభిమానులకు అభివాదం చేసారు.

కేటీఆర్

కేటీఆర్

సిసిఎల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్

కర్నాటక టీం

కర్నాటక టీం

సిసిఎల్ 6 రన్నరప్స్ గా నిలిచిన కర్నాటక బుల్డోజర్స్ టీం..

స్టార్స్..

స్టార్స్..

స్టార్లతో కలిసి మ్యాచ్ చూస్తున్న కేటీఆర్.

నాగ్ తో సెల్ఫీ..

నాగ్ తో సెల్ఫీ..

నాగార్జునతో కలిసి సెల్ఫీ...

బెస్ట్ ప్లేయర్

బెస్ట్ ప్లేయర్

బెస్ట్ ప్లేయర్ అవార్డు అందుకుంటున్న సచిన్ జోషి.

సెంచరీ

సెంచరీ

49 బంతుల్లో 114 పరుగులు చేసి అదరగొట్టాడు సచిన్ జోషి.

టాలీవుడ్

టాలీవుడ్

స్టార్ల సందడి తో మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది.

English summary
CCL 6 Final Match between Telugu Warriors vs Karnataka Bulldozers held at RGICS, Uppal, Hyderabad. Nagarjuna, Venkatesh, Sudeep, Akhil, Regina Cassandra, Adah Sharma, Shubra Aiyappa, Rakul Preet Singh, Parvathy Nair, Sharmila Mandre, Sumanth Ashwin, Sudheer Babu, Rana Daggubati, Taapsee, Sanjjanaa, KT Rama Rao, Ashok Kheny at the match.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu