»   »  సిసిఎల్: సుధీర్ బాబు, అఖిల్, ధరమ్ తేజ్, హీరోయిన్ల సందడి (ఫోటోస్)

సిసిఎల్: సుధీర్ బాబు, అఖిల్, ధరమ్ తేజ్, హీరోయిన్ల సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆదివారం కొచ్చిలో జరిగిన సీసీఎల్‌ (సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌)-6 లీగ్‌ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్‌ జట్టు... చెన్నై రైనోస్‌పై 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. సెమీ ఫైనల్‌ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకొంది. చెన్నై ఆటగాడు విక్రాంత్‌ సిరీస్‌లో తొలి సెంచరీ నమోదు చేసినప్పటికీ. తెలుగు ఆటగాళ్ల దూకుడు ముందు అది వృథా అయిపోయింది.

టాస్‌ గెలిచిన చెన్నై రైనోస్‌ జట్టు మొదట బ్యాటింగ్‌ ఎంచుకొంది. తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన ఆ జట్టు ఈసారి తప్పక గెలవాల్సిన పరిస్థితి. జట్టు ఆటగాడు విక్రాంత్‌ నిలకడగా ఆడాడు. కేవలం 64 బంతుల్లోనే 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. శంతను (24), కలైయరసన్‌ (14) చక్కటి సహకారం అందించారు. దీంతో చెన్నై రైనోస్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

తెలుగు వారియర్స్‌ ఆటగాళ్లు రఘు, సచిన్‌ జోషి, సామ్రాట్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్‌కి ఓపెనర్లు ప్రిన్స్‌, సచిన్‌ జోషి చక్కటి ఆరంభాన్ని అందించారు. చకచకా పరుగులు రాబడుతూ తొలి వికెట్‌కి 40 పరుగులు జోడించారు. ప్రిన్స్‌ 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కిక్‌ శ్యామ్‌ క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. సుధీర్‌బాబు క్రీజులోకొచ్చాక మళ్లీ పరుగుల వర్షం మొదలైంది. సచిన్‌, సుధీర్‌... ఇద్దరూ భారీ షాట్లతో మైదానాన్ని హోరెత్తించారు.

సుధీర్ బాబు

సుధీర్ బాబు


సుధీర్‌బాబు కేవలం 39 బంతుల్లోనే 70 (7 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులతో అజేయంగా నిలవడం విశేషం.

సచిన్ జోషి

సచిన్ జోషి


చివర్లో భారీ షాట్‌ కి ప్రయత్నంచి సచిన్‌ జోషి 72 (9 ఫోర్లు, 1 సిక్స్‌) ఔటయ్యాడు.

విన్నింగ్ షాట్

విన్నింగ్ షాట్


సుధీర్‌బాబు విన్నింగ్‌ షాట్‌గా బౌండరీ కొట్టడంతో తెలుగు జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసినట్టయింది.

హీరోయిన్లు

హీరోయిన్లు


తెలుగు వారియర్స్‌ జట్టుని ప్రోత్సహిస్తూ కథానాయికలు ప్రణీత, అదా శర్మ మైదానంలో సందడి చేశారు. కేథరిన్‌, నికీషా పటేల్‌, సోనియా అగర్వాల్‌ చెన్నై జట్టుని ప్రోత్సహించారు.

తెలుగు వారియర్స్

తెలుగు వారియర్స్


సీసీఎల్‌ (సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌)-6 లీగ్‌ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్‌ జట్టు... చెన్నై రైనోస్‌పై 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.

సెమీస్

సెమీస్


ఈ విజయంతో సెమీ ఫైనల్‌ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకొంది.

టాస్

టాస్


టాస్‌ గెలిచిన చెన్నై రైనోస్‌ జట్టు మొదట బ్యాటింగ్‌ ఎంచుకొంది.

చెన్నై

చెన్నై


తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన ఆ జట్టు ఈసారి తప్పక గెలవాల్సిన పరిస్థితి. దీంతో చెన్నై జట్టులో ఒత్తిడి కనిపించింది.

విక్రాంత్ సెంచరీ

విక్రాంత్ సెంచరీ


చెన్నై ఆటగాడు విక్రాంత్‌ సిరీస్‌లో తొలి సెంచరీ నమోదు చేసినప్పటికీ. తెలుగు ఆటగాళ్ల దూకుడు ముందు అది వృథా అయిపోయింది. కేవలం 64 బంతుల్లోనే 100 పరుగులతో అజేయంగా నిలిచాడు.

చెన్నై స్కోరు

చెన్నై స్కోరు


రైనోస్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

తెలుగు బౌలర్స్

తెలుగు బౌలర్స్


తెలుగు వారియర్స్‌ ఆటగాళ్లు రఘు, సచిన్‌ జోషి, సామ్రాట్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ప్రిన్స్, సచిన్

ప్రిన్స్, సచిన్


165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్‌కి ఓపెనర్లు ప్రిన్స్‌, సచిన్‌ జోషి చక్కటి ఆరంభాన్ని అందించారు.

సుధీర్ బాబు

సుధీర్ బాబు


సుధీర్‌బాబు క్రీజులోకొచ్చాక మళ్లీ పరుగుల వర్షం మొదలైంది

English summary
CCL 6 Telugu Warriors vs Chennai Rhinos Match held at Nehru Stadium, Kochi. Arya, Akhil, Srushti Dange, Nikki Galrani, Catherine Tresa, Nikesha Patel, Sonia Agarwal, Sripriya, Prithvi Rajan, Adah Sharma, Pranitha Subhash, Shanthanu, Radhika at the match.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu