For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాంచీ లో తెలుగు స్టార్ హీరోలు- ప్రాక్టీస్ మ్యాచ్ (ఫోటోలు)

  By Srikanya
  |

  రాంచీ: ఆద్యంతం ఆసక్తిరరంగా సాగుతున్న సీసీఎల్‌ వేదిక ఇప్పుడు రాంచీకి మారింది. ఆదివారం తెలుగు వారియర్స్‌. కర్ణాటక బుల్డోజర్స్‌తో తలపడనుంది. వరుసగా రెండు విజయాలతో ఈ టోర్నీని ఘనంగా ఆరంభించిన వెంకీ సేన.. హ్యాట్రిక్‌ అందుకోవాలని తహతహలాడుతోంది.

  ఆల్‌రౌండర్లు తెలుగు జట్టు బలం. మరోమవైపు కర్ణాటక జట్టుని తక్కువ అంచనా వేయలేం. ధీటైన ఆట తీరుతో ప్రత్యర్థులకు కంగారు పుట్టిస్తోంది. సుదీప్‌, దృవ్‌లాంటి ఆటగాళ్లున్నారు. వీళ్లంతా తెలుగు వారియర్స్‌ దూకుడును ఏ మాత్రం అడ్డుకొంటారో చూడాలి. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లూ రాంచీలో శనివారం ముమ్మర సాధన చేశాయి.

  సినిమావాళ్లు క్రికెట్‌ ఆడటమంటే ప్రేక్షకులకు లభించే వినోదం డబుల్‌ ధమాకాలా ఉంటుంది. భారతీయ చిత్ర పరిశ్రమలన్నీ వచ్చి ఒకచోట కలవడం చాలా బాగుంటోంది. సెలబ్రెటీ క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్‌) ప్రేక్షకులకు సరికొత్త వినోదం పంచిపెడుతోంది. స్టార్స్ సినిమాని కాసేపు పక్కన పెట్టి.. బ్యాట్‌, బంతితో ఓ ఆట ఆడుకొంటున్నారు. ప్రొఫెషనల్‌ క్రికెటర్లకు ఏ మాత్రం తీసిపోని ఆట తీరుతో.. ఔరా అనిపిస్తున్నారు. శనివారం మన హీరోలు చేసిన ప్రాక్టీసు ఫోటోలు మీ కోసం...

  నిజమైన ఆటగాళ్లు మైదానంలోకి దిగితే సిక్స్‌లు, ఫోర్లు, వికెట్లు... అంటూ వాటి గురించే మాట్లాడుకొంటుంటాం. అదే సినీ తారలు ఆడితే మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది.

  మైదానంలో తారల ప్రతి చిన్న కదలికనూ ప్రేక్షకులు ఆస్వాదిస్తుంటారు.

  క్రికెట్‌ని, సినిమాని కలగలిపిన సీసీఎల్‌ వినోదానికి వేదికగా నిలుస్తోంది.

  ఆటగాళ్ల దూకుడు చూస్తుంటే... సినిమావాళ్లు ఆడుతున్నట్టు అనిపించడం లేదు.

  తెలుగు వారియర్స్‌ ఆటతీరు అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. దానికి తగినట్లే వారు ప్రాక్టీస్ చేసి మరీ చెలరేగిపోతున్నారు.

  క్రికెట్,సినిమా ఆ రెండూ మేళవించిన సెలబ్రెటీ క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్‌) ప్రేక్షకులకు సరికొత్త వినోదం పంచిపెడుతోంది.

  తెలుగు హీరోలు వెండితరపైనే కాదు ...క్రికెట్ పిచ్ మీద కూడా రెచ్చిపోయి విజయాలు సొంతం చేసుకోగలరని నిరూపిస్తున్నారు.

  సెలబ్రెటీ క్రికెట్‌ లీగ్‌లో భాగంగా సిలిగురిలో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ టైగర్స్‌పై తెలుగు వారియర్స్‌ ఘనవిజయం సాధించింది. చూస్తున్న అభిమానులలో ఆనందం నింపింది.

  సీసీఎల్‌ 2లో సెమీఫైనల్‌ వరకూ వెళ్లిన... తెలుగు వారియర్స్‌ ఈసారి కప్పుపై గురి పెట్టింది.

  తెలుగు వారియర్స్‌ సిలిగురిలో ఘనమైన ఆరంభం ఇచ్చింది. తొమ్మిది వికెట్లతేడాతో విజయభేరీ మోగించి ప్రత్యర్థులకు సంకేతాలు పంపింది.

  ''క్రికెట్‌ అంటే నాకు చాలా ఇష్టం. స్కూల్‌ రోజుల్లో ఎక్కువగా ఆడేవాణ్ని. సినిమాల్లోకి వచ్చాక మాత్రం చూడటానికే పరిమితమయ్యాను. సీసీఎల్‌వల్ల మళ్లీ మైదానంలోకి దిగడం చక్కటి అనుభూతినిస్తోంది''అన్నారు యుంగ్ హీరో నిఖిల్‌.

  ''నేను ఆల్‌రౌండర్‌ని. అయితే బ్యాటింగ్‌ అంటేనే ఎక్కువ ఇష్టం. వచ్చిన ప్రతి బంతినీ బౌండరీకి తరలించాలని అనిపిస్తుంటుంది''అంటున్నారు బస్ స్టాప్ హీరో ప్రిన్స్.

  English summary
  The cricket team Telugu Warriors is busy preparing for the Celebrity Cricket League (CCL 3). Team captain Victory Venkatesh, Srikanth, Tharun and other young players of the team were seen practising bowling and batting for upcoming league matches of the third season at a ground in the Ranchy city on Saturday . The team has decided to lift this season's trophy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X