For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీసీఎల్‌ 3 ఫైనల్: షాడో Vs ఈగ (హైలెట్స్ ఫోటోలు)

  By Srikanya
  |

  బెంగళూరు: సీసీఎల్‌ టోర్నీలో కర్నాటక బుల్డోజర్స్‌ జట్టు విజేతగా ఆవిర్భవించింది. తెలుగు వారియర్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కర్నాటక బుల్డోజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 148 పరుగులు సాధించింది. తెలుగు వారియర్స్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 122 పరుగులకే పరిమితమవడంతో బుల్డోజర్స్‌ జట్టు 26 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అటు షాడో హీరో వెంకటేష్, ఈగ సుదీప్ పిచ్ పై రెచ్చిపోయారు.

  సినిమాలు, షూటింగ్‌ల నుంచి కాస్త పక్కకు వచ్చి బ్యాటు బంతి పట్టారు సినీ తారలు. ఆటవిడుపు ఆటైనా... అదరగొట్టారు. మ్యాచ్‌కో స్టార్‌.. నిజమైన 'క్రికెట్‌ స్టార్‌' అవతారం ఎత్తారు. నిజం క్రికెట్‌ మ్యాచ్‌కి ఏమాత్రం తీసిపోని వినోదం అందించారు. సినిమాల్లోలా 'డ్రామా'లూ, మలుపులూ ఇక్కడా ఉన్నాయి.

  బంతి బంతికీ ఉత్కంఠ పుట్టించారు. మైదానం బయట కథానాయికల హంగామాకు హద్దే లేదు. ఈలలూ, కేరింతలతో తమ జట్టుకు మద్దతు ఇచ్చారు. ఫలితం.. ఆట, అందం కలగలిసిన ఈ వినోదం.. సెలబ్రెటీ క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్‌) సూపర్‌ హిట్టయ్యింది.

  ఆట హైలెట్స్... స్లైడ్ షో లో వీక్షించండి

  వెంకటేష్‌ ఈ సీజన్‌లో తొలిసారి టాస్‌ ఓడారు. ఈసారి టాస్‌ సుదీప్‌ని వరించింది. ఆయన మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌ ఎంచుకొన్నారు

  తొలి ఓవర్లోనే కర్ణాటక బుల్డోజర్స్‌ వికెట్‌ కోల్పోయింది. రఘు బౌలింగ్‌లో సుదీప్‌ పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌ దారి పట్టాడు. తెలుగు వారియర్స్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగులు రావడం గగనమైంది. దానికి తోడు ఫీల్డింగ్‌లోనూ రాణించారు.

  నిర్మాత డి.సురేష్‌బాబు మ్యాచ్‌ ఆద్యంతం ఆస్వాదించారు. తెలుగు వారియర్స్‌ మెరిసినప్పుడల్లా.. ఆయన ఉత్సాహంతో కేరింతలు కొట్టడం అందరినీ ఆకట్టుకొంది.

  ప్రదీప్‌, మంజునాథ్‌ల అండతో ధృవ్‌ మరోసారి అలరించాడు. ఈ సీజన్‌లో నాలుగో అర్థసెంచరీ నమోదు చేశాడు.

  బుల్డోజర్స్‌ తరఫున ప్రచారకర్తగా ఐంద్రితా రాయ్‌, తెలుగు వారియర్స్‌ ప్రచారకర్త ఛార్మీ అభిమానుల్లో ఉత్తేజాన్ని కల్గించారు.

  అందాల తారలు జెనీలియా, ప్రియమణి తదితరులు చేతులు వూపుతూ అభిమానుల్ని అలరించారు.

  హైదరాబాదు బాంబు పేలుళ్ల దుర్ఘటనల నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటైంది.

  ఫైనల్స్‌ కావడంతో స్టేడియమంతా అభిమానులతో నిండిపోయింది. కన్నడ సినీ పరిశ్రమ కదిలి వచ్చింది. ఎనిమిది పరిశ్రమల తారలు, ప్రచార కర్తలు ఈ మ్యాచ్‌కి విచ్చేయడంతో స్టేడియం కళకళలాడిపోయింది.

  ''ప్రతీ మ్యాచ్‌ పోటాపోటీగా సాగింది. గత సీజన్‌లో మేం విజేతలుగా నిలిచాం. ఈసారి మాత్రం విఫలమయ్యాం. అయినా క్రికెట్‌లో ఉన్న మజా పూర్తిగా ఆస్వాదించాం. కర్ణాటక -చెన్నై మధ్య మ్యాచ్‌ ఎప్పుడూ రసవత్తరంగా జరుగుతుంది. కర్ణాటక అనగానే మావాళ్లూ రెచ్చిపోతారు. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌లానే ఉత్కంఠ కావల్సినంత ఉంటుంది. '' - విశాల్‌

  ' నేను సీసీఎల్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. తోటి నటీనటులతో కలిసి ఈ మ్యాచ్‌లు బాగా ఆస్వాదించాను. మొదట్నుంచీ నేను కర్ణాటక బుల్డోజర్స్‌ జట్టుకు మద్దతుగా ఉన్నాను. వాళ్లు ప్రొఫెషనల్‌ ఆటగాళ్లలా ఎంతో శ్రద్ధగా ప్రాక్టీస్‌ చేస్తుంటారు. అందుకే ఈసారి కప్పు కర్ణాటక జట్టుకే దక్కింది. ''. - ప్రణీత

  ఛార్మీ గాల్లో ముద్దులు కురిపిస్తూ ప్రేక్షకుల్ని ఉత్సాహ పరిచింది.

  ప్రియమణి మాట్లాడుతూ....''ప్రతి ఏడాదీ సీసీఎల్‌లో సరికొత్త జట్లు చేరడం ఉత్సాహాన్నిస్తోంది. వీర్‌ మరాఠి, భోజ్‌పురి దబాంగ్స్‌ తొలిసారి ఆడినా సత్తా చాటారు. చెన్నై-కర్ణాటక జట్లు ఫైనల్‌కి చేరతాయేమో అనుకొన్నా. నా అంచనా తప్పింది. క్రికెట్‌ అంటే నాకు చాలా ఇష్టం. సీసీఎల్‌తో ఆ ఇష్టం మరింత పెరిగింది. అన్ని జట్లలోనూ నా స్నేహితులు ఉన్నారు. తెలుగులో ఎక్కువ సినిమాలు చేశాను కాబట్టి.. వారికే నా సంపూర్ణ మద్దతు''.

  కన్నడ నటుడు అంబరీష్‌... వెంకటేష్‌తో కాసేపు మాట్లాడారు. జట్టు సభ్యులకు శుభాకాంక్షలు అందించారు.

  ఆదివారం బెంగళూరులో జరిగిన ఆఖరి పోరాటంలో తెలుగు వారియర్స్‌ పరుగుల వేటలో విఫలమైంది.

  గత రెండుసార్లు చివరి అంకంలో ఓడిపోయిన కర్ణాటక బుల్డోజర్స్‌ ఈసారి సీసీఎల్‌ విజేతగా ఆవిర్భవించింది. అన్ని విభాగాల్లోనూ సమష్టిగా రాణించి కప్పు అందుకొంది.

  English summary
  This season of Celebrity Cricket League saw some stunning performance where Karnataka Bulldozers defeated Telugu Warriors by 26 runs at Chinnaswamy stadium. This is the only team which has reached the finals in all the three editions of the Celebrity Cricket League. While they were the runner ups in the previous two editions, the Bulldozers changed their might on Sunday by winning the finale against Telugu Warriors.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X