For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ పొరపాటు చేయడం వల్లే సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది!

  |

  మెగా కాంపౌండ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్‌తో కనిపిస్తోన్న ఈ సుప్రీమ్ హీరో.. శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తన స్పోర్ట్స్ బైక్ మీద వెళుతోన్న సమయంలో అదుపుతప్పి కింద పడిపోయాడు. దీంతో వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లడం.. ఆ తర్వాత ఆస్పత్రిలో అతడికి చికిత్స అందించడం చకచకా జరిగిపోయాయి. ఇక, ఈ ప్రమాదంపై ఎన్నో రకాల ఊహాగానాలు వ్యక్తం అవుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే అతడు ఓవర్ స్పీడుగా వెళ్లాడన్న టాక్ కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కు సంబంధించిన సీసీ పుటేజ్ బయటకు వచ్చింది. ఇది చూసిన వారంతా ఈ యంగ్ హీరో ఓ తప్పు చేశాడని అనుమానిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం!

  సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ వివరాలు

  సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ వివరాలు

  మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి అతడు తన స్పోర్ట్స్ బైక్‌పై స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ గచ్చిబౌలీ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఐకియా దాటిన వెంటనే అతడు బైక్‌ నుంచి కిందపడిపోయారు. అప్పుడు సమయం సుమారు రాత్రి 7:30 అయి ఉంటుందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. దీంతో అతడిని స్థానికులు పోలీసుల సహాయం మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

  Bigg Boss: నాగార్జున పేరును వాడుతూ జస్వంత్ కామెంట్స్.. పాపం ఆ పని చేసి బుక్కైపోయాడుగా!

  సుప్రీమ్ హీరో కోసం కదిలిన మెగా ఫ్యామిలీ

  సుప్రీమ్ హీరో కోసం కదిలిన మెగా ఫ్యామిలీ

  సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ అయిందన్న విషయం తెలియగానే మెగా ఫ్యామిలీకి చెందిన వాళ్లంతా ఆస్పత్రికి చేరుకున్నారు. అందరి కంటే ముందుగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి తన మేనల్లుడిని చూడ్డానికి వచ్చారు. ఆ తర్వాత అల్లు అరవింద్, నిహారిక, వైష్ణవ్ తేజ్, సందీప్ కిషన్ సహా చాలా మంది ఆస్పత్రికి చేరుకున్నారు. ఇక, చిరంజీవి కూడా ఆ తర్వాత తన మేనల్లుడి కోసం ఆస్పత్రికి వచ్చారు. వీళ్లతో పాటు సాయి ధరమ్ తేజ్‌తో సంబంధాలు ఉన్న చాలా మంది ప్రముఖులు అతడిని చూడ్డానికి వస్తున్నారు.

  త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్, ప్రముఖులు

  త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్, ప్రముఖులు

  సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలియగానే తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. మరీ ముఖ్యంగా మెగా అభిమానులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆరంభంలో సాయి తేజ్‌ పరిస్థితి విషమంగా ఉందని వార్తలు రావడంతో ఫ్యాన్స్ భయపడిపోయారు. ఆ తర్వాత అతడు బాగానే ఉన్నాడని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఈ యంగ్ హీరో త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్‌తో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా ఆశిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా అతడి గురించి పోస్టులు పెడుతున్నారు.

  రామ్ చరణ్ చేతికి విలువైన వాచ్: దాని ధర ఎంతో తెలిస్తే నిద్ర కూడా పట్టదు.. ఇది కూడా రికార్డే!

  సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే

  సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే

  బైక్ మీద నుంచి పడిన తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కాలర్‌ బోన్‌ విరిగిందని శరీరంలోని అంతర్గతంగా గాయాలేవీ లేవని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు.

  యాక్సిడెంట్‌పై పోలీసులు ఏమన్నారంటే

  యాక్సిడెంట్‌పై పోలీసులు ఏమన్నారంటే

  సాయి ధరమ్ తేజ్‌కు జరిగిన ప్రమాదం గురించి శుక్రవారం రాత్రి మాదాపూర్‌ ఏసీపీ స్పందించారు. ప్రమాదం జరిగిన సమయంలో సాయి తేజ్‌ హెల్మెట్‌ పెట్టుకున్నాడని, అదే సమయంలో మద్యం సేవించలేదని తెలిపారు. రహదారిపై ఇసుక ఉండటం వల్ల బైక్‌ స్కిడ్‌ అయ్యిందని.. దాని వల్ల తేజ్‌ వాహనాన్ని అదుపు చేయలేకపోయారని ఆయన తెలిపారు. ప్రస్తుతం సాయి ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని ఏసీపీ తెలిపారు. దీంతో ఈ ప్రమాదంపై నెలకొన్న చాలా సందేహాలకు బ్రేక్ పడింది. ఇక, ఆ బైక్‌ను పోలీసులు తీసుకెళ్లారు.

  హాట్ ఫోజులతో రెచ్చిపోయిన సమంత: వామ్మో అలాంటి బట్టల్లో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  సీసీటీవీ పుటేజ్ బయటకు.. క్షణాల్లో వైరల్

  సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ జరిగిన తర్వాత దీనిపై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేశాయి. మరీ ముఖ్యంగా అతడు దాదాపు 120 కిలో మీటర్లకు పైగా స్పీడుతో బైక్ నడుపుకుంటూ వచ్చాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ పుటేజ్ బయటకు వచ్చింది. ఇందులో సాయి ధరమ్ తేజ్ అంత వేగంగా రాలేదన్న విషయం అర్థం అవుతోంది. ఇక, అతడు ఎడమవైపునకు పడిపోయి చాలా దూరం నేలపై జారుతూ వెళ్లిపోయాడు. దీంతో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ వీడియో కొన్ని క్షణాల్లో వైరల్ అయిపోయింది.

  Bheemla Nayak Singer Mogulaiah Launches Sundarangudu Poster
  ఆ పొరపాటు చేయడం వల్లే యాక్సిడెంట్

  ఆ పొరపాటు చేయడం వల్లే యాక్సిడెంట్

  సీసీటీవీ పుటేజ్ బయటకు వచ్చిన తర్వాత సాయి ధరమ్ తేజ్ ఓవర్ స్పీడుతో వెళ్లడం లేదని స్పష్టం అయింది. రోడ్డ చివరన మట్టి ఉండడం వల్లే అతడి బైక్ అదుపు తప్పినట్లు కూడా అర్థం అవుతోంది. అయితే, బైక్ అదుపు తప్పిన సమయంలో కంగారు పడిపోయిన అతడు ఫ్రంట్ బ్రేక్‌ను ప్రెస్ చేసి ఉంటాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే బైక్ పక్కకు వంగి కింద పడిపోయి ఉంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక, ప్రమాద సమయంలో హెల్మెంట్ ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు.

  English summary
  Mega Hero Sai Dharam Tej Met With An Accident on Friday Night in Hyderabad. CCTV Video Create Some Doubts on This Incident.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X