»   »  ప్రియాంక వంట కుక్కలు కూడా తినవు: బ్రిటన్ వంటగాడి అహంకారం

ప్రియాంక వంట కుక్కలు కూడా తినవు: బ్రిటన్ వంటగాడి అహంకారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటు బాలీవుడ్‌, అటు హాలీవుడ్‌లో ప్రియాంకా చోప్రా రాణిస్తోంది. ఈ మధ్య ఆస్కార్‌ లాంటి వేదికలపైనా మెరుస్తోంది. ఇటీవల ప్రియాంకా ఓ టాక్‌ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా ప్రియాంక సరదాగా కిచిడి, చికెన్‌ సూప్‌ చేసి చూపించింది. ఆ షోలో బ్రిటిష్ సెలబ్రిటీ చెఫ్ రామ్సే కూడా ఉన్నాడు. ఇతని వంటలు నలభీమ పాకంలో ఉంటాయి అంటారు చాలా మంది సెలబ్రిటీలు. రామ్సే వంట ఎంత బాగా చేస్తాడో ఇతరులు చేసే వంటకాలను అంతే ఆక్షేపిస్తూ ఉంటాడు.

రామ్సే తాజాగా మన ప్రియాంక చోప్రా చేసిన వంటపై కామెంట్‌ చేశాడు. ప్రియాంక వండింది రుచి చూసి 'ఛీ.. ఇది కుక్కకు పెట్టే ఫుడ్‌లా ఉంది' అని ఘాటుగా అన్నాడు. దీనిపై ప్రియంక అభిమానులు మండిపడుతున్నారు. జోర్డన్‌ రామ్సే వృత్తి వంట. కాని ప్రియాంక చోప్రా నటి.రామ్సేని ఒక్క సీన్ లో నటించి చూపమంటే నటించగలడా? అన్నది వారి ప్రశ్న...

నిజమే కదా..! అక్కడ ఉన్నది మరో హాలీవుడ్ సెలబ్రిటీ అయితే ఖచ్చితంగా అతని ఆన్సర్ మరోలా ఉండేది. ఆ వంటని అతను మెచ్చుకోకపోయినా ఇంత అవమానకరంగా మాత్రం మాట్లాడి ఉండేవాడు కాదు. అయినా ప్రియాంక కి ఇదే మొదటి సారేం కాదు. అడుగడుగునా ఆమెను భారతీయ పౌరురాలి గానే గుర్తిస్తూ ఇలా అవమానిస్తూనే ఉన్నారు.

ప్రియాంకా చోప్రా ఇటీవల ఈ గ్లోబర్‌ స్టార్‌ ఓ టాక్‌ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా ప్రియాంక సరదాగా కిచిడి, చికెన్‌ సూప్‌ చేసి చూపించింది. ఆ షోలో బ్రిటిష్ సెలబ్రిటీ చెఫ్ రామ్సే కూడా ఉన్నాడు. ప్రియాంక వండింది రుచి చూసి 'ఛీ.. ఇది కుక్కకు పెట్టే ఫుడ్‌లా ఉంది' అని ఘాటుగా అన్నాడు. దీనిపై ప్రియంక అభిమానులు మండిపడుతున్నారు.

English summary
Celebrity chef Gordon Ramsay, known for his acerbic comments on people’s culinary skills on social media, dissed Priyanka Chopra’s cooking on a chat show by Andy Cohen, calling the food she cooked recently as “dog’s dinner”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu