twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారతీయ సినిమా 100... సౌత్ ఫిల్మ్ ఫెస్ట్

    By Bojja Kumar
    |

     100 Years of Film Festival
    హైదరాబాద్ : భారతీయ సినిమా వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రరంగాలకు సంబంధించిన వారందరూ కలిసి భారీఎత్తున చెన్నైలో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు శర వేగంగా జరుగుతున్నాయి.

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 25, 26, 27 తేదీలలో ఈ వేడుక జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకలకు భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ సందర్భంగా డి.రాజా, సి.కల్యాణ్, ఎల్.సురేష్, రవి కొట్టార్కర్, కె.శ్రీనివాసన్, శరత్‌కుమార్, రాధారవి, కె.ఎస్.రామారావు రాష్టప్రతిని కలిసి ఆహ్వానం అందించారు.

    ముఖ్యఅతిథిగా పాల్గొనడానికి రాష్టప్రతి అంగీకరించారని, అలాగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అతిథులుగా పాల్గొనబోతున్నారని, వందేళ్ల భారతీయ సినిమా వేడుకల కోసం ఐదు రోజులపాటు షూటింగ్‌లకు సెలవు ప్రకటించాలని తాము నిర్ణయించుకున్నట్టుగా ప్రతినిధులు తెలియజేశారు.

    ఇటీవల బాలీవుడ్ పరిశ్రమ భారతీయ సినిమా వందేళ్ల పండుగను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాది సినీ పరిశ్రమ కూడా ఈ వేడుకల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సౌతిండియా ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వపడే విధంగా ఈ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    English summary
    South India Film Chamber of Commerce (SIFCC) is planning to celebrate the 100 Years of Indian Cinema. The event will go for three days in September on 25th, 26th and 27th at Chennai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X