For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'టెంపర్‌' ఫస్ట్ లుక్ తెలుగు సినీ సెలబ్రెటీల రియాక్షన్స్

  By Srikanya
  |

  హైదరాబాద్: అనుకున్నట్లుగానే అందరూ ఎదురుచూస్తున్న 'టెంపర్‌' మూవి ఫస్ట్ లుక్ వచ్చేసింది. పూరి జగన్నాథ్ తాను ఉదయం ప్రకటించినట్లుగానే ఫస్ట్ లుక్ ని విడుదల చేసేసారు. మీరు ఈ క్రింద ఆ ఫస్ట్ లుక్ ని చూడండి..మాస్ గా అదరిపోయేలా డిజైన్ చేసారు. ఈ పోస్టర్స్ పై సెలబ్రెటీలు రకరకాలుగా స్పందించారు. వాళ్ళు ఏం స్పందిచారు అనేది ఇప్పుడు చూద్దాం...

  ఎన్టీఆర్‌, కాజల్‌ జంటగా 'టెంపర్‌' చిత్రంలో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకుడు. బండ్ల గణేష్‌ నిర్మాత. ఇటీవల గోవాలో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.

  ఇక బుధవారం ముందస్తుగా ఎన్టీఆర్‌ ప్రచార చిత్రాలు కొన్ని బయటికొచ్చాయి. అవి అంతర్జాలంలో సందడి సృష్టిస్తున్నాయి. ఎన్టీఆర్‌ పోలీసు పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకూ గోవాలో యాక్షన్‌ ఘట్టాలతో పాటు కొన్ని సరదా సన్నివేశాల్ని తెరకెక్కించారు. జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

  ఆ రియాక్షన్స్ మీ కోసం....స్లైడ్ షోలో...

  ఛార్మి...

  పూరి జగన్ టెంపర్ ఫస్ట్ లుక్ 2 హాట్..హాటర్...హా............టెస్ట్... ఫ్యాన్స్ కు పండుగే...

  హరీష్ శంకర్

  నేను ఎప్పుడూ తారక్ లో యూత్ ఫుల్ యాంగిల్ ఉందని నమ్ముతాను..అది ఇప్పుడు ఇదిగో ఇలా బయిటకు వచ్చింది. " Hot " throb అన్నారు. ఇంతకు ముందు హరీష్ దర్శకత్వంలో రామయ్యా వస్తావయ్యా చిత్రం వచ్చింది.

  బ్రహ్మాజీ

  వామ్మో...పూరి ..సూపర్.. అని నటుడు బ్రహ్మాజీ అన్నారు. బ్రహ్మాజీకు, పూరి కి మొదటి నుంచీ మంచి స్నేహం ఉంది. పూరి చిత్రాల్లో బ్రహ్మాజికు ప్రత్యేక స్ధానం ఉంటూ వస్తోంది.

  గోపీచంద్ మలినేని

  ఇప్పటివరకూ యంగ్ టైగర్ తారక్ ...లుక్ లో బెస్ట్ ఇదే... పూరి జగన్ ..హిట్ కొడుతున్నాడు!. ప్రముఖ దర్శకుడుగా మారిన గోపిచంద్ మలినేని త్వరలో ఎన్టీఆర్ తో ఓ ప్రాజెక్టు చేసే అవకాసం ఉందని గత కొంతకాలంగా వినపడుతున్నదే.

  బండ్లగణేష్

  ధాంక్యూ బాద్షా, పూరీ అన్నా....

  నిర్మాత గణేష్...ఎన్టీఆర్ తో ఇది రెండో సారి... గతంలో శ్రీనువైట్ల దర్శకత్వంలో బాద్షా చిత్రం అందించారు.

  వెన్నెల కిషోర్...

  Shabbaaaa..టెంపర్ ఈజ్ బంపర్

  ఎన్టీఆర్ చిత్రాల్లో వెన్నెల కిషోర్ గతంలో నటించారు. ఇద్దరికీ మంచి ర్యాపో ఉంది.

  జాగ్రత్తలు

  జాగ్రత్తలు

  మరో ప్రక్క...కొంతకాలం దర్శకుడు,హీరో మధ్య ఇగో క్లాషెష్, కొంతకాలం భారీ వర్షాలు, మరికొంతకాలం స్ట్రైక్ ఇలా రకరకాల కారణాలు..పూరీ, ఎన్టీఆర్ సినిమాను ఆలస్యం చేస్తూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆ లేటు వెళ్లి ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్ మీద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పూరీ.

  లైవ్ ఎడిటింగ్

  లైవ్ ఎడిటింగ్

  అందులో భాగంగా లైవ్ ఎడిటింగ్ ని చేయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇందునిమిత్తం గోవా షూటింగ్ స్పాట్ కు ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్ వెళ్లారు. గతంలో ఎస్.ఆర్.శేఖర్.. పూరి చిత్రం ఇద్దరమ్మాయిలతో ట్రైలర్ కట్ చేసారు. ఆ ట్రైలర్ ప్రాజెక్టుకు మంచి క్రేజ్ తెచ్చిన సంగతి తెలిసిందే.

  క్రేజ్ మొదలైంది

  క్రేజ్ మొదలైంది

  చిత్రం ఫస్ట్ లుక్ విడుదల అవటంతో బిజినెస్ మొదలవుతుందని భావిస్తున్నారు. అదీ ఓ రేంజి క్రేజ్ లు ఉండబోతోందని చెప్తున్నారు.

  ఎవరెవరు...

  ఎవరెవరు...

  ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్లభరణి, ఆలీ. పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిశోర్‌, జయ ప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, పవిత్ర వంటి స్టార్‌ కాస్టింగ్‌ అంతా నటించడం కూడా ఈ సినిమాకి మంచి హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు

  English summary
  Puri Jagannadh,Ntr's Temper movie first look released. Tollywood Celebrities tweeted about this.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X