రామ్ చరణ్, అఖిల్ రిహార్సల్స్ (వీడియో)
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 24,25 తేదీలలో ఐఫా వేడుకలు జరగతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లే. ఈ ఉత్సవంలో ..స్టార్ సెలబ్రిటీలు తమ డ్యాన్స్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకునోనున్నారు. అందుకు రిహార్సల్స్ చేస్తోండగా, నిర్వాహకులు కూడా ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు భారీ సెట్స్ వేసారు. ఆ రిహార్శల్స్ కు చెందిన వీడియో ఇక్కడ చూడండి.
సౌత్ ఇండస్ట్రీలో తొలిసారి ఐఫా వేడుక కార్యక్రమం జరుగుతుండగా, దీనికి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలకు చెందిన పలువురు సినీ సెలబ్రిటీలు హాజరు కానున్నారు. గతంలో బాలీవుడ్‌లో మాత్రమే ఈ వేడుకలు జరిగాయి.

సౌత్‌లో మొదటిసారి జరుగుతున్న ఐఫా కార్యక్రమం డిసెంబర్‌లోనే జరగాల్సి ఉన్నా చెన్నై వరదల వలన ఈ కార్యక్రమం జనవరికు పోస్ట్ పోన్ చేసారు. ఈ కార్యక్రమానికి అల్లు శిరీష్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారని తెలుస్తోండగా, రామ్ చరణ్ , అఖిల్ స్పెషల్ పర్‌ఫార్మెన్స్ ఇవ్వనున్నారు.
More from Filmibeat
iifa ramcharan akshil devisriprasad allu sirish tollywood రామ్ చరణ్ అఖిల్ దేవిశ్రీప్రసాద్ అల్లు శిరీష్ టాలీవుడ్


Click it and Unblock the Notifications











