»   » రేసు గుర్రంపై రాజమౌళి అలా...శ్రీను వైట్ల ఇలా!

రేసు గుర్రంపై రాజమౌళి అలా...శ్రీను వైట్ల ఇలా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'రేసు గుర్రం' చిత్రం నిన్న విడుదలై తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. పైసా వసూల్ ఎంటర్టెనర్‌గా సినీ విశ్లేషకులు, ట్రేడ్ నిపుణులు ఈ చిత్రాన్ని పేర్కొంటున్నారు. కాగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా రేసు గుర్రం చిత్రంపై తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు. దర్శకుడు రాజమౌళి, శ్రీను వైట్ల, హరీష్ శంకర్, దేవా కట్ట, నిఖిల్, మధు శాలిని తదితరులు సినిమాపై తమ ఒపీనియన్ వెల్లడించారు.

రాజమౌళి : కంగ్రాజ్యులేషన్స్ సురేందర్ రెడ్డి గారు, బుజ్జి గారు, బన్నీ అండ్ ఎంటైర్ రేసు గుర్రం టీం. సినిమా చూసి చాలా ఎంజాయ్ చేసాం. శృతి యొక్క లోపల ఫీలింగ్స్, ఇంటర్వెల్ చాలా బాగా నచ్చింది. బన్నీ దేవుడా అన్న తీరు బాగుంది. ఇక కిల్ బిల్ పాండే సూపర్.

 Celebrities tweets on Allu arjun Race Gurram

శ్రీను వైట్ల: రేసు గుర్రం చిత్రం చూసాను. వెరీ రేసీ..ఎంజాయ్ చేసాను. టీం మొత్తానికి కంగ్రాజ్యులేషన్స్.

హరీష్ శంకర్: రేసు గుర్రం ఒక మంచి సమ్మర్ ఎంటర్టెనర్. బన్నీ ఫెంటాస్టిక్‌గా నటించాడు. వక్కతం, సురేందర్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌లకు కంగ్రాట్స్. స్పెషల్ కంగ్రాట్స్ టు శృతి హాసన్ గారు. స్క్రీన్‍‌పై చాలా హాట్‌గా కనిపించారు. ఎంజాయ్ ది సక్సెస్.

దేవా కట్ట: రేసు గుర్రం చిత్రం ఒక నవ్వుల జడివాన. బన్నీ టైమింగ్ చాలా బాగుంది. కిల్ బిల్ పాండే క్లైమాక్స్ కేక. టీం మొత్తానికి కంగ్రాట్స్.

బివిఎస్ రవి: బన్నీ వన్ మ్యాన్ షో. తమన్ మ్యూజిక్ సూపర్. వెల్ డన్ రేసు గుర్రం టీం.

నిఖిల్: రివ్యూలు కూడా అద్భుతంగా వచ్చాయి. రేసు గుర్రం టీం మొత్తానికి కంగ్రాట్స్. ముఖ్యంగా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన స్టైలిష్ స్టార్ బన్నీ‌కి.

మధు శాలిని: వెంటనే వెళ్లి రేసు గుర్రం చిత్రం చూడండి. నాకు చాలా బాగా నచ్చింది. బన్నీ కెరీర్లో ఇదో బెస్ట్ మూవీ. కిల్ బిల్ పాండే దుమ్మ రేపాడు.

శశాంక్ : బిగ్ హిట్ అందించిన రేసు గుర్రం టీంకు కంగ్రాట్స్. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సూపర్బ్ ఎంటర్టెనర్. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కేక. బ్రహ్మీ రాక్స్. సురేందర్ రెడ్డిగారికి కంగ్రాట్స్. ఫ్రెండ్స్‌తో వెళితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. పైసా వసూల్ చిత్రం.

English summary

 Allu arjun's Race Gurram is released out today with all positive reactions and here are some exclusive Tweets and comments from top celebrities of Tollywood Rajamouli, Srinu Vytla ect.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu