»   » 'మా' ఎన్నిక‌: వచ్చిన హీరోలు,ఆర్టిస్టులు (ఫొటోలు)

'మా' ఎన్నిక‌: వచ్చిన హీరోలు,ఆర్టిస్టులు (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ హైదరాబాద్‌ ఫిలిం ఛాంబర్‌లో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగింది. తెలుగు మూవీ ఆర్టిస్టుల సంఘంలోని మొత్తం 702 ఓట్లకు గాను 394 ఓట్లు పోలయ్యాయి. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(ఈవీఎం)ల ద్వారా పోలింగ్‌ నిర్వహించారు. ఒకరిద్దరు మినహా స్టార్ హీరోలెవ్వరూ ‘మా' ఎన్నికలపై అంతగా ఆసక్తి చూపలేదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సినీ నటులు బాలకృష్ణ, మురళీమోహన్‌, నాగబాబు, ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు, లక్ష్మీప్రసన్న, కృష్ణంరాజు, బ్రహ్మానందం, రావు రమేశ్‌, అజయ్‌, గిరిబాబు, రవిబాబు తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 'మా' అధ్యక్ష ఎన్నికపై సినీ పరిశ్రమతో పాటు తెలుగు ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

అధ్యక్ష పదవి రేసులో నటుడు రాజేంద్రప్రసాద్‌, నటి జయసుధతో పాటు బొమ్మరిల్లు ధూళిపాళ్ల అనే మరో నటుడు ఉన్నారు. మా ఎన్నికల నిర్వహణ న్యాయస్థానం పరిధిలోకి చేరినందువల్ల ఇవాళ పోలింగ్‌ మాత్రమే జరిగింది. ఫలితాలు కోర్టు తుది తీర్పు తర్వాత వెల్లడయ్యే అవకాశముంది.

ఎలక్షన్ ఫొటోలు..స్లైడ్ షోలో..

బాలకృష్ణ ఇలా...

బాలకృష్ణ ఇలా...

సీనియర్ నటుడు బాలకృష్ణ వచ్చి తన భాధ్యతగా ఓటు వేసారు.

కృష్ణం రాజు

కృష్ణం రాజు

మరో సీనియర్ నటుడు కృష్ణం రాజు గారు వచ్చి ఓటు వేసారు

హేమ

హేమ

సీనియర్ సహాయనటి హేమ వచ్చి ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

బ్రహ్మానందం

బ్రహ్మానందం

సీనియర్ నటుడు బ్రహ్మానందం వచ్చి ఓటు హక్కుని వినియోగించుకున్నారు

నాని

నాని

యంగ్ హీరో నాని తన భాధ్యతగా వచ్చి ఓటు వేసారు

పోటీలో ఉన్న ఇద్దరూ

పోటీలో ఉన్న ఇద్దరూ

పోటీపడుతున్న రాజేంద్రప్రసాద్, జయసుధ ఇలా మాట్లాడుకుంటూ...

జయసుధ

జయసుధ

ఈ అధ్యక్ష్య రేసులో రాజేంద్రప్రసాద్ తో పోటీ పడిన జయసుధ ఇలా వచ్చి ఓటు వేసారు

మెగా బ్రదర్

మెగా బ్రదర్

మెగా బ్రదర్ నాగబాబు మొదటి నుంచి ఈ ఎలక్షన్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు.

నాని

నాని

ఓటు కాగితం పట్టుకుని వెళ్తూ నాని ఇలా కనిపించారు

మంచు విష్ణు

మంచు విష్ణు

ఈ ఎలక్షన్స్ లో మంచు కుటుంబం ఉత్సాహంగా పాల్గొంది.

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి ప్రసన్న తన సోదురుడుతో కలిసి వచ్చి ఓటు వేసారు

బాలకృష్ణ

బాలకృష్ణ

ఓటు వేయటానికి వచ్చిన బాలకృష్ణ కారునుంచి...

బొమ్మరిల్లు జంట ఇలా

బొమ్మరిల్లు జంట ఇలా

బొమ్మరిల్లు నుంచి ఈ మధ్యదాకా వచ్చిన అనేక చిత్రాల్లో జంటగా చేసిన ప్రకాష్ రాజ్, జయసుధ ఇలా..

సుమన్

సుమన్

హీరోగా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా తనేంటో ప్రతీసారి నిరూపించుకుంటూ వస్తున్న సుమన్..ఈ ఎలక్షన్స్ కు వచ్చి ఓటేసారు.

మంచు విష్ణు

మంచు విష్ణు

ఓటేయటానికి వచ్చిన మంచు విష్ణు ఇలా బూతులో

బాలయ్య

బాలయ్య

బాలకృష్ణ కారు దిగి పోలింగ్ బూతులోకి వెళ్తూ ఇలా...

ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్

ఓటేయటానికి వచ్చిన ప్రకాష్ రాజ్ పోలింగ్ బూత్ లో ఇలా..

రాజేంద్రుడు

రాజేంద్రుడు

కూల్ గా కూర్చుని సెల్ చూసుకుంటున్న రాజేంద్రప్రసాద్

నర్సింగ్ యాదవ్

నర్సింగ్ యాదవ్

ఓటు హక్కు వినియోగించుకోవటానికి వచ్చిన క్యారెక్టర్ అర్టిస్టు నర్సింగ్ యాదవ్

లేడీ ఆర్టిస్టులు

లేడీ ఆర్టిస్టులు

ఓటు హక్కు వినియేగించుకోవటానికి వచ్చిన లేడీ ఆర్టిస్టులు సుధతో కలిసి మిగతా వాళ్లు

రవిబాబు

రవిబాబు

పోలింగ్ బూతు వద్ద..రవిబాబు..మురళిమోహన్ ఇలా...

అజయ్

అజయ్

విలన్ పాత్రలు వేసే అజయ్ ..ఇలా పోలింగ్ బాతుకి వచ్చారు.

తారకరత్న

తారకరత్న

నందమూరి తారకరత్న తన ఓటు హక్కుని వినియోగించుకోవటానికి వచ్చినప్పుడు ఇలా

కృష్ణుడు

కృష్ణుడు

నటుడు కృష్ణుడు తన ఓటు హక్కుని వినియోగించుకోవటానికి పోలింగ్ బూతుకు వచ్చినప్పుడు

నరేష్

నరేష్

క్యారెక్టర్ ఆర్టిస్టు నరేష్ తను ఓటింగ్ హక్కుని వినియోగించుకుంటూ...

బ్రహ్మీ

బ్రహ్మీ

ఓటు హక్కుని వినియోగించుకున్నాక..బ్రహ్మానందం..మురళిమోహన్ తో కలిసి ఇలా...

శివాజి

శివాజి

తన ఓటు హక్కుని వినియోగించుకోవటానికి వచ్చిన శివాజి

కోట శ్రీనివాసరావు

కోట శ్రీనివాసరావు

ఓటు హక్కుని వినియోగించుకవటానికి వచ్చినప్పుడు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు

రఘుబాబు

రఘుబాబు

క్యారెక్టర్ ఆర్టిస్టు, కమిడియన్ రఘుబాబు..ఇలా వచ్చినప్పుడు

బ్రహ్మాజి

బ్రహ్మాజి

సీనియర్ క్యారెక్టర్ నటుడు బ్రహ్మాజి ఓటు హక్కుని వినియోగించుకునేటప్పుడు

శ్రీకాంత్

శ్రీకాంత్

ఎన్నికలో ఓటేయటానికి వచ్చిన శ్రీకాంత్ ....

బాలకృష్ణ,మంచు లక్ష్మి

బాలకృష్ణ,మంచు లక్ష్మి

ఓటేసిన అనంతరం జయసుధ,బాలకృష్ణ, మంచు లక్ష్మి కలిసి మాట్లాడుతూ...

అజయ్

అజయ్

అజయ్,కృష్ణుడు ఇలా ఓటేసే సమయంలో బూతు వద్ద వెయిట్ చేస్తూ...

కృష్ణ భగవాన్

కృష్ణ భగవాన్

క్యారెక్టర్ ఆర్టిస్టు కృష్ణ భగవాన్ ఇలా పోలింగ్ బూతు వద్దకు వచ్చి...

రావు రమేష్

రావు రమేష్

మరో క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రస్తుతం విలన్ గా ఎదుగుతున్న రావు రమేష్ ఇలా వచ్చారు.

నాని,రాజేంద్రుడు

నాని,రాజేంద్రుడు

అధ్యక్ష్య పదివికి నిలబడ్డ రాజేంద్రప్రసాద్, యంగ్ హీరో నాని ని పలకరిస్తున్న వేళ

ధన్ రాజ్

ధన్ రాజ్

క్యారక్టర్ ఆర్టిస్టు, కమిడయన్ ధన్ రాజు ఇలా పోలింగ్ బూతు వద్దకు వచ్చినప్పుడు

వేణు

వేణు

కమిడయన్ వేణు ఇలా వచ్చి ఓటేసారు

సాయిరామ శంకర్

సాయిరామ శంకర్

హీరో సాయిరామ శంకర్ ఇలా వచ్చిన తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు

సుధ

సుధ

క్యారెక్టర్ ఆర్టిస్టు సుధ వచ్చి ఓటేసారు. ఆమె వెనకాలే కమిడయన్ వేషాలు వేసే అతను కూడా వస్తున్నారు చూడండి

విజయచందర్

విజయచందర్

క్యారెక్టర్ ఆర్టిస్టు,నిర్మాత, దర్సకుడు విజయచందర్ ఇలా వచ్చి ఓటేసారు

మంచు లక్ష్మి ప్రసన్న

మంచు లక్ష్మి ప్రసన్న

వరస సినిమాలతో బిజీగ ఉన్నా లక్ష్మి ప్రసన్న తీరికచేసుకుని ఇలా వచ్చి ఓటేసారు

కలర్స్ స్వాతి

కలర్స్ స్వాతి

హీరోయిన్ కలర్స్ స్వాతి ఇదిగో ఇలా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు

బ్రహ్మాజి

బ్రహ్మాజి


క్యారెక్టర్ ఆర్టిస్టు బ్రహ్మాజి ఇదిగో ఇలా ..వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు

వరుణ్ సందేష్

వరుణ్ సందేష్

హీరో వరుణ్ సందేశ్ ఇలా వచ్చి తన ఓటు హక్కుని వినియోగించుకన్నారు

జీవా

జీవా

క్యారెక్టర్ ఆర్టిస్టు, విలన్ వేషాలు వేసే జీవా...ఇలా ఓటు హక్కుని వినియోగించుకున్నారు

మధుషాలిని

మధుషాలిని

హీరోయిన్ మధుషాలిని ..ఇలా వచ్చి తన ఓటు వినియోగించుకున్నారు

రంగనాధ్

రంగనాధ్

సీనియర్ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు రంగనాధ్ ఇలా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకున్నారు

వడ్డే నవీన్

వడ్డే నవీన్

నటుడు వడ్డే నవీన్ ఇలా వచ్చి తన ఓటు హక్కుని వినియోగించుకన్నారు

గిరిబాబు

గిరిబాబు

సీనియర్ నటులు గిరిబాబు వచ్చి ఓటు హక్కుని వినియోగించుకున్నారు

కోర్టు తీర్పు నేపధ్యంలో ఎన్నికలను వీడియో చిత్రీకరించారు. గత కొన్ని రోజులుగా సవాళ్లు, ప్రతి సవాళ్లతో హాట్ హాట్ గా మారిన ‘మా' ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. పోలింగ్ రోజు (ఈరోజు) ఫిలించాంబర్ కు ఓటేసేందుకు వచ్చిన జయసుధ, రాజేంద్రప్రసాద్ ఒకరినొకరు పలకరించుకున్నారు.

తమ మధ్య వ్యక్తిగత వైరుధ్యాలు ఏమి లేవనీ ఇక నుంచి మళ్లీ అందరం కలిసే పని చేసుకుంటామని పేర్కొన్నారు. ఎవరు గెలిచినా సినీ కళాకారుల సంక్షేమం కోసం కలిసి పనిచేయాలని సూచించారు. కొన్ని రోజులుగా వాడివేడిగా మారిన ‘మా' వాతావరణం నేటితో చల్లబడింది.

English summary
Movie Artists Association (MAA) elections with fascinating battle on cards for various posts is started. After taking many turns versatile actor Rajendra Prasad & Jayasudha are in the battle for MAA president post. Watch the live updates on MAA elections...
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu