»   » పార్టీ చేసుకున్న రజనీ, చిరు, బాలయ్య, వెంకీ, హీరోయిన్లు(ఫోటోలు)

పార్టీ చేసుకున్న రజనీ, చిరు, బాలయ్య, వెంకీ, హీరోయిన్లు(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, మళయాల స్టార్ మోహన్ లాల్‌, కన్నడ స్టార్ అంబరీష్‌, బాలకృష్ణతో పాటు హీరోయిన్లు రాధా, రాధిక, నదియా, రమ్యకృష్ణ, సుమలత తదితరులు అంతా ఒక చోట చేరి పార్టీ చేసుకున్నారు. ఈ వయసులో వీళ్లు పార్టీ చేసుకోవడం ఏమిటనేగా మీ డౌట్. అయినా పార్టీ చేసుకోవడానికి వయసుతో పనేముందు లెండి..ఆస్వాదించే మనసుండాలికానీ!

వీరు పార్టీ చేసుకోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. వీరంతా 80ల్లో సినీ పరిశ్రమను ఏలిన స్టార్స్. ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలు, బిజినెస్ ఇలా వివిధ రంగాల్లో బిజీబిజీగా ఉన్న వీరంతా ఒక్క చోట కలిసి పార్టీ చేసుకోవాలని, పాత జ్ఞాపకాను నెమరు వేసుకోవాలనుకున్నారు.

తమిళనాడు ఇంజంబాక్కంలో ఉన్న మోహల్ లాల్‌కు చెందిన బీచ్‌ఫ్రంట్ ఫ్రాపర్టీ ఇందుకు వేదికైంది. ఈ నెల 18వ తేదీన ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీలో ఇంకా వెంకటేస్, నరేష్, భాను చందర్, సుహాసిని, సుమన్, జైరాం తదితరులుపాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

క్లాస్ ఆఫ్ 80 పార్టీ

క్లాస్ ఆఫ్ 80 పార్టీ


80ల్లో సౌత్‌లో సినీ పరిశ్రమను ఏలిన స్టార్లంతా క్లాస్ 80 పేరుతో పార్టీ చేసుకున్నారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు.

సెలబ్రేషన్స్

సెలబ్రేషన్స్


ఈ పార్టీలో అంతా కలసి కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. విందు, వినోదంతో సందడి చేసారు.

చిరంజీవి

చిరంజీవి


కేంద్రమంత్రి బాధ్యతలు నిర్వహిస్తూ బిజీగా గడిపే చిరంజీవి ఈ పార్టీకి హాజరైన కాస్త రిలీక్స్ అయ్యారు.

రజనీకాంత్

రజనీకాంత్


సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పార్టీలో తన‌తో కలిసి పని చేసిన పాత మిత్రులను కలవడంపై సంతోషం వ్యక్తం చేసారు.

వెంకటేష్

వెంకటేష్


తెలుగు స్టార్ వెంకటేష్ కూడా ఈ పార్టీలో పాల్గొని సందడి చేసారు.

అంబరీష్, జైరాం

అంబరీష్, జైరాం


క్లాస్ ఆఫ్ 80 పార్టీలో కన్నడ స్టార్ అంబరీష్, తమిళ నటుడు జైరాం.

English summary
Rajinikanth, Chiranjeevi, Jayaram, Ambareesh, Venkatesh and others present during the Class Of 80's party held at actor Mohanlal's beachfront property in Injambakkam on Saturday evening, Jan 18th, 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu