»   » నిర్మాత కూతురు పెళ్లిలో సినీతారల సందడి (ఫోటోలు)

నిర్మాత కూతురు పెళ్లిలో సినీతారల సందడి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా సూపర్ గుడ్ ఫిల్మ్, తెలుగు సినీ పరిశ్రమలోని పాపులర్ సినీ నిర్మాణ సంస్థల్లో ఒకటి. ఈ ప్రొడక్షన్ సంస్థ పర్మినెంట్ ప్రొడ్యూసర్లలో పారస్ జైన్ ఒకరు. ఇప్పటి వరకు ఆయన రచ్చ, మిస్టర్ పెళ్లి కొడుకు, నవ వసంతం, అన్నవరం, అందాల రాముడు తదితర చిత్రాలను నిర్మించారు.

పారస్ జైన్ కూతురు లావణ్య వివాహం శ్రీనిల్‌తో ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. తిరుపతిలోని పిఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో నవంబర్ 25న లావణ్య-శ్రీనిల్ వివాహ మహోత్సవం జరిగింది. వివాహ అనంతరం పారస్ జైన్ సినీ పరిశ్రమ ప్రముఖుల కోసం గ్రాండ్‌గా రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేసారు. పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన ధూవరులను ఆశీర్వదించారు.

సినీ నటులు సునీల్, అలీ, హీరో జీవా, ఫిల్మ్ మేకర్ ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్, డివివి దానయ్య, ఎం సాంబశివరెడ్డి, డాక్టర్ శివప్రసాద్, వి సముద్ర, వడ్డె రామానుజం, ఉమేష్ గుప్తా, డిస్ట్రిబ్యూటర్లు పిడి ప్రసాద్, వీర్రాజు తదితరులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో చూద్దాం...

సునీల్

సునీల్


పారస్ జైన్ నిర్మించిన మిస్టర్ పెళ్లి కొడుకు చిత్రంలో నటించిన హీరో సునీల్ ఈ వివాహ వేడుకకు హాజరైన నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

అలీ

అలీ


ప్రముఖ తెలుగు కమెడియన్ అలీ.... పారస్ జైన్ నిర్మించిన పలు చిత్రాల్లో నటించారు. సునీల్‌తో పాటు అలీ కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఆర్.బి.చౌదరి

ఆర్.బి.చౌదరి


ప్రముక నిర్మాత ఆర్.బి.చౌదరి గతంలో పారస్ జైన్‌తో కలిసి సంయుక్తంగా పలు చిత్రాలు నిర్మించారు. పారస్ జైన్ ఆహ్వానం మేరకు హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

హీరో జీవా

హీరో జీవా


నిర్మాత ఆర్.బి.చౌదరి తనయుడైన జీవా తన తండ్రితో కలిసి పారస్ జైన్ కూతురు వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులు లావణ్య-శ్రీనిల్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్వి ప్రసాద్

ఎన్వి ప్రసాద్


టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్ కలిసి పలు చిత్రాలను సంయుక్తంగా నిర్మించారు. ఎన్వీ ప్రసాద్ ఈ వేడుకకు హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు.

డాక్టర్ శివప్రసాద్

డాక్టర్ శివప్రసాద్


నటుడు, తెలుగు దేశం పార్టీ ఎంపీ డాక్టర్ శివప్రసాద్ పారస్ జైన్ కూతురు లావణ్య వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కూతురు, అల్లుడితో పారస్ జైన్ దంపతులు

కూతురు, అల్లుడితో పారస్ జైన్ దంపతులు


కూతురు లావణ్య, అల్లుడు శ్రీనిల్‌తో కలిసి పారస్ జైన్ దంపతులు.

లావణ్య-శ్రీనిల్

లావణ్య-శ్రీనిల్


నూతన వధూవరులు లావణ్య-శ్రీనిల్. వీరి వివాహం నవంబర్ 25న తిరుపతిలో జరిగింది.

గ్రాండ్ వెడ్డింగ్ సెర్మనీ

గ్రాండ్ వెడ్డింగ్ సెర్మనీ


తన కూతురు లావణ్య వివాహం సందర్భంగా పారస్ జైన్ భారీ ఏర్పాట్లు చేసారు. తిరుపతిలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ సెర్మనీల్లో ఇదీ ఒకటిగా నిలిచింది.

English summary
Mega Super Good Films is one of the popular film production banners in Telugu film industry and Paras Jain is one of the prominent producers of this house. He has produced several big-ticket movies like Mr Pellikodukku, Rachcha, Nava Vasantham, Annavaram and Andala Ramudu under this banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu