»   » ఆ హీరోలు భార్యల కంటే వయసులో చిన్న (ఫోటో ఫీచర్)

ఆ హీరోలు భార్యల కంటే వయసులో చిన్న (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ సినిమా స్టార్స్ అంతా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు, పెళ్లికి కులం, మతం మాత్రమే కాదు....వయసు తేడా అడ్డు రాలేదు. ఒక్కటయ్యారు...అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. ఉత్తమ జంటలుగా పేరు తెచ్చుకున్నారు. ఈ కాలంలో ఇలాంటి వివాహాలు సర్వసాధారణం అయ్యాయి.

సెలబ్రిటీ ప్రపంచంలో కుల, మత, ప్రాంత రహితమైన పెళ్లిళ్లు మాత్రమే కాదు.....వయసు తేడా ఉన్న వివాహాలు కూడా సర్వసధారణ అయిపోయాయి. భారత క్రికెట్ ప్రపంచం ఆరాధించే సచిన్ టెండూలర్కర్ కూడా తనకంటే వయసులో పెద్దైన అంజలిని వివాహమాడి సంగతి తెలిసిందే.

సినిమా రంగంలో తమకంటే వయసు ఎక్కువగా ఉన్న భామలను పెళ్లాడిన స్టార్స్ గురించిన వివరాలు స్లైడ్ షోలో.....

సునీల్ దత్, నర్గీస్

సునీల్ దత్, నర్గీస్

పాతతరం బాలీవుడ్ స్టార్ సునీల్ దత్ తనకంటే వయసులో సంవత్సరం పెద్దయిన తన కోస్టార్ నర్గీస్‌ను ప్రేమించి పెళ్లాడారు. మదర్ ఇండియా సినిమా సమయంలో తనను అగ్నిప్రమాదం నుడి కాపాడిన సునీల్ దత్ పై నర్గీస్ మనసు పారేసుకుంది. అలా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది.

రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి

రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి తనకంటే మూడు నెలలు చిన్నవాడైన రాజ్ కుంద్రాను ప్రేమించి పెళ్లాడింది. నవంబర్ 22, 2009లో వీరి వివాహం జరిగింది.

ఫర్హాన్ అక్తర్, అధునా భబాని

ఫర్హాన్ అక్తర్, అధునా భబాని

బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ తనకంటే ఏకంగా ఆరేళ్ల వయసు ఎక్కువ గల అధునా భబానిని పెళ్లాడారు. వీరు అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు.

శిరీష్ కుందర్, ఫరా ఖాన్

శిరీష్ కుందర్, ఫరా ఖాన్

బాలీవుడ్ ఫిల్మ్ ఎడిటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయిన శిరీష్ కుందర్...వయసులో తనకంటే 8 ఏళ్లు పెద్దదయిన ఫరా ఖాన్‌ను ప్రేమించి పెళ్లాడాడు.

అభిషేక్, ఐశ్వర్య

అభిషేక్, ఐశ్వర్య

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన భార్య ఐశ్వర్యరాయ్ కంటే వయసులో రెండేళ్లు చిన్నవాడు. వీరికి ఆరాధ్య బచ్చన్ అనే కూతురు కూడా జన్మించింది.

అర్జున్ రాంపాల్, మెహర్

అర్జున్ రాంపాల్, మెహర్

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కంటే ఆయన భార్య మెహర్ వయసు రెండేళ్లు ఎక్కువు. మాజీ సూపర్ మోడల్ అయిన మెహర్‌ను ఆలత 1998లో పెళ్లాడారు.

ఆదిత్య పంచోలి, జరీనా వాహెబ్

ఆదిత్య పంచోలి, జరీనా వాహెబ్

బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి...నటి జరీనా వాహెబ్‌ను 26 ఏళ్ల క్రితం పెళ్లాడారు. జరీనా వాహెబ్ కంటే ఆదిత్య పంచోలి ఆరేళ్లు చిన్నవాడు.

English summary
Age is just a number for those in love, even in Bollywood the couples don't let something like age come in between their love for each other. There are many Bollywood celebs and actors who are younger than their wives.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu