»   »  సెలీనా సరేనంది...

సెలీనా సరేనంది...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Celina Jaitely
రోజుకో హీరోయిన్ లు ఐటం బాంబ్ లగా మారుతున్న సమయమిది. ప్రస్తుతం ఆ లిస్టులోకి బాలీవుడ్ సెక్సీభామ సెలీనా జైట్లీ చేరుతోంది. ఆమె మెగా సీరియల్స్ నిర్మాత ఏక్తాకపూర్ నిర్మిస్తున్న'C Kkompany"లో ఐటం సాంగ్ చేస్తోంది. కాని ఆ సాంగ్ లో చేయటనానికి చాలా రకాలుగా ఒప్పించాల్సి వచ్చిందిట. మిగతా హారోయిన్లు ఐటం సాంగ్ లో చేసిన సినిమాల లిస్టు చెప్పి నచ్చ చెప్పాల్సివచ్చిందిట. అంతేగాక ఆశాజనకంగా లేని ఆమె కెరీర్ నిజ స్వరూపాన్ని వివరించాల్సి వచ్చిందిట.

నిజానికి ఫేడవుట్ అయ్యే దశలో హీరోయిన్లు తెలివిగా తీసుకునే నిర్ణయమిది. అలా తమ ముదురు అందచందాలను చూపి వారు తిర్గి మార్కెట్ లోకి ప్రవేశించే వ్యూహమది. కాని సెలీనా ఇదో ట్రెండ్ గా భావించి నిర్ణయం తీసుకున్నాని ఇప్పుడు చెపుతోంది. ఎందుకంటే ఆమె చేతినిండా సినిమాలు ఉన్నాయిని కూడా చూపుతోంది. సచిన్ యారది దర్శకత్వం చేస్తున్న ఈ 'C Kkompany" సినిమాలో తుషార్ కపూర్,రాజ్ పాల్ యాదవ్,అనుపమ ఖేర్ ఈ ఐటం సాంగ్ లో ఆమెతో కలసి నర్తించబోతున్నారు. దానికి సెలీనా సంతోషం వ్యక్తం చేస్తోంది.

అంతేగాక ప్రస్తుతం ఆస్ట్రేలియా...న్యూజిలాండ్ కొలాబిరేషన్ లో వస్తున్న 'Love Has No Language" సినిమాలో గుర్తుండిపోయే పాత్రను చేస్తున్నానని ఆమె చేప్తోంది. అలాగే తెలుగులోనూ ఆమె గతంలో మోహన్ బాబు కుమారుడు విష్ణువర్ధన్ 'సూర్య' సినిమాలో హీరోయిన్ గా చేసింది. అందాలు ఆరబోస్తూ నటించినా తర్వాత ఆమె నిర్మాతలు ఎవరి దృష్టిలో పడక పోవటంతో కనిపించలేదు. యేదైమైనా ఐటం సాంగ్ లో స్పెషల్ గా తన అందచందాలు చూపటానికి ఒప్పుకున్న సెలీనా కి దర్శక నిర్మాతలు ధాంక్స్ చెపుతున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X