»   » సెన్సార్ బోర్డ్ బ్యాన్ చేసిన తెలుగు పదాలు ఇవే

సెన్సార్ బోర్డ్ బ్యాన్ చేసిన తెలుగు పదాలు ఇవే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:సినిమాల్లో అశ్లీల పదాలు, ద్వంద్వార్థాల మాటలు, మహిళల గౌరవాన్ని భంగపరిచే పదాలను పూర్తి స్థాయిలో నియంత్రించాలని కేంద్ర ఫిలిమ్ సెన్సార్ బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తెలుగు నుంచి కొన్ని పదాలును ఎంపిక చేసి సినిమాల్లో ఇవి వినపడకూడదని తెలియచేసారు. ఆ పదాలు కొన్ని క్రింద..

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

గాడిద కొడక
బొక్క, బొంగు
నాయాల
ముష్టి నాయాల
నీయమ్మ
అమ్మ నీయమ్మ
చెత్త నా కొడక
వీపి

ఇలాంటి 30 పదాల దాకా సెన్సార్ బోర్డ్ బ్యాన్ చేసింది. ప్రత్యేకించి మహిళల పట్ల అగౌరంగా ఉండే పదాలు ఏవీ కూడా వాడరాదని స్పష్టం చేసింది.

Censor bans THESE Telugu words from movies

ఇక ఇప్పటికే...

బాస్టర్డ్, స్క్రూ, బిచ్ వంటి కొన్ని అశ్లీల పదాలను ఉదహరిస్తూ ఓ జాబితాను రూపొందించి, వాటిని సినిమాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదని ఆదేశాలు జారీ చేసింది. ఇంగ్లీషు, హిందీ భాషలకు సంబంధించి అనేక అశ్లీల పదాలు సినిమాల్లో యథేచ్ఛగా చోటు చేసుకుంటున్నట్లు బోర్డు గమనించింది. ఇతర భాషల్లోనూ ఈ పదాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారులకు ఇప్పటికే సర్క్యులర్లు పంపామని కేంద్ర ఫిలిమ్ సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లాజ్ నిహలానీ స్పష్టం చేశారు.

అభ్యంతరకరమైన పదాలు లేకుండా దృష్టి సారించాలని నిర్మాతల సంఘాలకు కూడా సెన్సార్ బోర్డు సూచించింది. కాగా, సినిమాల్లో కొన్ని పదాలను నిషేధించడం నిర్మాతల స్వేచ్ఛను అడ్డుకోవడమే అవుతుందని సెన్సార్ బోర్డు సభ్యుడు అశోక్ పండిట్ ఈ సర్క్యులర్లను వ్యతిరేకించారు. బోర్డు చైర్మన్ నిహలానీ నిర్మాతల సృజనాత్మకను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఓ నిర్మాతగా తాను ఈ తరహా సర్క్యులర్లను అంగీకరించేది లేదన్నారు. మహిళలపై హింస, లైంగిక వేధింపులను రెచ్చగొట్టే అశ్లీల పదాలు, ద్వంద్వార్థాలను అనుమతించేంది లేదని చైర్మన్ పేర్కొనడంతో సామాజిక మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళల గౌరవాన్ని కాపాడాలని కొందరు, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోరాదని మరికొందరు ‘ట్వీట్లు' చేస్తుండడంతో ప్రస్తుతం సామాజిక వెబ్‌సైట్లలో సరికొత్త చర్చకు తెర లేచింది

సినిమాల్లో ద్వంద్వార్థాలు, తిట్లు, ఇతర దుష్టపదాల ఉపయోగాన్ని నిషేధిస్తూ కేంద్ర సెన్సార్ బోర్డు ఉత్తర్వులు జారీచేసింది. ముందుగా ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఏయే పదాలను ఉపయోగించకూడదో ఒక పెద్ద జాబితా విడుదల చేసింది. అందుకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

ఇంగ్లీషులో నిషేదించిన పదాల విషయానికొస్తే....బాస్టర్డ్, సనాఫ్ ఎ బిచ్, మాస్టర్ బేటింగ్, ఫక్, ఫకర్ లేదా ఫకింగ్, మదర్ ఫకర్, ఫకింగ్ కంట్, కాక్ సకర్, ఫకింగ్ డిక్, స్క్రూ, డిక్ యాష్ హోల్, బిచ్, పుస్సీ తదతర పదాలను నిషేదించారు.

హిందీలో బ్యాన్ చేసిన పదాలు...హరమ్ జాదా, హరామి, హరమ్ కా పిల్లా, హరమ్ కా జానా, బద్వా, మదర్ చోద్, బేంచోద్, బోసిడికె, గాంసడు, చూతియా తదితర పదాలు నిషేదించారు. దీంతో పాటు మహిళలపై హింసాత్మ సన్నివేశాలు చిత్రీకరించకూడదని కేంద్ర సెన్సార్ బోర్డు ఉత్తర్వులు జార చేసింది.

English summary
The Central Board of Film Certification has recirculated the list of cuss words in Telugu to be banned by filmmakers. The list contains more than 30 Telugu words .
Please Wait while comments are loading...